Kia Carens Car with Metal Cage కియా కారు చుట్టూ రక్షణగా చువ్వల ఏర్పాటు.. వైరల్ అవుతున్న విజువల్స్..

సొంత కారు కొనుగోలు చేయడం అనేది ప్రతి ఒక్కరి కల. ఈ క్రమంలో మొదటిసారి కారు కొనేవారు ముఖ్యంగా వాహనాల భద్రతా ఫీచర్లపై ఎక్కువ దృష్టి సారిస్తారు. అందుకు అనుగుణంగా టాటా, మహీంద్రా వంటి ప్రముఖ కార్ల తయారీదారులు కార్ల నిర్మాణ నాణ్యత మరియు మార్కెటింగ్‌పై ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నారు.

వాహనాల నిర్మాణ నాణ్యతను నిర్ధారించడానికి ఎక్కువగా తయారీదారులు క్రాష్ టెస్టులను చేస్తుంటారు. గతంలో అయితే చిన్న చిన్న గీతలు పడకుండా వాహనదారులు తమ వాహనాలకు ముందు, వెనుక భాగంలో మెటల్ బంపర్లను అమర్చేవారు. అయితే బుల్‌బార్లు మరియు మెటల్ బంపర్‌ల కారణంగా పాదచారులకు హాని వాటిల్లుతోందని తేలింది. కాగా తాజాగా ఓ వాహనదారుడు తన కారుకు ఓ మెటల్‌ కేజ్‌ను అమర్చడం వైరల్‌గా మారింది.

Kia Carens Car with Metal Cage

ప్రతీక్ సింగ్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానెల్‌లో అందుకు సంబంధించిన వీడియోను అప్‌లోడ్‌ చేశారు. సరికొత్త కియా కేరెన్స్‌ ఎంపీవీ (Kia Carens MPV) చుట్టూ మెటల్ కేజ్‌ అమర్చడాన్ని వీడియోలో చూడవచ్చు. దీని వెనుక అసలు స్టోరీ ఏంటో వివరాల్లోకి వెళితే...

ఇండియాలో వాహనప్రియులు ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన కార్లకు తమకు నచ్చినట్లుగా పలు మార్పులు చేస్తుంటారు. అలాంటి కార్లకు దేశంలో కొరత లేదు. మార్పులు చేసిన తర్వాత మరింత ఆకర్షణీయంగా ఉండాలి అనుకుంటారు. ఇక్కడ ఓ కారు యజమాని తన కియా కేరెన్స్‌కు భద్రత కోసం స్కూటర్లపై కనిపించే క్రాష్ గార్డ్‌ను అమర్చారు.

ఈ కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. లగ్జరీ ఫీచర్లతో లభించే ప్రముఖ కారు కియా కేరెన్స్. ఆ కారుకు రక్షణ కోసం యజమాని క్రాష్‌ గార్డులను అమర్చారు. కొంతమంది రేసర్లు మాత్రమే తమ కార్లపై ఇటువంటి గార్డులను ఉపయోగిస్తారు. కారు బోల్తా పడినప్పుడు భద్రతా పరికరంగా ఈ గార్డులు పనిచేస్తాయి.

ఆయా కార్లకు రేసర్లు ఉపయోగించే గార్డులు దృఢంగా, మంచి నాణ్యతతో ఉంటాయి. కియా కేరెన్స్‌ యజమాని ఓ సాధారణ కారు కోసం ఇలా క్రాష్‌ గార్డును ఉపయోగించడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఈ కియా కేరెన్స్‌ (kia Carens) కొత్తది కాగా.. ఇంకా తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్‌తోనే ఉందని వీడియో ద్వారా తెలుస్తోంది.

వాహనానికి ఎలాంటి డ్యామేజ్‌ కాకుండా నంబరు రిజిస్ట్రేషన్‌ చేసుకునే ముందే యజమాని ఈ గార్డును ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. కాగా సినిమా షూటింగ్‌లకు ఉపయోగించే వాహనాల్లో ఇలాంటి గార్డులు వాడతారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలను షూట్‌ చేసే సమయంలో కెమెరాలను తీసుకెళ్లడానికి ఇటువంటి గార్డులను ఉపయోగిస్తారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రాలేదు.

లగ్జరీ కియా కేరెన్స్ : ఎర్టిగా, XL6 బ్రాండ్‌ కార్లతో పోలిస్తే కియా కేరెన్స్ ఎక్కువ స్పేస్‌, ప్రీమియం-నెస్‌ను అందించే సూపర్‌ MPV. SUV మరియు MPV కార్ల ప్రియులను ఆకర్షించడానికి కియా కంపెనీ ఈ మోడల్‌లో అలాంటి ఫీచర్లు ప్రవేశపెట్టింది. ఫ్యామిలీ పరంగాను ఈ వాహనానికి అధిక ప్రాధాన్యతనిస్తారు.

కియా కేరెన్స్‌ ఆరు ఇంకా ఏడు సీట్ల ఎంపికలలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. విలాసవంతమైన స్పేస్‌ కారు కోసం చూస్తున్న వారికి 6 సీటర్ సరైన ఎంపిక. దేశీయ మార్కెట్‌లో మారుతి సుజుకి XL6 మరియు ఎర్టిగాతో కియా కేరెన్స్‌ పోటీపడుతోంది. ఎక్స్‌ షో రూమ్‌లో బేస్‌ ధర రూ. 10.45 లక్షలు కాగా హై ఎండ్‌ ధర రూ. 18.95 లక్షలుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 31, 2023, 13:19 [IST]
English summary
Kia carens spotted with metal cage as body protector video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+