వేసవిలో మీ కారు ఏసీ పర్ఫెక్ట్‌గా పనిచేయాలంటే ఈ టిప్స్ తప్పనిసరి
తెలుగు రాష్ట్రాల్లో గత రెండు నెలలుగా ఎండలు ముదిరిపోతుండగా.. మున్ముందు వేసవి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో మండే వేసవిలో కారులో ప్రయాణమంటే ఉక్కపోతే. ఏసీ ఉన్నా సరే.. బయట వేడికి కారు లోపల ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఎండాకాలంలో ఏసీ నిర్వహణ(AC In Cars) అనేది చాలా ముఖ్యం..
మిగతా సీజన్ల గురించి పక్కన పెడితే వేసవిలో కార్లలో ఏసీ వినియోగం ఎక్కువగా ఉంటోంది. అయితే ఏసీని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఈ సీజన్‌లో మీరు ప్రయాణంలో చుక్కలు చూడాల్సిందే. కాగా వేసవిలో ఏసీ ఏ సమస్య లేకుండా సక్రమంగా పనిచేయాలంటే కార్ల యజమానులు కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ఆ టిప్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

నీడలో పార్కింగ్: వేసవి కాలంలో మీరు కారును పార్కింగ్(AC Functioning) ఎక్కడ చేస్తున్నారనేది చాలా ముఖ్యమైన విషయం. మీ కారులో ఫ్యూచర్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే.. నీడలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. వేడిగా ఉండే ప్రదేశంలో కానీ.. నేరుగా సూర్యరశ్మి తగులుతున్న చోట కానీ పార్కింగ్ చేయకూడదు. ఇలా చేసినట్లయితే మీ కారులో ఏసీ దెబ్బతింటుంది.
ఒకవేళ మీరు కారు పార్కింగ్ చేయడానికి నీడ ఉన్న ప్రదేశం దొరకనట్లయితే.. మీరు ఎండలో పార్కింగ్ చేయాల్సి వస్తే.. కారుకు ఎండ తగలకుండా కవర్లతో కప్పి ఉంచండి. దీనివల్ల కారులోపల క్యాబిన్ వేడెక్కకుండా ఉంటుంది. తద్వారా ఏసీ ఫంక్షనింగ్‌పై కూడా ఎలాంటి ఎండ ప్రభావం పడకుండా ఉంటుంది. కారును సురక్షితమైన ప్రదేశంలో ఉంచినట్లయితే.. ఏసీ కూడా బాగా పనిచేస్తుంది.

ఫిల్టర్ క్లీనింగ్: కారులో ఏసీ ఏ సమస్య లేకుండా పనిచేయాలంటే ఏసీలో ఫిల్టర్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. బయట నుంచి కారు లోపల క్యాబిన్‌లోకి దుమ్ము ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి.. వారానికి ఒకసారైనా ఏసీ ఫిల్టర్‌ను శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఫిల్టర్‌లో దుమ్ము పేరుకుపోయి ఏసీ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.
కాబట్టి ఈ వేసవిలో మీ కారు ఏసీ పనితీరు మెరుగ్గా ఉండాలంటే.. ఫిల్టర్ క్లీనింగ్ కూడా తప్పనిసరిగా చేయాలి. కారు క్యాబిన్‌లో ఏసీ ఫిల్టర్ గ్లోవ్‌బాక్స్‌కు వెనక ఉంటుంది. కాబట్టి దీన్ని తీయడం కూడా పెద్ద కష్టం కాదు. ఒకవేళ ఫిల్టర్ మరీ దారుణంగా దుమ్ము పేరుకుపోయి ఉంటే.. కొత్తదానితో రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది.

నో ఫుల్‌బ్లాస్ట్ మోడ్: కొందరు కారును స్టార్ట్ చేయగానే.. ఎక్కువ కూలింగ్ కోసం ఫుల్ బ్లాస్ట్ మోడ్‌ను ఆన్ చేస్తారు. ఇది అసలు సరైంది కాదు. ముందుగా ఏసీని చాలా తక్కువ మోడ్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత కారులోని వేడి గాలి లోపలికి వెళ్లేందుకు విండోస్ కొద్దిగా ఓపెన్ చేయాలి. కాసేపయ్యాక అద్దాలు మూసివేయాలి. అనంతరం నెమ్మదిగా.. ఏసీ మోడ్‌ను పెంచాలి. తద్వారా మీరు జర్నీలో మంచి కూలింగ్‌ను ఆస్వాదించవచ్చు.
రెగ్యులర్ వాడకం: వేసవిలో మీ కారులో ఏసీని రెగ్యులర్‌గా వాడుతుండాలి. తరచూ మీరు బయటకు వెళ్లకపోవచ్చు. కానీ కాసేపు అయినా మీరు ఏసీని ఆన్‌లో ఉంచి.. కారు క్యాబిన్ చల్లగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు కార్లలో అధునాతన టెక్నాలజీలు వస్తున్నాయి. ఉదాహరణకు టెంపరేచర్ కంట్రోల్.

ఈ క్రమంలో మీరు వేసవిలో కారులో ఏసీని రెగ్యులర్‌గా వాడుతున్నట్లయితే కారు ఎప్పుడూ కూలింగ్ ఉంటుంది. ఇంకా ఏసీని క్రమం తప్పుకుండా వాడటం వల్ల ఏమైనా సమస్యలు ఉన్నా తెలుసుకోవచ్చు. దీని ద్వారా మీరు వెంటనే మరమ్మతులు చేయించుకోవచ్చు. కాబట్టి ఏసీ మెయింటైనెన్స్‌లో ఈ విషయాలను కార్ల యజమానులు తప్పకుండా గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications








