అదిరిపోతున్న KGF రాకీ భాయ్ లగ్జరీ కారు.. స్టైల్ అంటే ఇదే.. రోడ్డుపై స్టార్ పవరే వేరు!
KGF సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారిన యష్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దానికి కొనసాగింపుగా వచ్చిన KGF 2 కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో ఆయన రేంజ్ ఊహించని స్థాయికి పెరిగింది. సినిమాల విషయాన్ని ప్రక్కన పెడితే యష్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన వద్ద కోట్లు విలువ చేసే ఖరీదైన కార్లు చాలా ఉన్నాయి. ఇటీవల, ఆయన తన భార్య రాధికా పండిట్‌తో కలిసి ఓ విలాసవంతమైన కారులో ప్రయాణిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. స్టైలిష్ లుక్‌తో, కూల్ హావభావాలతో కారు నుంచి దిగుతున్న వీడియో ఆయన ఫ్యాన్స్‌కి ఫెస్టివల్ వాలా ఫీలింగ్ తీసుకువచ్చింది.
తాజాగా ఆయన విమానాశ్రయంలో కనిపించిన ఓ వీడియోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. వీడియోలో యష్ తన భార్యతో కలిసి వచ్చినట్లు కనిపిస్తుంది. అది ఒక విలాసవంతమైన SUV, ఫ్యూచరిస్టిక్ డిజైన్, స్టన్నింగ్ లుక్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. విమానాశ్రయానికి అడుగుపెడుతున్న టైంలో, అక్కడ ఎదురుగా ఉన్న ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఆయనను ఫొటోలు తీయడానికి ఎగబడ్డారు. అతను ప్రయాణించిన కారు కూడా హాట్ టాపిక్‌గా మారిపోయింది.

ఆయన ప్రయాణించిన కారు టయోటా వెల్‌ఫైర్ (Toyota Vellfire). ఈ మోడల్ భారత మార్కెట్లో హై, వీఐపీ ఎగ్జిక్యూటివ్ లాంజ్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి ఉంది. ధర విషయంలో చూస్తే, ఈ కార్లు ఇరత కార్ల కన్నా చాలా ఎక్కువ ధరలో ఉంటాయి. హై వేరియంట్ కోసం రూ.1.39 కోట్లు, కాగా వీఐపీ ఎగ్జిక్యూటివ్ లాంజ్ వేరియంట్ ధర రూ.1.51 కోట్లుగా నిర్ణయించారు. ఇవన్నీ కూడా ఎక్స్-షోరూమ్ ధరలు.
ఇంత ఎక్కువ ధరను పెట్టి కొనుగోలు చేయడం అంటే అందరికి వీలు కాదు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి వారు కొనుగోలు చేయలేరు. అందుకే, ఇవి సాధారణంగా సినిమా తారలు, ప్రముఖ రాజకీయ నాయకులు, పెద్ద వ్యాపారాలు నిర్వహించే ధనవంతులు అధికంగా కొనుగోలు చేస్తుంటారు. టయోటా వెల్‌ఫైర్ కేవలం లగ్జరీ లుక్‌తోనే కాదు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ప్రీమియం ఎంపీవీగా భారత మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.

ఇది ఒక తేలికపాటి హైబ్రిడ్ కారు. ఒకేసారి పెట్రోల్‌తో పాటు విద్యుత్ శక్తిని కూడా ఉపయోగించగలదు. ఈ హైబ్రిడ్ సిస్టమ్ కారణంగా, సాధారణ లగ్జరీ కార్లకు భిన్నంగా ఇది మంచి మైలేజీని కూడా అందిస్తుంది. లీటరుకు 19.28 కి.మీ వరకు ఇస్తుంది. అందుకే సెలబ్రిటీలను, హై ప్రొఫైల్ ప్రయాణికులను కారు మరింత ఆకర్షిస్తోంది.ఈ కారులో 2487 సీసీ సామర్థ్యం గల హైబ్రిడ్ ఇంజిన్ అమర్చారు. ఇది CVT గేర్‌బాక్స్‌తో జోడించబడింది.
దీనిలో 7 మంది కంఫర్ట్‌గా ప్రయాణించచ్చు. అంతేకాక, విశాలమైన క్యాబిన్, మూడవ వరుస సీట్లలో కూడా మిలటరీ స్థాయిలో లెగ్‌రూమ్ ఉండటం, దీన్ని కుటుంబ ప్రయాణాలకూ, అధికారిక ప్రయాణాలకూ సరిగ్గా సరిపోయే మోడల్‌గా నిలబెడుతోంది. దీని ఆకర్షణీయమైన డిజైన్, విలాసవంతమైన స్థలం చూస్తేనే తలతిప్పలేరు. అందుకే, ఈ కారును కొనుగోలు చేసే వారు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








