పోలీస్ విభాగంలో చేరిన కియా కార్లు ఇవే.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన 'కియా మోటార్స్' తాజాగా పంజాబ్ పోలీసులకు 71 కియా కారెన్స్ కస్టమైజ్జ్ ఎంపివీలను డెలివరీ చేసింది. కంపెనీ డెలివరీ చేసిన ఈ కియా కారెన్స్ ఎంపీవీలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సాధార ప్రజల రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. ప్రభుత్వాలు సైతం ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉన్న కార్ల జాబితాలో చెప్పుకోదగ్గ కియా మోడల్ ఈ కారెన్స్. ఈ కారణంగానే ఇప్పటికే ఈ కార్లను పోలీస్ విభాగాలు, వైద్యరంగంలో అంబులెన్సులుగా కూడా కస్టమైజ్ చేసి ఉపయోగిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే కియా కారెన్స్ ఎలాంటి ఉత్తమ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని స్పష్టంగా అర్థమైపోతుంది.

Kia Specially Customised Carens MPVs

ఇక అసలు విషయానికి వస్తే.. పంజాబ్ పోలీసుల కోసం కంపెనీ కస్టమైజ్ చేసిన 71 కియా కారెన్స్ కార్లను డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించడంలో భాగంగానే పంజాబ్ పోలీసులు ఈ కియా కారెన్స్ కార్లను ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికిల్స్ మాదిరిగా ఉపయోగించనున్నారు. భవిష్యత్తులో ఇవి మరిన్ని ప్రయోజనాలకు ఉపయోగించే అవకాశం ఉందిని చెబుతున్నారు.

లేటెస్ట్ టెక్నాలజీ, కనెక్టెడ్ కార్ ఫీచర్స్, పెద్ద వీల్ బేస్ మరియు మూడు వరుసల సీటింగ్ కెపాసిటీ కలిగి ఉండటం వల్ల పంజాబ్ పోలీసులు కారెన్స్ ఎంపివీలను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కస్టమైజ్డ్ కార్లు అధిక తీవ్రత కలిగిన స్ట్రోబ్ లెట్స్, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్‌లతో పాటు దయాల్ 112 మరియు ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్ డికాల్‌లను పొందుతుంది.

పంజాబ్ పోలీస్ విభాగంలో చేరిన కియా కారెన్స్ కార్లలో 60 Ah బ్యాటరీలు ఉన్నట్లు తెలుస్తోంది. కస్టమైజ్డ్ కారెన్స్ 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్టెడ్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఎంపీవీ యొక్క టాప్ వేరియంట్లలో కనిపించే అల్లాయ్ వీల్స్ మాదిరిగా కాకుండా ఇందులో స్టీల్ వీల్స్ ఉండటం గమనించవచ్చు.

పోలీస్ విభాగంలో ఉపయోగించనున్న కస్టమైజ్డ్ కియా కారెన్స్ మంచి డిజైన్ కలిగి.. కారుకి అన్ని వైపులా పోలీస్ లోగోలను పొందుతుంటాయి. ఈ కార్లలో 12 వోల్ట్ పవర్ సాకెట్‌లు, 5 టైప్-సీ USB ఛార్జింగ్ పోర్ట్స్ వంటి వాటితో పాటు అన్ని చక్రాల పైన డిస్క్ బ్రేక్స్, ఏబీఎస్, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నాలజీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటి మరిన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

కియా ఇండియా మొదటిసారిగా ఈ కియా కారెన్స్ పోలీస్ వాహనాలను ఇటీవల న్యూ ఢిల్లీలో జరిగిన గ్లోబల్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో కనిపించాయి. అప్పుడే ఈ కార్లు పలువురి ఆటో మొబైల్ ఔత్సాహికుల మనసు దోచాయి, కాగా ఇప్పుడు పంజాబ్ పోలీస్ విభాగంలో చోటు సంపాదించుకున్నాయి. ఈ కార్లను డెలివరీ చేయడం చాలా ఆనందంగా ఉందని కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ పేర్కొన్నారు.

అంతే కాకుండా.. ఈ కస్టమైజ్డ్ కియా కరెన్సీ కార్లు నిర్దిష్టమైన మొబిలిటీ అవసరాలను తీర్చడానికి విస్తృతంగా కస్టమైజ్ చేసినట్లు, దీంతో సుదీర్ఘ ప్రయాణాల్లో కూడా సురక్షితమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయని, పంజాబ్ పోలీసులతో జత కట్టడం చాలా సంతోషంగా ఉందని 'మ్యుంగ్ సిక్ సోహ్న్' (కియా ఇండియా చీఫ్ సేల్స్ అండ్ బిజినెస్ ఆఫీసర్)అన్నారు. తప్పకుండా ఈ కార్లు పోలీస్ విభాగానికి అన్ని విధాలా సరిపోయే విధంగా ఉంటాయని పేర్కొన్నారు.

కియా ఇండియా ప్రారంభం నుంచి భారతీయ మార్కెట్లో మంచి ఉత్పత్తులను లాంచ్ చేస్తూ ఉత్తమమైన అమ్మకాలను పొందుతూ ఉంది. కంపెనీ దేశీయ విఫణిలో సెల్టోస్, సోనెట్, కార్నివాల్, కారెన్స్ మరియు ఈవీ6 (ఎలక్ట్రిక్ వెహికల్) అనే ఐదు మోడల్స్ లాంచ్ చేసి ఇప్పటికే 1.6 మిలియన్ సేల్స్ పొందగలిగింది. ఇందులో 9.1 లక్షల దేశీయ అమ్మాకాలు మరియు 2.5 లక్షల ఎగుమతులు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, February 15, 2024, 9:25 [IST]
English summary
Specially customised 71 kia carens mpvs delivered to punjab police
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+