Tips for Safe EV Battery ఎలక్ట్రిక్ వాహనాలు పేలిపోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే అంతే సంగతులు

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారంగా మారడంతో వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు కర్బన ఉద్గారాలను నియంత్రించడం కోసం కూడా ఈవీల వినియోగం పెరుగుతోందని చెప్పవచ్చు. ఈవీలు నడపడానికి తేలికగా ఉండటం కూడా మరో కారణం.

బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరుగుతుండటంతో ఈవీ వినియోగదారులు బ్యాటరీ పట్ల తీసుకోవాల్సిన భద్రతా జాగ్రత్తలు కీలకంగా మారుతున్నాయి. ఇంధనంతో నడిచే వాహనాలతో పోలిస్తే ఈవీలలో కదిలే భాగాలు తక్కువగా ఉంటాయి. ఏదేమైనా ఎలక్ట్రిక్‌ వాహనాలు కొన్ని పరిస్థితుల్లో అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ఈవీలు మంటల్లో కాలిపోయిన సందర్భాలు చూశాం. ICE వాహనాలతో పోలిస్తే ఈవీ మంటల తీవ్రత అధికంగా ఉంటుంది.

Tips for Safe EV Battery

ఎలక్ట్రిక్‌ వాహనాలు సజావుగా నడవాలంటే బ్యాటరీ చాలా కీలకం. కొన్ని పరిస్థితుల్లో ఈవీల్లో షార్ట్‌ సర్క్యూట్‌ లేదా అగ్ని ప్రమాదాలు అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. విద్యుత్‌ ద్వారా ఎక్కువ శక్తిని పొందడం కారణంగా అప్పుడప్పుడు బ్యాటరీ ప్యాక్‌ తీవ్ర వేడిని విడుదల చేస్తుంది. తద్వారా మంటలు చెలరేగే అవకాశం ఉంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఈవీ వినియోగదారులు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

మీరు మీ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని ఎక్కడ ఛార్జ్‌ చేసినా ఉదాహరణకు ఇంట్లో లేదా, పబ్లిక్‌ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌లో చేసేటప్పుడు కొన్ని చిట్కాలను పాటించాలి. సురక్షితమైన వాతావరణంలో మీ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని ఛార్జ్‌ చేయడం ద్వారా వాహనం, వాహనదారుడు సురక్షితంగా ఉండటమే కాకుండా, బ్యాటరీ ప్యాక్‌ కూడా పేలిపోకుండా ఉంటుంది. ఈవీని ఛార్జ్‌ చేసేటప్పుడు భద్రత అనేది చాలా కీలకం.

Tips for Safe EV Battery

ధ్రువీకరించబడిన ఛార్జింజ్‌ స్టేషన్‌ : మీరు మీ ఎలక్ట్రిక్‌ వాహనానికి ఎల్లప్పుడూ ధ్రువీకరించబడిన ఛార్జర్‌తో పాటు ధ్రువీకరించబడిన ఛార్జింగ్‌ స్టేషన్‌లో మాత్రమే ఛార్జ్‌ చేసుకోవాలి. అక్కడ అన్నీ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. ఇవి ఈవీలకు సమస్యాత్మకంగా ఉండే ఓవర్‌ ఛార్జ్‌ మరియు వేడెక్కడం వంటి క్లిష్ట సమస్యలను నివారించడానికి ఈ స్టేషన్లు రూపొందించబడ్డాయి.

అధిక ఉష్ణోగ్రతలు : అధిక ఉష్ణోగ్రతలు మీ ఈవీ యొక్క బ్యాటరీకి ప్యాక్‌కి హాని కలిగించే అవకాశం ఉంది. అంతే కాకుండా దాని జీవితకాలంపై కూడా ప్రభావం పడుతుంది. అందువల్ల అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మీ ఈవీని ఛార్జ్‌ చేయకండి. ప్రత్యక్షంగా సూర్యరశ్మి తగిలే ప్రాంతంలోనూ ఛార్జ్‌ చేయకూడదు.

తడి పరిస్థితులు : నీటిలో విద్యుత్‌కు శక్తికి ఎక్కువగా ఉంటుంది. తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల నీరు ఉన్న చోట మీ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని ఛార్జ్‌ చేయకపోవడం ఉత్తమం. తప్పనిసరి పరిస్థితుల్లో తడి వాతావరణంలో ఛార్జ్‌ చేయాల్సి వస్తే ఛార్జింగ్‌ స్టేషన్‌కి నీటికి దూరంగా ఉండేలా చూసుకోండి.

ఓవర్‌ ఛార్జ్‌ : స్మార్ట్‌ఫోన్‌ లేదా ఎలక్ట్రిక్‌ వాహనం ఏదైనా సరే బ్యాటరీకి ఓవర్ ఛార్జ్‌ చేయడం సురక్షితం కాదు. ఓవర్‌ ఛార్జ్‌ చేయడం ద్వారా బ్యాటరీ దెబ్బ తింటుంది. బ్యాటరీ ప్యాక్‌ జీవితకాలం కూడా తగ్గుతుంది. ఆధునిక ఎలక్ట్రిక్‌ వాహనాలు ఓవర్‌ ఛార్జింగ్‌ను నిరోధించడానికి ఇన్‌బిల్ట్‌ మెకానిజంతో వస్తున్నాయి. అయితే మీరు మీ ఈవీ యొక్క ఛార్జింగ్‌ ఓవర్‌ కాకుండా చూసుకోవడం చాలా అవసరం.

ఈ నాలుగు చిట్కాలు పాటించడం ద్వారా మీ ఈవీ బ్యాటరీ దెబ్బతినకుండా ఉండటమే కాకుండా.. దాని జీవితకాలం కూడా పదిలంగా ఉంటుంది. అగ్ని ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా బ్యాటరీ పేలిపోయే ప్రమాదాలు ఉంటాయి. వేసవి ముగిసి వర్షాకాలం సమీపిస్తున్న కారణంగా తడి వాతావరణం దృష్ట్యా ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

More from DriveSpark

Article Published On: Monday, June 12, 2023, 20:09 [IST]
English summary
Key tips for ensure safe battery while charging electric vehicle
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+