కొంప ముంచిన గూగుల్ మ్యాప్; అర్ధరాత్రి అడవిలోకి.. చివరకు ఏమైందంటే?

ప్రపంచం ఇప్పుడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ కారణంగానే దాదాపు అన్ని పనులు డిజిటల్ ద్వారా జరుగుతున్నాయి. కావున చాలా మంది వ్యక్తులు ఒకప్పుడు కొత్త ప్రాంతాలకు వెళ్లాలంటే కొంతమంది వ్యక్తులను అడుగుతూ వెళ్లి గమ్యాన్ని చేరేవారు. అయితే ఇప్పుడు మనచేతికి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. కావున కూర్చున్న దగ్గరే ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము.

కొంప ముంచిన గూగుల్ మ్యాప్; అర్ధరాత్రి అడవిలోకి.. చివరకు ఏమైందంటే?

ఇంత ముందంజలో పయనిస్తున్న తరుణంలో కొత్త ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఉపయోగిస్తున్నాము. గూగుల్ మ్యాప్ లు దాదాపు సరైన గమ్యాన్ని చేరుస్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో నెట్ వర్క్ సమస్య తలెత్తినప్పుడు గమ్యం కాస్త అగమ్యగోచరమవుతుంది. ఇలాంటి సంఘటనలు మనం ఇది వరకే చాలా చూసాము. ఇప్పుడు కూడా అలంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

కొంప ముంచిన గూగుల్ మ్యాప్; అర్ధరాత్రి అడవిలోకి.. చివరకు ఏమైందంటే?

నివేదికల ప్రకారం మున్నార్ లోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో ఉంటున్న డాక్టర్ నవాబ్ మరియు అతని కుటుంబం టాప్ స్టేషన్ మరియు వట్టవాడ గ్రామాన్ని సందర్శించారు. తిరిగి వచ్చిన తరువాత అతను హోటల్ చేరుకోవడానికి గూగుల్ మ్యాప్‌ని ఉపయోగించారు. ఆ ప్రాతం వారికీ కొత్త కావడం వల్ల రహదారులు తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా అనుసరించారు.

కొంప ముంచిన గూగుల్ మ్యాప్; అర్ధరాత్రి అడవిలోకి.. చివరకు ఏమైందంటే?

గూగుల్ మ్యాప్ ని అనుసరిస్తూ వెళ్తున్న కారణంగా కొంతసేపు డ్రైవింగ్ చేసిన తరువాత, అతను మెయిన్ రోడ్డు నుండి టీ తోటల మధ్య కఠినమైన రోడ్డుపై కారును డ్రైవ్ చేయవలసి వచ్చింది. ఇలాగే వారు దాదాపు ఐదు గంటల పాటు లోతట్టు ప్రాంతంలో ప్రయాణిస్తూనే ఉన్నారు.

కొంప ముంచిన గూగుల్ మ్యాప్; అర్ధరాత్రి అడవిలోకి.. చివరకు ఏమైందంటే?

అయితే దాదాపు అర్ధరాత్రికి వారు ఒక రోడ్డులో ఇరుక్కుపోయారు. ఎందుకంటే ఆ దారి మొత్తం బురదతో నిండి ఉండటం వల్ల కారు ఇరుక్కుపోయింది. రాత్రిలో వారు చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కారు అడవుల్లోకి ప్రవేశించిన తర్వాత, వాహనదారుడు చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. డాక్టర్ నవాబ్ కుటుంబం కూడా ఇదే ఎదురైంది.

కొంప ముంచిన గూగుల్ మ్యాప్; అర్ధరాత్రి అడవిలోకి.. చివరకు ఏమైందంటే?

డాక్టర్ నవాబ్ కుటుంబం మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారులో ప్రయాణిస్తోంది. ఈ హాచ్ బ్యాక్ బురదలో చిక్కుకుపోవడం వల్ల వారు వాహనం నుండి బయటపడటానికి మార్గం కనిపించకుండా పోయింది. వారు తమకు వేరే మార్గం లేదని వారు గ్రహించే సమయానికి, వారు అప్పటికే అడవి మధ్యలో చిక్కుకున్నారు.

కొంప ముంచిన గూగుల్ మ్యాప్; అర్ధరాత్రి అడవిలోకి.. చివరకు ఏమైందంటే?

చివరికి ఇక చేసేది లేకపోడంతో డాక్టర్ నవాబ్ అగ్నిమాపక మరియు రెస్క్యూ విభాగాన్ని సంప్రదించడానికి ప్రయత్నించాడు. కానీ మొబైల్ నెట్‌వర్కింగ్ చాలా తక్కువ. ఇంకా వారు తెలివితేటలను ఉపయోగించి సందేశం పంపడానికి ప్రయత్నిస్తారు. చివరకు సందేశాన్ని పంపడంలో విజయం సాధించారు.

కొంప ముంచిన గూగుల్ మ్యాప్; అర్ధరాత్రి అడవిలోకి.. చివరకు ఏమైందంటే?

మరుసటిరోజు 1:30 గంటలకు కుట్టియర్వల్లి ప్రాంతంలో 9 మంది సిబ్బంది బృందం వెతకడం ప్రారంభించినప్పటికీ రెస్క్యూ డివిజన్‌కు సందేశం వచ్చింది, అయితే వాహనం మరియు ప్రయాణీకుడిని గుర్తించలేకపోయారు. డాక్టర్ నవాబ్ వారితో పంచుకున్న స్థానాన్ని అధికారులు కనుగొనలేకపోయారు.

కొంప ముంచిన గూగుల్ మ్యాప్; అర్ధరాత్రి అడవిలోకి.. చివరకు ఏమైందంటే?

తరువాత చాలా సమయం తరువాత ఆరు నవాబ్ కుటుంబాన్ని గుర్తించగలిగారు. వారిని రక్షించడానికి రంగంలోకి దిగిన సిబ్బంది తెల్లవారుజామున 4 గంటలకు అడవి నుండి బయటకు తీసుకురాగలిగింది. నవాబ్ కుటుంబం చిక్కుకున్న ప్రాంతంలో ఏనుగులు మరియు పులులు వంటి అడవి జంతువులు ఉన్నట్లు తెలిసింది. అయితే వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సిబ్బంది సహాయంతో సురక్షితంగా బయటపడగలిగారు.

గూగుల్ మ్యాప్ నమ్ముకుని ఒక ఫ్యామిలీ ఇంతకుముందు కూడా అదైలో చిక్కుకున్న ఘటన ఎలుగులోకి వచ్చింది. అంతే కాకుండా గూగుల్ మ్యాప్ వల్ల కారుని చెరువులోకి వెళ్లి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంగతి బహుశా అందరికి తెలిసే ఉంటుంది. కావున మీరు కొత్త ప్రాంతాలకు వెళ్లే సమయంలో టెక్నాలజీని మాత్రమే నమ్ముకోకుండా, ఆ పరిసరాల్లోని వ్యక్తులను అడిగి సహాయం తీసుకోవడం ఉత్తమం.

కొంప ముంచిన గూగుల్ మ్యాప్; అర్ధరాత్రి అడవిలోకి.. చివరకు ఏమైందంటే?

గూగుల్ మ్యాప్ మాత్రమే నమ్ముకుంటే ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. అడవుల్లో లేదా జనసంచారం లేని ప్రాంతాల్లో చిక్కుకుంటే కాపాడటానికి కూడా ఎవరూ వచ్చే అవకాశం ఉండదు. కావున తెలియని ప్రాంతాలను సందర్శించేటప్పుడు సరైన మార్గం తెలిసిన వ్యక్తులు ఉండాలి. అలాకాని సందర్భంలో మార్గంలో కనిపించిన వ్యక్తులను అడిగి తెలుసుకోవాలి.

ఆలా కాకూండా సొంతంగా గూగుల్ మ్యాప్ ను అనుసరిస్తూ వెళ్తే అనుకోను ప్రమాదాలు ఎదురవుతాయి. గూగుల్ మ్యాప్ నమ్ముకున్న ఒక వ్యక్తి అడవిలో చిక్కుకుని బయటపడటానికి రెండు రోజులు సమయం పట్టింది. ఈ సంఘటన కూడా దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది.

Source: Manoramaonline

Most Read Articles

English summary
Kerala tourists lost their way using google map details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X