సైకిల్ దొంగిలించిన బాలుడికి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన పోలీసులు!

పరుల సొమ్ము పాము వంటిది అని మనమందరం చిన్నప్పుడు స్కూల్లో చదువుకొనే ఉంటాయి. కానీ, కొందరు అవన్నీ మరచిపోయి ఏదో ఒక సందర్భంలో అవసరం కోసమో లేక మరేదైనా కారణం వల్లనో చిన్న, పెద్ద దొంగతనాలు చేస్తూనే ఉంటారు. ఎంతటి గజదొంగైనా ఏదో ఒకరోజు పోలీసులకు చిక్కాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే..!

సైకిల్ దొంగిలించిన బాలుడికి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన పోలీసులు!

సరే అదంతా అటుంచి అసలు విషయానికి వస్తే, సైకిల్ దొంగిలించిన ఓ బాలుడిని పోలీసులు గుర్తించి, అతడు చేసిన పనికి శిక్షకు బదులుగా బహుమానం ఇచ్చిన ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

సైకిల్ దొంగిలించిన బాలుడికి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన పోలీసులు!

లతీఫ్ అట్టప్పడి అనే వ్యక్తి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఆ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం, షోలయూర్ పోలీస్ పరిమితిలో మూడవ తరగతి చదువుతున్న ఓ పిల్లవాడు తమ పొరుగున ఉన్న ఇంట్లో ఓ సైకిల్‌ను దొంగిలించాడు.

MOST READ:మహీంద్రా నుంచి రానున్న కొత్త ఎస్‌యూవీ XUV700; వివరాలు

సైకిల్ దొంగిలించిన బాలుడికి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన పోలీసులు!

ఆ తర్వాత సదరు సైకిల్ యజమానికి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు విచారణ జరిపి సైకిల్‌ను ఆ బాలుడి వద్ద నుండి సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సైకిల్ దొంగిలించిన బాలుడికి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన పోలీసులు!

పోలీసులు ఆ బాలుడి వద్ద నుండి సైకిల్‌ను స్వాధీనం చేసుకుంటున్నప్పుడు, ఆ బాలుడు గట్టి గొంతుకతో ఆ సైకిల్ తనకు కావాలని, తనకు సైకిల్ తొక్కాలని చాలా కోరిక అని చెప్పుకొచ్చాడు.

MOST READ:భారత్‌లో మళ్ళీ మొదలైన కరోనా లాక్‌డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?

సైకిల్ దొంగిలించిన బాలుడికి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన పోలీసులు!

సైకిల్ తొక్కాలనే ఆ బాలుడి సంకల్పాన్ని గుర్తించిన షోలయూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీ వినోద్ కృష్ణ మనస్సు చలించిపోయింది. దీంతో ఆ బాలుడిని మందలించాల్సింది పోయి, మరుసటి రోజున ఓ కొత్త సైకిల్ కొని అతడికి కానుకగా ఇచ్చాడు.

సైకిల్ దొంగిలించిన బాలుడికి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన పోలీసులు!

వినోద్ కృష్ణ ఆ బాలుడితో మాట్లాడినప్పుడు, అతని మంచితనం మరియు అనుభవాన్ని అర్థం చేసుకున్నానని, తాను చదువుకునే రోజుల్లో తన వద్ద సైకిల్ లేనప్పుడు, దానిని వన్నేరి హై స్కూల్ ముందు ఉన్న దుకాణం నుండి అద్దెకు తీసుకొని నడిపేవాడినని వినోద్ కృష్ణ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు.

MOST READ:ఉద్యోగం నుంచి తీసేశారని బీభత్సం సృష్టించిన మాజీ ఉద్యోగి.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా?

సైకిల్ దొంగిలించిన బాలుడికి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన పోలీసులు!

ఎవరికైనా బాల్యంలో సైకిల్ లేకపోతే, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు ప్రత్యక్షంగా తెలుసునని, ఆ అనుభవం అందరికీ ఒకేలా ఉంటుందని, అందుకే ఆ బాలుడికి సైకిల్‌ను కానుకగా ఇచ్చానని చెప్పుకొచ్చారు. మంచి పోలీసులు చేసిన ఈ మంచి పనిని ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందరూ ప్రశంసిస్తున్నారు.

Most Read Articles

English summary
Kerala Police Gifts Bicycle To Little Boy Who Stole His Neighbor's Cycle. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X