మహీంద్రా థార్‌తో వాగులు వంకలే కాదు ఏకంగా దేశాన్నే దాటేసింది.. ఫుట్‌బాల్ మీద పిచ్చితో..
మహీంద్రా థార్ ఎస్‍యూవీతో వాగులు వంకలే కాదు, ఏకంగా దేశాలనే దాటేయొచ్చని నిరూపించింది ఓ భారతీయ మహిళ. ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం రండి.

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ వలర్డ్ కప్‌కు ఎంత క్రేజ్ ఉందో, ఫిఫా (ఫుట్‌బాల్) వరల్డ్ కప్‌కు కూడా అంతే క్రేజ్ ఉంది. ఖతార్‌లో జరిగే 2022 FIFA ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను చూడటానికి కేరళకు చెందిన ఒక ఫుట్‌బాల్ అభిమాని తన మహీంద్రా థార్ వాహనంలో భారతదేశం నుండి ఖతార్‌కు బయలుదేరింది. ఆమె పేరు నాజి నౌషిస్, ఆమె ఓ యూట్యూబ్ వ్లాగర్. ఈ ప్రయాణం కోసం ఆమె తన థార్ ఎస్‌యూవీని ప్రత్యేకమైన వైట్ అండ్ మెరూన్ కలర్‌లో వైనల్ వ్రాప్ చేయించింది. ఈ కారులో ఆమె కేరళ నుండి ప్రయాణించి ఖతారు చేరుకొని మ్యాచ్ చూసిన తర్వాత తిరిగి ఇండియాకు చేరుకోనుంది.

ప్రపంచంలోని అనేక దేశాల్లో ఫుట్‌బాల్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. భారత్‌లో కూడా క్రికెట్ తర్వాత ఫుట్‌బాల్ ఆటకు వేలాది మంది అభిమానులున్నారు. ముఖ్యంగా కేరళలో క్రికెట్ కంటే ఫుట్‌బాల్ క్రీడకే అక్కడి వారు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పవచ్చు. ఫుట్‌బాల్ ప్రపంచంలో ఫిఫా కప్ అనేది చాలా ప్రత్యేకమైనది, ఈ కప్ గెలుచుకునేందుకు అనేక దేశాలు పోటీ పడుతాయి. ఈ ఏడాది 2022 ఫిఫా ఫుట్‌బాల్ టోర్నమెంట్ నవంబర్ 20 న మిడిల్ ఈస్ట్ దేశం ఖతార్‌లో ప్రారంభం కానుంది.

ఖతార్ భారతదేశానికి అత్యంత సన్నిహిత దేశం కావడంతో మన దేశంలోని చాలా మంది ఫుట్‌బాల్ అభిమానులు మ్యాచ్ లను తిలకించేందుకు ఖతార్ కు బయలుదేరుతున్నారు. అలాంటి హార్డ్‌కోర్ ఫుట్‌బాల్ అభిమానులలో కేరళకు చెందిన నాజీ నౌషి కూడా ఒకరు. యూట్యూబ్, ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన ఈ కేరళ అమ్మాయి, ఇప్పుడు తన థార్ ఎస్‌యూవీలో ఖతార్ రోడ్డు ప్రయాణాన్ని ప్రారంభించింది. అది కూడా ఒంటరిగానే ఈ రోడ్డు ప్రయాణం చేస్తున్నట్లు ఇన్‌స్టాలో తెలిపింది.

నాజీ నౌషి తన ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలు మరియు ఆసక్తికర విషయాలను రీల్స్ మరియు వీడియోల రూపంలో తన అభిమానులతో పంచుకోనుంది. భారతదేశం నుండి ఖతార్‌కు నేరుగా రోడ్డు మార్గం లేదు, మార్గ మధ్యలో సముద్రాన్ని దాటాల్సి ఉంటుంది. అయితే, ఈ మార్గ మధ్యంలో నాజీ మరికొన్ని దేశాల సరిహద్దులను దాటాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం అనుకున్నంత సులువైనదేమీ కాదు. సాధారణంగా, విమానంలో అయితే భారత్ నుండి ఖతార్‌కు కేవలం 4 గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. అదే రోడ్డు మార్గం ద్వారా చేరుకోవాలంటే సుమారు నెల రోజులకు పైగా సమయం పడుతుంది.

భారతదేశం నుండి ఓ వాహనంలో ఇతర దేశాలకు ప్రయాణించడం అంటే ఆషామాషీ కాదు, ఇందులో అనేక సవాళ్లు ఉంటాయి. ఈ ప్రయాణం కోసం మనుషులకు పాస్‌పోర్ట్ తీసుకున్నట్లుగానే వాహనానికి కూడా పాస్‌పోర్ట్ తీసుకోవాలి. ప్రయాణించే మార్గాన్ని ముందుగానే ఎంచుకోవాలి మరియు మార్గ మధ్యంలో వచ్చే దేశాలలో ప్రవేశించేందుకు కూడా ముందుగానే అనుమతులు తీసుకువాలి. ప్రతి దేశపు సరిహద్దు వద్ద కూడా వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. వాటన్నింటినీ దాటుకుని, ఖతార్ చేరుకోవడం అంటే అదొక పెద్ద సాహసయాత్రే అని చెప్పవచ్చు.

నాజీ నౌషి వద్ద ఇప్పటికే ఒమన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఈ ప్రయాణం కోసం ఆమె దానిని అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌గా మార్చుకున్నారు. నౌజీ సాహసయాత్రం కోయంబత్తూర్ నుండి ప్రారంభం అవుతుంది. అక్కడి నుండి ఆమె ముంబై చేరుకొని, ముంబై ఓడరేవులో ఒమన్‌కు వెళ్లే నౌక ద్వారా తన కారును సముద్రం దాటిస్తుంది. ఒమన్ చేరుకున్న తర్వాత, నాజీ యొక్క థార్ రోడ్డు ప్రయాణం తిరిగి ప్రారంభమవుతుంది. ఒమన్ నుంచి ఖతార్ వరకూ వెళ్లాలంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాలను దాటాల్సి ఉంటుంది.
నాజీ నౌషి ఫిఫా ప్రయాణాన్ని అక్టోబర్ 16న కన్నూర్ నుండి కేరళ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆంటోని రాజు జెండా ఊపి ప్రారంభించారు. చాలా నెలలుగా ఈ ట్రిప్ కోసం ప్లాన్ చేస్తున్నానని నాజీ నౌషి తెలిపారు. ఈ ప్రయాణం తనకు ఇష్టమైన వాటిలో ఒకటని, కానీ తాను ఇంత సాహసోపేతమైన క్రాస్ కంట్రీ ట్రిప్‌ను చేయడం కూడా ఇదే మొదటిసారి అని ఆమె చెప్పారు. నౌషికి ఐదురుగు పిల్లలు ఉన్నారు, ఆమె భర్త నౌషత్ ఓ విదేశీయుడు. నౌషత్ మరియు అతని 5 మంది పిల్లలు కూడా నాజీ నౌషిని ఈ ప్రయాణం చేయమని ప్రోత్సహించడం విశేషం.

ఈ ప్రయాణం కోసం నైజీ తన తారును మొబైల్ హోమ్‌గా మార్చుకుంది. ప్రయాణంలో అవసరమైన అన్ని వస్తువులను సమకూర్చుకుంది. పగటిపూట మాత్రమే డ్రైవ్ చేస్తూ, రాత్రివేళల్లో వాహనాన్ని టోల్ బూత్‌లు లేదా పెట్రోల్ బంకుల దగ్గర పార్క్ చేసి క్యాంప్ చేయాలనేది ఆమె ప్లాన్. క్యాంపింగ్ కోసం అవసరమైన టెంట్ మరియు ఇతర పరికరాలను కూడా ఆమె తన కారు పైభాగంలో ప్రత్యేకంగా సమకూర్చుకున్నారు. మార్గ మధ్యంలో భోజనం తయారు చేసుకోవడం కోసం అవసరమైన ఆహారపదార్థాలు మరియు వంట సామాగ్రిని కూడా సమకూర్చుకున్నారు. మరి నాజీ నౌషి చేపట్టిన ఈ సాహసయాత్ర సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందామా!


Click it and Unblock the Notifications








