అంబులెన్స్ డ్రైవర్‌గా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఎక్కడో తెలుసా?

కరోనా సెకండ్ వేవ్ ఎంతో మంది ప్రజల జీవితాలను తారుమారు చేసింది. ఈ సమయంలో ఎంతోమంది ప్రజలు మరియు రాజకీయ నాయకులు స్వచ్చందంగా ముందుకు వచ్చి, ఉదారంగా తమ సేవలను అందిస్తున్నారు. దీనికి సంబంధించిన చాలా సంఘటనలు ఇదివరకు వెలుగులోకి వచ్చాయి, అంతే కాకుండా వీటి గురించి చాలా సమాచారం మనం తెలుసుకున్నాం.

అంబులెన్స్ డ్రైవర్‌గా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఎక్కడో తెలుసా?

ఇంతకు ముందు ఒక రాజకీయ నాయకుడు తన ఇన్నోవా కారును అంబులెన్సుగా మార్చి కరోనా బాధితులకు వినియోగించడానికి విరాళంగా ఇచ్చారు. అయితే ఇదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ శాసనసభ్యురాలు అంజలి నింబల్కర్ కూడా ప్రజలకు సహాయం చేయడానికి ఒక అడుగు ముందుకు వేశారు.

అంబులెన్స్ డ్రైవర్‌గా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఎక్కడో తెలుసా?

ఇందులో భాగంగానే అంజలి నింబల్కర్ నాలుగు అంబులెన్స్‌లను కొనుగోలు చేసి ఖానాపూర్ తాలూకా హాస్పిటల్ కి అప్పగించింది. అంతే కాకుండా ఈమె ఖానాపూర్ పట్టణంలో స్వయంగా తానె అంబులెన్స్ డ్రైవ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్శించింది.

అంబులెన్స్ డ్రైవర్‌గా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఎక్కడో తెలుసా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొంత తక్కువగా ఉంది. ఈ కారణంగా దేశంలో అక్కడక్కడా లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతం తక్కువగా ఉన్న కరోనా సంక్రమణను కూడా తగ్గించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తమ నియోజకవర్గంలోని ప్రజల దుస్థితిని అర్థం చేసుకోవడానికి, అంజలి నింబల్కర్ గతంలో నియోజకవర్గంలోని గ్రామాలను సందర్శించారు.

అంబులెన్స్ డ్రైవర్‌గా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఎక్కడో తెలుసా?

ఎమ్మెల్యే అంజలి నింబల్కర్ తన నియోజకవర్గంలోని ప్రజలకు చాలా విధాలుగా సహాయం చేస్తున్నారు. నివేదికల ప్రకారం, ఖానాపూర్ ప్రాంతంలో కరోనా సెకండ్ వేవ్ ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మరియు ప్రజలలో ధైర్యాన్ని నింపడానికి అంజలి నింబల్కర్ కృషి చేస్తున్నారు.

అంబులెన్స్ డ్రైవర్‌గా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఎక్కడో తెలుసా?

ప్రస్తుతం దావనగెరె జిల్లా గౌరవ నియోజకవర్గం, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజకీయ కార్యదర్శిగా ఉన్న ఎంపి రేణుకాచార్య తన నియోజకవర్గంలోని ప్రజల కోసం, కరోనావైరస్ కోసం రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తానూ విరాళం ఇచ్చిన అంబులెన్స్ కి డ్రైవర్‌గా మారి మరణించిన వ్యక్తి యొక్క మృతదేహాన్ని తరలించిన సంఘటన కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది.

కరోనా మరమ్మగారికి భయపడుతున్న కాలంలో ఇలాంటి క్లిష్టమైన పనికి పూనుకోవడం ప్రజలందరూ ఆమెను ఎంతగానో మెచ్చుకునుటున్నారు. చాలా మంది నాయకులు కూడా తమ నియోజకవర్గాలలో ఇలాంటి పరిస్థితిలో వారి వంతు సహాయం అందిస్తున్నారు.

అంబులెన్స్ డ్రైవర్‌గా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఎక్కడో తెలుసా?

కొన్ని నియోజక వర్గాల్లో ఉన్న రాజకీయ నాయకులు తమ ప్రజలు ఎంత కష్టాలలో ఉన్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఊరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజలకు చాలా వరకు సహాయం చేస్తున్న రాజకీయనాయకులను వీరు ఆదర్శంగా తీసుకుని ఇప్పటికైనా ప్రజలు సేవచేయడానికి ముందుకు రావాలి.

Most Read Articles

English summary
Anjali Nimbalkar MLA Khanapur Drive Ambulance. Read in Telugu.
Story first published: Monday, June 14, 2021, 11:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X