సైకిల్ దొంగిలించిన బాలుడికి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన పోలీసులు!
పరుల సొమ్ము పాము వంటిది అని మనమందరం చిన్నప్పుడు స్కూల్లో చదువుకొనే ఉంటాయి. కానీ, కొందరు అవన్నీ మరచిపోయి ఏదో ఒక సందర్భంలో అవసరం కోసమో లేక మరేదైనా కారణం వల్లనో చిన్న, పెద్ద దొంగతనాలు చేస్తూనే ఉంటారు. ఎంతటి గజదొంగైనా ఏదో ఒకరోజు పోలీసులకు చిక్కాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే..!

సరే అదంతా అటుంచి అసలు విషయానికి వస్తే, సైకిల్ దొంగిలించిన ఓ బాలుడిని పోలీసులు గుర్తించి, అతడు చేసిన పనికి శిక్షకు బదులుగా బహుమానం ఇచ్చిన ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

లతీఫ్ అట్టప్పడి అనే వ్యక్తి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఆ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం, షోలయూర్ పోలీస్ పరిమితిలో మూడవ తరగతి చదువుతున్న ఓ పిల్లవాడు తమ పొరుగున ఉన్న ఇంట్లో ఓ సైకిల్‌ను దొంగిలించాడు.

ఆ తర్వాత సదరు సైకిల్ యజమానికి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు విచారణ జరిపి సైకిల్‌ను ఆ బాలుడి వద్ద నుండి సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు ఆ బాలుడి వద్ద నుండి సైకిల్‌ను స్వాధీనం చేసుకుంటున్నప్పుడు, ఆ బాలుడు గట్టి గొంతుకతో ఆ సైకిల్ తనకు కావాలని, తనకు సైకిల్ తొక్కాలని చాలా కోరిక అని చెప్పుకొచ్చాడు.

సైకిల్ తొక్కాలనే ఆ బాలుడి సంకల్పాన్ని గుర్తించిన షోలయూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీ వినోద్ కృష్ణ మనస్సు చలించిపోయింది. దీంతో ఆ బాలుడిని మందలించాల్సింది పోయి, మరుసటి రోజున ఓ కొత్త సైకిల్ కొని అతడికి కానుకగా ఇచ్చాడు.

వినోద్ కృష్ణ ఆ బాలుడితో మాట్లాడినప్పుడు, అతని మంచితనం మరియు అనుభవాన్ని అర్థం చేసుకున్నానని, తాను చదువుకునే రోజుల్లో తన వద్ద సైకిల్ లేనప్పుడు, దానిని వన్నేరి హై స్కూల్ ముందు ఉన్న దుకాణం నుండి అద్దెకు తీసుకొని నడిపేవాడినని వినోద్ కృష్ణ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు.

ఎవరికైనా బాల్యంలో సైకిల్ లేకపోతే, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు ప్రత్యక్షంగా తెలుసునని, ఆ అనుభవం అందరికీ ఒకేలా ఉంటుందని, అందుకే ఆ బాలుడికి సైకిల్‌ను కానుకగా ఇచ్చానని చెప్పుకొచ్చారు. మంచి పోలీసులు చేసిన ఈ మంచి పనిని ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందరూ ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications








