టూవీలర్‌పై వెళ్తూ గొడుగు ఉపయోగించడం నేరం; ఎక్కడో తెలుసా?

సాధారణంగా, వర్షాకాలంలో మోటారిస్టులు ద్విచక్ర వాహనం నడుపుతూ గొడుగు (అంబ్రెల్లా) వేసుకొని వెళ్తుంటారు. ఇది ప్రమాదకరమని తెలిసినా, వర్షంలో తడవకుండా ఉండేందుకు ఇలా చేస్తుంటారు. రైడర్ ఒక చేతితో బండి నడుపుతూ, మరొక చేతితో గొడుగు పట్టుకోవటం లేదా వెనుక కూర్చున్న పిలియన్ రైడర్ గొడుగును పట్టుకోవటం చేస్తుంటారు.

టూవీలర్‌పై వెళ్తూ గొడుగు ఉపయోగించడం నేరం; ఎక్కడో తెలుసా?

అయితే, ఇకపై ఇలాంటివన్నీ చెల్లవు. టూవీలర్లపై వెళ్లేటప్పుడు గొడుగు వాడకాన్ని నిషేధిస్తూ కేరళలోని అన్ని ప్రాంతీయ మరియు ఉమ్మడి ప్రాంతీయ రవాణా అధికారులకు రవాణా కమిషనర్ బుధవారం ఒక లేఖను జారీ చేశారు. ఈ లేఖలో, ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు గొడుగు తీసుకెళ్లడాన్ని నిషేధించాలని రవాణా శాఖ కమిషనర్ కోరారు.

టూవీలర్‌పై వెళ్తూ గొడుగు ఉపయోగించడం నేరం; ఎక్కడో తెలుసా?

ఇలా చేయడం వలన బైక్ పై వెళ్లే వారికే కాకుండా, రోడ్డుపై ఇతరలకు కూడా ప్రమాదకరమని చెప్పారు. కేరళలో వర్షాల కారణంగా ద్విచక్ర వాహనదారులు గొడుగులను ఉపయోగించడం ఎక్కువైంది. వేగవంతమైన గాలులు వీచినప్పుడు గొడుగు హ్యాండిల్ చేసే ప్రక్రియలో రైడర్లు బైక్ పై నుండి క్రింద పడిపోవటం లేదా ఇతర పరధ్యానాలకు గురికావడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

టూవీలర్‌పై వెళ్తూ గొడుగు ఉపయోగించడం నేరం; ఎక్కడో తెలుసా?

సాధారణంగా, వర్షాకాలంలో వానతో పాటుగా తీవ్రమైన గాలులు కూడా వీస్తుంటాయి. ఆ సమయంలో బహిరంగ ప్రదేశంలో నడుస్తూ వెళ్తున్నప్పుడే గొడుగు కంట్రోల్ చేయటం క్లిష్టంగా ఉంటుంది. అలాంటిది వేగంగా వెళ్తున్న టూవీలర్ పై మరియు వేగంగా వీస్తున్న గాలిలో గొడుగు పట్టుకోవటం అంటే సాహసమే చెప్పాలి. ప్రజలు ఇకపై ఇలాంటి సాహసాలు చేయవద్దని కేరళ పోలీసులు చెబుతున్నారు.

టూవీలర్‌పై వెళ్తూ గొడుగు ఉపయోగించడం నేరం; ఎక్కడో తెలుసా?

ఉదాహరణకు, బైక్ గాలి దిశకు గంటకు 50 కిమీ వేగంతో ప్రయాణిస్తుంటే మరియు గాలి వేగం కూడా గంటకు 30 కిమీ అయితే, మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తులు తమ బైక్ వేగం 50 మరియు గాలి వేగం 30 కలిపి మొత్తం గంటకు 80 కిమీ వేగాన్ని అనుభవిస్తారు. అటువంటి పరిస్థితిలో, ఒక వ్యక్తి తన చేతిలో గొడుగుతో బైక్‌పై కూర్చుంటే, గంటకు 80 కిమీ వేగంతో కదులుతున్న గాలి అతడిని సులభంగా లాగగలదు మరియు అతని ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదం జరగవచ్చు.

టూవీలర్‌పై వెళ్తూ గొడుగు ఉపయోగించడం నేరం; ఎక్కడో తెలుసా?

గత నెలలో కేరళకు చెందిన 52 ఏళ్ల వృద్ధురాలు వర్షం సమయంలో గొడుగు తెరవడానికి ప్రయత్నించినప్పుడు మోటార్‌సైకిల్ నుండి కిందకు పడిపోయి మరణించారు. ఆ సమయంలో అతని కుమారుడు మోటార్‌సైకిల్ నడుపుతున్నాడు. మహిళ తలకు బలమైన గాయాలు కావాడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

టూవీలర్‌పై వెళ్తూ గొడుగు ఉపయోగించడం నేరం; ఎక్కడో తెలుసా?

ఈ ఘటన నేపథ్యంలో, పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా, వర్షం పడే సమయంలో టూవీలర్లపై ప్రయాణించే వారు గొడుగుల వినియోగాన్ని నిషేధించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

టూవీలర్‌పై వెళ్తూ గొడుగు ఉపయోగించడం నేరం; ఎక్కడో తెలుసా?

కేరళలో 259 మంది ఆర్టీసీ డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు

కేరళకు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, గడచిన ఐదేళ్లలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘించిన ఆర్టీసీ డ్రైవర్లపై అధికారులు కొరడా ఝలిపించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై 259 కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులను మోటార్ వాహనాల శాఖ రద్దు చేసింది.

టూవీలర్‌పై వెళ్తూ గొడుగు ఉపయోగించడం నేరం; ఎక్కడో తెలుసా?

నిర్లక్ష్యపు, అజాగ్రత్తగా డ్రైవ్ చేయటం, తాగి బస్సు నడపడం (డ్రంక్ అండ్ డ్రైవింగ్) వంటి నేరాలపై డ్రైవర్ల లైసెన్సులను రద్దు చేశారు. మే 2016 నుంచి ఏప్రిల్ 2021 మధ్యలో 259 మంది డ్రైవర్లపై మోటారు వెహికల్ డిపార్టుమెంట్ చర్యలు తీసుకుంది. కేరళ రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఆర్టీసీ డ్రైవర్లతో పాటుగా మరో 51,198 మంది డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేశారు.

టూవీలర్‌పై వెళ్తూ గొడుగు ఉపయోగించడం నేరం; ఎక్కడో తెలుసా?

గడచిన 2020 లో లాక్ డౌన్ కారణంగా రోడ్లపై తక్కువ వాహనాలు తిరిగాయి. అయినప్పటికీ, 2020 లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 883 మంది డ్రైవర్ల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. కేరళలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘన, ఓవర్ లోడింగ్, ట్రక్కుల్లో ప్రయాణికులను తీసుకువెళ్లడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులను కూడా అధికారులు రద్దు చేశారు.

భారతదేశంలో మోటార్ వాహన చట్టాలు చాలా కఠిణంగా మారాయి. ఈ విధంగా మారటానికి ప్రధాన కారణం రోజురోజుకి భారీగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు. వీటిని నివారించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పోలీసులు ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా అమలు చేస్తున్నారు.

Most Read Articles

English summary
Kerala mvd bans using umbrella on two wheelers in rain details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X