ఏకంగా 12 ఎలక్ట్రిక్‌ కార్లకు యజమాని.. నెలకు రూ.6 లక్షలు ఆదా..!!

దేశంలో పెరుగుతున్న ఇంధన రేట్ల కారణంగా అనేక మంది ప్రజలు ఎలక్ట్రిక్‌ కార్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో అనేక కార్ల తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రస్తుతం టాటా మోటార్స్‌ సంస్థ ఈ విభాగం ఆధిపత్యం కొనసాగిస్తోంది.

దీంతోపాటు హ్యుందాయ్‌, మహీంద్రా, మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ, కియా సహా ఇతర సంస్థలు కూడా భారత్‌ మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ కార్లను విడుదల చేస్తున్నాయి. కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు తమ కంపెనీల అవసరాల కోసం ఎలక్ట్రిక్‌ కార్లనే ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నాయి.

Kerala man owns 12 electric cars and saves rs6 lakh per month

అయితే కేరళకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 12 ఎలక్ట్రిక్‌ కార్లను కలిగి ఉన్నాడు. ఈ కార్లను వినియోగించడం ద్వారా ప్రతి నెలా రూ.6 లక్షలు ఆదా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను బైజు ఎన్‌ నాయర్‌ తన యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు సురేష్‌, హైటెక్‌ పేరుతో అనేక ల్యాబ్‌లను నిర్వహిస్తున్నారు.

సురేష్‌ తన సొంత అవసరాల కోసం కియా EV6 ఎలక్ట్రిక్‌ కారును మాత్రమే వినియోగిస్తారు. తన వ్యాపార అవసరాల కోసం మరో 11 ఎలక్ట్రిక్‌ కార్లను కొనుగోలు చేశారు. పీల్డ్‌ వర్క్‌ కోసం అన్ని ల్యాబ్‌లు టాటా నెక్సాన్‌, టిగోర్‌ ఈవీని ఉపయోగిస్తాయి. ఇతర కార్లను ఉద్యోగులు, కస్టమర్ల నుంచి శాంపిల్‌ కలెక్షన్‌ కోసం వినియోగిస్తారు.

Kerala man owns 12 electric cars and saves rs6 lakh per month

ఈ ఎలక్ట్రిక్‌ కార్ల కారణంగా నెలకు ఇంధన ఖర్చుల కింద రూ.6 లక్షల వరకు ఆదా చేస్తున్నట్లు చెప్పారు. కియా EV6 ఎలక్ట్రిక్‌ కారును 20000 కి.మీ కంటే ఎక్కువ దూరం నడిపానని, ఈ కారుపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు కియా ఎలక్ట్రిక్‌ కారులో ఎలాంటి లోపం కనిపించలేదని పేర్కొ్న్నారు.

ఎలక్ట్రిక్‌ కారు కొనుగోలుకు ప్రారంభంలో ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని, అయితే వినియోగించే సమయంలో అధికంగా డబ్బు ఆదా చేసుకోవచ్చని తెలిపారు. నెక్సాన్‌ ఈవీ, టిగోల్‌ ఈవీ కార్ల ఉపయోగించే తమ డ్రైవర్లు కూడా తమ వాహనాల పట్ల సంతోషంగా ఉన్నారని తెలిపారు. కియా ఈవీ6 కారుతో పోలిస్తే టిగోర్‌, నెక్సాన్ ఈవీ వాహనాలకు ఎక్కువ నిర్వహణ ఖర్చులు అవసరం అని చెప్పారు.

చాలా మంది ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఛార్జింగ్‌ పాయింట్లు, సర్వీస్‌ సెంటర్ల కొరత కారణంగా అనేక మంది వెనక్కి తగ్గుతున్నారు. ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే... ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, August 27, 2023, 14:39 [IST]
English summary
Kerala man owns 12 electric cars and save rs6 lakh per month
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+