Live Accident Video: టైరు ఊడి వచ్చింది.. మరో కారు గాల్లోకి ఎగిరింది.. సినిమా సీన్ రిపీట్
రోడ్డుపై తరచూ ఎన్నో ప్రమాదాలను చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఊహించని విధంగా ప్రమాదాలు జరుగుతాయి. ఎదురుగా లేదా పక్కన వెళ్లే వ్యక్తుల ద్వారా యాక్సిడెంట్లతో హైవేలు సాధారణ రోడ్లు రక్తమోడుతున్నాయి.. అలా ఊహించని రీతిలో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. ఏకంగా సినిమాలో చూపించినట్లు గాల్లో తేలుతూ కారు పల్టీలు కొట్టింది.
అందుబాటులో ఉన్న టెక్నాలజీతో నేడు ఎన్నో ప్రమాదాలు లైవ్ గా రికార్డ్ అవుతున్నాయి. కార్లలో ఏర్పాటుచేసిన డాష్ బోర్డుల ద్వారా కొన్ని ప్రమాదాలు బయటకు వస్తున్నాయి. ఇంకొన్ని ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా అనుకోని విధంగా జరుగుతున్న ప్రమాదాలు ఒక్కొక్కటిగా వార్తల్లో నిలుస్తున్నాయి. అమెరికాలో జరిగిన ప్రమాదం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

గాల్లోకి పది అడుగుల ఎత్తుకు ఎగిరి..
ఈ ప్రమాద వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అమెరికాలోని ఓ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ట్విట్టర్ వినియోగదారుడు అనూప్ ఖత్రా (ఆటో పైలట్) తన టెస్లా కారు డ్యాష్ బోర్డు కెమరాలో రికార్డైనా ఈ భీకర ప్రమాద వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈ ప్రమాదం జరిగిన తీరు చూస్తే పక్కన వారు కూడా ఆశ్చర్య పోయేలా ఉంటుంది. కారును ఢీకొట్టిన తీరు క్షణాల్లో జరిగిపోయింది.
వీడియోలో రికార్డ్ అవుతున్న దృశ్యాలను గమనించినట్లైతే కియా సోల్ వేగంగా బయలు దేరుతుంది. రోడ్డులో పక్కనే వెళ్తున్న కారుకి సరిగ్గా చేరుకునే సరికి చెవర్ లెట్ సిల్వరాడో నుంచి టైరు వచ్చి కియా కారును తాకుతుంది. దీంతో కారు వేగం ఎక్కువ ఉండటంతో గాల్లోకి ఎగిరి కిందపడుతుంది. అమాంతం గాలిలో 10 అడుగుల ఎత్తు వరకు ఎగిరి, 2 సార్లు పల్టీ కొడుతుంది. ఈ కారు ప్రమాదానికి ముఖ్య కారణం బోల్ట్ లు సరిగ్గా బిగించకపోవడమే అని తెలుస్తోంది.
వెనక కారు డ్యాష్ బోర్డ్ లో రికార్డు..
వెనకాలే వస్తున్న ఆటోపైలట్ కారులో ఈ దృశ్యాలన్నీ రికార్డు అవుతాయి. ప్రమాదానికి కొద్ది దూరంలో అతని టెస్లా కారు సురక్షితంగా నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో కియా కారు పూర్తిగా నజ్జునుజ్జు అవుతుంది. కానీ అదృష్టశావత్తు డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. ప్రమాద సమయంలో అతను సీట్‌బెల్ట్ ధరించడంతో ప్రాణాలను నిలబెట్టుకోగలిగాడు. సీట్‌బెల్ట్ ధరించడం వల్ల ప్రాణాలు నిలబడతాయని మరోసారి నిరూపితమైంది.

ప్రతి ఒక్కరూ డ్రైవర్లు రోడ్డులో వాహనం నడిపేటప్పుడు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. బైక్, స్కూటర్, కార్లను నడిపే ముందు హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించండి. ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా కచ్చితంగా ప్రాణాలను నిలబెట్టుకోవచ్చు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్/ ఇయర్ ఫోన్‌లను ఉపయోగించవద్దు. దూర ప్రయాణ సమయంలో విశ్రాంతి తీసుకుని ప్రయాణిస్తే చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు.

అధునాత ఫీచర్లతో టెస్లా కార్లు..
ఇక, 2018 మార్చిలో అంతర్జాతీయంగా విడుదలైన అన్ని టెస్లా కార్లు డ్యాష్‌క్యామ్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. ఈ కార్ల ద్వారా ప్రయాణంలో సులభంగా వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ప్రముఖ కారు తయారీదారు కంపెనీగా గుర్తించబడిన కియా.. తయారు చేసే సోల్ కారు ఇది ఇటాక్టిక్ కా ఉత్పత్తి, పూర్తి ఛార్జిలో 280కి.మీ రేంజ్ వరకు అందించబడుతుంది. ఈ మోడల్ భారత్ లో అందుబాటులో లేదు.
విదేశాల్లో కియా సోల్ ఖరీదూ సరిగ్గా రూ.27 లక్షలకు అందుబాటులో ఉంది. 64 kWh లిథియం ఐయాన్ పాలిమర్ బ్యాటరీ ప్యాక్ తో ఈ కారు రానుంది. అలానే అదనంగా ఆకర్షణీయమైన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. అలాయ్ వీల్స్, టచ్‌స్క్రీన్ డిస్ప్లే, రివర్సింగ్ కెమెరా సిస్టమ్, డ్యూయల్ ఫుల్ LED హెడ్‌ల్యాంప్స్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్ సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








