ఆలయానికి కారు గిఫ్ట్.. పూజలు చేసి కారుని స్వీకరించిన దేవస్థానం ఛైర్మన్, వీడియో వైరల్!
కేరళలోని గురువాయర్ టెంపుల్‌కి ((Guruvayurappan Temple) ఓ కార్ల వ్యాపారి కారుని బహుకరణ చేశాడు. ఈ వార్త ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతుంది. కేశ్విన్ హ్యుందాయ్ అనే డీలర్‌షిప్ కేరళలో పేరొందిన డీలర్స్‌గా ఉంది. ఈ డీలర్‌షిప్ ఓనర్ కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ని దేవస్థానానికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. కేశ్విన్ హ్యుందాయ్ డీలర్‌షిప్ యజమాని ఉదయకుమార్ రెడ్డి స్వయంగా ఈ కారును దేవస్థానం బోర్డు చైర్మన్ వీకే విజయన్‌కి బహూకరించారు. అనంతరం కారుకి గుడిలో పూజ నిర్వహించి ఆలయ అధికారులు, ఛైర్మన్ స్వీకరించారు.
ఆయన ఏకంగా కారుని గుడికి గిఫ్ట్‌గా ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హ్యుందాయ్ కార్ డీలర్‌కి దేవస్థానం బోర్డు శ్రీ గురువాయూరప్పన్ స్వామి వారి ప్రసాదాన్ని బహూకరించింది. ఆయనకు కాళప్పం, తిరుముడి మాల, పండ్లు, పంచదారతో కూడిన ప్రసాదం అందజేశారు. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ భారత మార్కెట్లో చౌకైన కారుగా ఉన్నాకానీ ప్రీమియం ఫీచర్లతో వస్తుంది.

ఇది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు మోడల్‌లో ఒకటిగా ఉంది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ గ్రాండ్ ఐ10 నియోస్ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ఎరా, మాగ్నా, కార్పొరేట్, స్పోర్ట్స్, ఆస్టాగా ఉన్నాయి. ఈ కారు పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లలో లభిస్తుంది. కంపెనీ అమర్చిన సీఎన్‌జీ కిట్‌తో మాత్రమే ఇది అమ్మకానికి అందుబాటులో ఉంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌లో సీఎస్‌జీ కిట్‌తో వచ్చే దీని ప్రారంభ ధర రూ.7.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అదే సమయంలో, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ ధర రూ. 5.92 లక్షల నుంచి రూ. దీని ధర రూ.8.56 లక్షల వరకు ఉంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు మాత్రమే కావడం గమనార్హం.

హ్యుందాయ్ ఇటీవల గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ ట్విన్ సిలిండర్ సీఎన్‌జీ వెర్షన్‌ని భారత మార్కెట్లో విడుదల చేసింది. అంతే కాదు గ్రాండ్ ఐ 10 నియోస్ భారతదేశంలో 4 లక్షల యూనిట్లు విక్రయించబడింది. ఈ సంవత్సరం ఆగస్టులో ఈ మార్క్‌ని సాధించింది. హై- టెక్నాలజీ, ధర, ప్రీమియం ఫీచర్ల పరంగా గ్రాండ్ ఐ10 నియోస్ బెస్ట్ ప్రొడక్ట్ అని చెబుతున్నారు.
ఇది చూడటానికి ఆకర్షణీయమైన లుక్‌ని కలిగి ఉంటుంది. గ్రాండ్ ఐ10 నియోస్‌లో ప్రొజెక్టర్ తరహా హెడ్‌ల్యాంప్స్, LED DRLs, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటెనా ఉన్నాయి. ఈ కారు ప్రీమియం ఫీచర్లతో వస్తుందని గమనించాలి. గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్‌లో 20.25 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెగ్‌లైట్స్, రియర్ ఏసీ హోల్, టిల్టెడ్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.
ఇది కాకుండా, ఈ కారులో సేఫ్టీలోనూ బెస్ట్ అని చెప్పవచ్చు. ఇది ఆరు ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటర్, రియర్ పార్కింగ్ కెమెరా, డే అండ్ నైట్ IRVM, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంలా ఇంకెన్నో మరెన్నో ఫీచర్లు ఈ కారుని కొనుగోలు చేసేందుకు దోహదపడతాయి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








