దుబాయ్‌లో రిజిస్టర్ అయిన కారుకు కేరళలో ఫైన్ వేశారు, ఎందుకో తెలుసా?

దేశంలోని సంపన్నులు కోట్ల రూపాయల ఖరీదు చేసే కార్లను కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారు కానీ, వాటిపై పన్నులు చెల్లించడానికి మాత్రం ముందుకి రావటం లేదు. అడ్డదారిలో ఖరీదైన లగ్జరీ కార్లను మనదేశంలోకి దిగుమతి చేసుకొని, వాటిపై చెల్లించాల్సిన దిగుమతి సుంఖాన్ని ఎగవేస్తున్నారు.

దుబాయ్‌లో రిజిస్టర్ అయిన కారుకు కేరళలో ఫైన్ వేశారు, ఎందుకో తెలుసా?

తాజాగా, ఇలాంటి సంఘటనే కేరళ రాష్ట్రంలో జరిగింది. కేరళలోని తిరువనంతపురంలో దుబాయ్ దేశంలో రిజిస్టర్ అయిన ఓ రోల్స్ రాయిస్ కారును అధికారులు గుర్తించారు. ఈ కారుపై చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ఎగ్గొట్టి, యదేచ్ఛగా దుబాయ్ రిజిస్ట్రేషన్‌తో తిరుగుతున్న రోల్స్ రాయిస్ కారును కేరళ రాష్ట్ర మోటారు వాహన శాఖ స్వాధీనం చేసుకుంది.

దుబాయ్‌లో రిజిస్టర్ అయిన కారుకు కేరళలో ఫైన్ వేశారు, ఎందుకో తెలుసా?

భారతదేశంలోకి ఎంట్రీ టాక్స్ చెల్లించనందుకు సదరు రోల్స్ రాయిస్ కారు యజమానికి కేరళ మోటారు వాహన శాఖ జరిమానా కూడా విధించినట్లు నివేదికలు చెబుతున్నాయి. విదేశీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనాలు భారతదేశంలోకి ప్రవేశించడానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

దుబాయ్‌లో రిజిస్టర్ అయిన కారుకు కేరళలో ఫైన్ వేశారు, ఎందుకో తెలుసా?

ఈ నేపథ్యంలో, దుబాయ్ రిజిస్ట్రేషన్‌తో కూడిన సదరు రోల్స్ రాయిస్ కారు యజమాని, ఆ కారుని మనదేశంలో ఉపయోగించడానికి ఎంట్రీ టాక్స్ చెల్లించడంలో విఫలమైనట్లుగా తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అతనికి రూ.35,000 జరిమానా విధించారు. భారతదేశంలోకి ప్రవేశించే విదేశీ రిజిస్టర్డ్ వాహనాలపై ఎంత మేర పన్ను విధిస్తారనేది స్పష్టంగా తెలియదు.

దుబాయ్‌లో రిజిస్టర్ అయిన కారుకు కేరళలో ఫైన్ వేశారు, ఎందుకో తెలుసా?

కానీ, పూర్తిగా విదేశాల్లో తయారై మనదేశంలోకి దిగుమతి అయ్యే కొత్త వాహనాల విషయంలో మాత్రం దిగుమతి సుంఖాలు 100 శాతానికి పైగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో, కొందరు ఈ అధిక దిగుమతి సుంఖాల నుండి తప్పించుకునేందుకు, కొత్త కార్లను ముందుగా విదేశాల్లోనే కొనుగోలు చేసి, అక్కడే రిజిస్టర్ చేయించుకొని అక్కడి నుండి ఇక్కడికి సెకండ్ హ్యాండ్ కారుగా దిగుమతి చేసుకుంటారు.

దుబాయ్‌లో రిజిస్టర్ అయిన కారుకు కేరళలో ఫైన్ వేశారు, ఎందుకో తెలుసా?

ఇలాంటి పరిస్థితుల్లో వాడిన (ప్రీ-ఓన్డ్) కార్లపై దిగుమతి సుంకాలు వేరుగా ఉంటాయి. ఆ అవకాశాన్ని వినియోగించుకునేందుకు కొందరు ఈ మార్గాన్ని ఎంచుకుంటుంటారు. తాజా కేసు విషయంలో కూడా ఇదే జరిగినట్లు అనుమానిస్తున్నారు.

వాస్తవానికి చాలా మంది ప్రవాస భారతీయులు తమ విదేశీ రిజిస్టర్డ్ లగ్జరీ కార్లను భారతదేశంలో గార్నెట్ ద్వారా దిగుమతి చేసుకుని ఉపయోగిస్తుంటారు. అయితే, ఈ విధంగా తీసుకువచ్చిన వాహనాలను కొన్ని రోజులు లేదా కొన్ని వారాల పాటు మాత్రమే ఇక్కడ ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది.

దుబాయ్‌లో రిజిస్టర్ అయిన కారుకు కేరళలో ఫైన్ వేశారు, ఎందుకో తెలుసా?

ఒకవేళ ఎక్కువ కాలం పాటు విదేశీ రిజిస్టర్డ్ వాహనాలను మనదేశంలో ఉపయోగించాలనుకుంటే, సదరు వాహన యజమానులు సంబంధిత అధికారులను సంప్రదించి, తగిన అనుమతులను పొందడం ద్వారా వాటి చెల్లుబాటు వ్యవధిని పెంచకోవచ్చు. గార్నెట్ వాహనాలకు పాస్‌పోర్ట్ లాంటి, ఇది వాహనాలను ఒక దేశం నుండి మరొక దేశానికి బదిలీ చేయడానికి సహాయపడుతుంది.

దుబాయ్‌లో రిజిస్టర్ అయిన కారుకు కేరళలో ఫైన్ వేశారు, ఎందుకో తెలుసా?

కేరళ పోలీసులు జరిమానా విధించిన కారు రోల్స్ రాయిస్ కారును ఘోస్ట్ మోడల్‌గా గుర్తించారు. భారత మార్కెట్లో ఈ కారు ధర సుమారు రూ.6.95 కోట్ల వరకూ ఉంటోంది. ఈ కారు మొత్తం బరువు సుమారు 2.5 టన్నులు. ఐకానిక్ రోల్స్ రాయిస్ డిజైన్ మరియు లగ్జరీ సౌకర్యాలతో ఈ కారు రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరి చూపును తనవైపుకు తిప్పుకుంటుంది.

Most Read Articles

English summary
Kerala Motor Vehicle Department Fined Dubai Registered Rolls Royce Ghost In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X