కొత్త కారు డెలివరీ కోసం చాలా నెలలు వెయిట్‌ చేస్తున్నారా.. ఆ వెయిటింగ్‌ పీరియడ్‌కు కారణాలివే.!!

భారత్‌లో ఇటీవల కార్ల వెయిటింగ్‌ పీరియడ్‌ తరచూ పెరుగుతూ వస్తోంది. దీంతో కస్టమర్లు తమ కారు డెలివరీ కోసం చాలా నెలలు వెయిట్‌ చేయాల్సి వస్తోంది. అయితే ఇందుకు కారణాలేంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.?? ఇండియా కార్ల వెయిటింగ్‌కు గల కారణాలు ఈ కథనంలో తెలుసుకోండి..

దేశంలో కార్ల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. పెరుగుతున్న అవసరాలు, ఫ్యామిలీ ప్రాధాన్యత దృష్ట్యా ప్రతి ఒక్కరూ తమ బడ్జెట్‌ ధరలో కొత్త కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్‌లో మంచి పేరు ఉన్న కార్లకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలో అధిక డిమాండ్‌ ఉన్న కార్లకు బుకింగ్‌లు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Car-Waiting-Period

ఈ క్రమంలో భారతదేశంలో కొన్ని కార్ మోడళ్ల కోసం కస్టమర్లు 3 నుంచి 6 నెలల వరకు వేచి ఉండాల్సి వస్తోందని ఇటీవల ఓ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా టయోటా మరియు మహీంద్రా కంపెనీల నుంచి కొన్ని కార్ల కోసం, వెయిటింగ్ పీరియడ్ ఒక సంవత్సరం కంటే ఎక్కువగా ఉన్నట్లు సర్వే వెల్లడిస్తోంది. అయితే ఇందుకు కారణాలేంటని చాలా మందికి డౌట్‌ రావచ్చు. అందుకు సంబంధించిన కారణాలు ఇలా ఉన్నాయి.

అధిక డిమాండ్ : మార్కెట్లో ఏదైనా వస్తువు లేదా వాహనం కావచ్చు. దానికి ఉన్న డిమాండ్.. సరఫరా కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మరియు డిమాండ్‌కు అనుగుణంగా వస్తువు ఉత్పత్తి చేయలేనప్పుడు, వెయిటింగ్‌ టైమ్ అనేది పెరుగుతుంది. దేశంలోని కొన్ని కార్ మోడళ్ల విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ క్రమంలో ప్రజాదరణ ఎక్కువగా ఉన్న కార్లకే జనం మొగ్గు చూపడంతో ప్రముఖ కార్‌ మోడళ్ల వెయిటింగ్‌ టైమ్ పెరుగుతోంది.

Car-Waiting-Period-Mahindra-Thar

చిప్స్ ఇన్వెంటరీ కొరత : కొవిడ్‌ సంక్షోభం నుంచి భారతదేశంలో చిప్స్ స్టాక్ గణనీయంగా తగ్గుతూ వస్తోంది. సాధారణంగా ఈ చిప్‌లను హై-ఎండ్ కార్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటి ద్వారా కారు వారంటీ కూడా ఎక్కువగా ఉంటుంది. దాదాపు అన్ని కార్ల తయారీ కంపెనీలు కూడా ఈ చిప్, సెమీకండక్టర్ల కొరత కారణంగా వెయిటింగ్‌ టైమ్‌ను పెంచుతూ వస్తున్నాయి.

మార్కెటింగ్ జిమ్మిక్ : దేశంలో కార్ల వెయిటింగ్ పీరియడ్ పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. కొన్ని కార్ల తయారీ కంపెనీలు తమ కార్లకు గిరాకీ ఎక్కువ ఉందని చూపించేందుకు ఇలాంటి చీప్ మార్కెటింగ్ జిమ్మిక్కులను ఆశ్రయిస్తుండటం ఆశ్చర్యకరం. ఇలాంటి మార్కెటింగ్‌ ద్వారా కస్టమర్లు ఆ కారుపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తారని, కారు విక్రయాలు పెరుగుతాయని సదరు కంపెనీలు అంచనా వేస్తుంటాయి.

Car-Waiting-Period-Toyota-Hilux

దేశంలో కార్ల వెయిటింగ్ పీరియడ్ పెరగడానికి పైన పేర్కొన్నవి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ రోజుల్లో కొన్ని బ్రాండ్ల కార్ల వెయిటింగ్ పీరియడ్ కూడా విపరీతంగా పెరగ్గా.. ముఖ్యంగా టయోటా మోటార్స్‌కు చెందిన ఇన్నోవా హిక్రాస్ 1.5 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్‌తో ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Car-Waiting-Period-Toyota-Innova-Hycross

ఇంతగా ఈ కారు వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండటానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. టయోటా హిక్రాస్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఎంట్రీ-లెవల్ 'G' వేరియంట్ (పెట్రోల్) ధర రూ.18.55 లక్షలు (ఎక్స్-షోరూమ్), అయితే హైబ్రిడ్ ఇంజిన్‌తో టాప్-ఎండ్ ZX (O) మోడల్ ధర రూ.29.99 లక్షల ధరతో అందుబాటులో ఉంది.

టయోటా ఇన్నోవా Hycross MPV పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇందులోని 2.0-లీటర్, 4-సిలిండర్ సహజసిద్ధమైన ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 172 bhp గరిష్ట శక్తిని మరియు 205 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CVT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

ఇందులోని హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 2.0-లీటర్, 4-సిలిండర్ నేచురల్లీ అస్పిరేటెడ్‌ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్ మరియు ఎలక్ట్రిక్ మోటారుతో కలిసి పనిచేస్తుంది. 184.8 bhp గరిష్ట శక్తిని మరియు 206 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్‌కు 21 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Sunday, February 18, 2024, 8:01 [IST]
English summary
Key factors behind waiting period on cars increasing in india check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+