Google Maps పై కేరళ పోలీసుల హెచ్చరికలు.. ఆ సందర్భాల్లో మ్యాప్స్‌ వాడవద్దని సూచన

గూగుల్‌ మ్యాప్స్‌ ప్రతి ఒక్కరి ప్రయాణంలో తప్పనిసరి అయింది. కొత్త రూట్లో వెళ్తున్నప్పుడు దారి తెలియకపోతే Google Maps ద్వారా నావిగేట్ చేస్తూ వెళ్తుంటారు. ప్రధాన నగరాల్లో మీ ఫోన్‌లో మ్యాప్స్‌ లేకుండా బయటకు వెళ్లడం కష్టం. అయితే తాజాగా కేరళ పోలీసులు గూగుల్‌ మ్యాప్స్‌ను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అందుకు కారణమేంటి..

గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా ఇటీవల కొందరు ప్రమాదానికి గురైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. అమెరికాలో గతేడాది ఓ డాక్టర్‌.. గూగుల్‌ మ్యాప్స్‌ సాయంతో డ్రైవ్‌ చేస్తూ పాడైపోయిన బ్రిడ్జి మీదుగా వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల కొందరు స్నేహితులు ఇలాగే కొత్త రూట్లో వెళ్తూ సరిగా లేని బ్రిడ్జిపై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. సరిగా లేని రూట్ల విషయంలో గూగుల్‌ మ్యాప్స్‌ అప్‌డేట్‌ కాకపోవడమే ఇందుకు కారణం.

Kerala-Police-On-Google-Maps

ఇక హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, పుణె, ముంబయి లాంటి నగరాల్లో ఫ్లై ఓవర్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో ఫ్లై ఓవర్ తీసుకోవాలా లేదా దాని కింద నుంచి వెళ్లాలా అనే విషయంలో కూడా చాలా మంది గందరగోళానికి గురవుతారు. ఈ నేపథ్యంలో గూగుల్‌ మ్యాప్స్‌ సాయంతో బయటికి వెళ్లేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని కేరళ పోలీసులు(Kerala Police) సూచిస్తున్నారు.

ఇటీవల కేరళలో గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించి డ్రైవ్‌ చేస్తూ వెళ్తున్న ఇద్దరు వైద్యులు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. కేరళకు చెందిన ఇద్దరు యువ డాక్టర్లు కారులో వెళ్తుండగా.. దారి తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్‌ని ఉపయోగించి నావిగేట్‌ చేస్తూ వెళ్తున్నారు. అలా వెళ్తుండగా మార్గమధ్యలో కారు పొరపాటున కొచ్చిలోని గోతురత్ వద్ద పెరియార్ నదిలో పడిపోయింది.

Kerala-Police-On-Google-Maps

దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు 29 ఏళ్ల యువ వైద్యులు అద్వైత్, అజ్మల్ మృతి చెందినట్లు సమాచారం. కొచ్చిలోని గోతురత్‌ మార్గంలో వారు అర్ధరాత్రి కారులో వెళుతుండగా, భారీ వర్షం పడుతోంది. దీంతో విజిబిలిటీ కూడా తగ్గడంతో.. గూగుల్ మ్యాప్ చూపిన రూట్‌లో డ్రైవర్ కారు డ్రైవ్‌ చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఎడమవైపు టర్నింగ్‌ తీసుకోవాల్సి ఉండగా.. ముందుకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు కారు నదిలో పడిపోయింది. పోలీసుల సమాచారం ప్రకారం శనివారం(సెప్టెంబర్‌ 30) డాక్టర్ అద్వైత్ పుట్టినరోజు. ఈ కారులో అద్వైత్‌తో పాటు నలుగురు ప్రయాణిస్తున్నారు. ఐదుగురూ కొచ్చి నుంచి కొడంగల్లూర్‌కు తిరిగి వస్తున్నారు. వీరంతా అద్వైత్ బర్త్ డే కోసం షాపింగ్‌కి వెళ్లినట్లు సమాచారం.

Kerala-Police-On-Google-Maps

అయితే గూగుల్ మ్యాప్స్ ఇచ్చిన తప్పుడు రూట్‌ ద్వారా ప్రమాదం జరిగిందా లేక వాహనం అదుపు తప్పిందా అనే దానిపై స్పష్టత లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రమాదంపై కేరళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనలో ఇద్దరు యువ వైద్యులు మృతి చెందగా మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు.

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే కారు నడుపుతున్న యువ వైద్యుడి వద్ద గూగుల్ మ్యాప్ ఉండగా.. సాంకేతిక సమస్య కారణంగానే గూగుల్ మ్యాప్స్ నది ఉన్న రూట్లోకి తీసుకెళ్లిందని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే గూగుల్ మ్యాప్స్ రూట్‌ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారని కూడా మరికొందరు అంటున్నారు.

ఈ క్రమంలో కేరళ పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. వర్షం సమయంలో విజిబిలిటీ తగ్గినట్లయితే రహదారి పార్క్ చేయడం సరైన మార్గంగా చెబుతున్నారు. ఏదైనా రహదారి నిర్వహణ జరుగుతున్నప్పుడు Google Maps డొంక దారి చూపాలి. పొంగిపొర్లుతున్న వాగులు, కొండచరియలు విరిగిపడటం, నేలకూలిన చెట్లు మొదలైన వాటి కారణంగా అగమ్యగోచరంగా ఉన్న రోడ్లను Google మ్యాప్స్ చూపే అవకాశం ఉండదు.

ఇంకా నావిగేట్ చేయడం కష్టంగా ఉన్న ఇరుకైన మరియు ఎగుడుదిగుడుగా ఉండే రోడ్డు మార్గంలో వెళ్లకపోవడమే ఉత్తమం. ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్లేటప్పుడు, దారిని ముందుగానే తెలుసుకోవడం మంచిది. అంతే కాకుండా గూగుల్‌లో షార్ట్‌ కట్‌ వెతకడం కంటే కూడా.. కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నా సరైన మార్గంలో వెళ్లడం మంచిది.

మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. మీరు Google Maps లో మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, మీరు కారులో లేదా బైక్‌లో వెళ్తున్నారా అని స్పష్టంగా చెప్పాలి. అప్పుడు మీరు ప్రయాణిస్తున్న వాహనానికి అనుగుణంగా అనుకూలంగా ఉండే రూట్‌ చూపిస్తుంది. మీకు గూగుల్‌ మ్యాప్స్‌లో రెండు ఆప్షన్స్‌ చూపిస్తాయి. ఇందులో 'యాడ్ స్టాప్' ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఒకవేళ మీరు రూట్‌ తప్పిపోయినా.. Google Maps మీ గమ్యస్థానానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపుతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 3, 2023, 14:43 [IST]
English summary
Kerala police warning about use of google maps while driving after the death of two doctors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+