అకస్మాత్తుగా వచ్చి కియా సెల్టోస్ కారును ఢీకొట్టి.. వైరల్ అవుతున్న వీడియో!
భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా ఉంటోంది. ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం ఇందుకు సహా రోడ్లపైకి అకస్మాత్తుగా వస్తున్న జంతువులు కూడా కారణం అవుతున్నాయి. ఇటీవల ఇటువంటి ఘటనలు ఆందోళనక స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదం వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కియా సెల్టోస్ కారు ఓ రోడ్డుపై వేగంగా ప్రయాణం చేస్తోంది. ముందు నెమ్మదిగా ప్రయాణిస్తున్న వాహనాలను ఓవర్‌టేక్ చేసేందుకు వేగంగా ప్రయాణం చేయడాన్ని వీడియోలో గమనించవచ్చు. అదే రోడ్డుపై వెళ్తున్న ట్రక్కును ఓవర్‌టేక్ చేసి ముందుకు వెళ్తుండగా.. అకస్మాత్తుగా డివైడర్‌ను దాటి వచ్చిన ఓ ఆవు దూడ.. కియా సెల్టోస్ వాహనాన్ని ఢీకొట్టాయి.

డ్యాష్‌బోర్డ్ కెమెరాలో.. : రోడ్డు డివైడర్‌పై మొక్కలు ఉండడం కారణంగా, చివరి నిమిషం వరకు ఆవు రాకను కియా సెల్టోస్ డ్రైవర్ గుర్తించడం వీలు కాలేదు. దీంతో కారును నియంత్రించేందుకు డ్రైవర్‌కు సమయం లేకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కారు డ్యాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డు అయింది.
ఈ ప్రమాదంలో ఆవు, దూడ రోడ్డుమీద పడిపోయాయి. కారు కొంత డ్యామేజీ అయింది. కారు ఫెండర్, వెనుక డోర్‌కు కొంత డ్యామేజీ జరిగింది. ప్రమాదం అనంతరం ఆవు, దూడ అక్కడ నుంచి అక్కడ నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.

కారు వెనుకన వస్తున్న వాహనదారులు ఈ ఘటనతో చాలా వరకు అప్రమత్తం అయ్యారు. ఫలితంగా ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు. కొంత మంది తమ వాహనాల వేగాన్ని తగ్గించారు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు అందుబాటులో లేవు.
భారత్‌లో రోడ్లపైకి జంతువులు రాకుండా కొన్ని చోట్ల ఏర్పాట్లు ఉన్నాయి. అయితే చాలా చోట్ల అలాంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అకస్మాత్తుగా జంతువులు రావడంతో ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తు్న్నాయి. అయితే కియా సెల్టోస్ క్యాబిన్ చెక్కుచెదరలేదు.

* ఇటీవల కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల అయింది. ఈ కారు మూడు ఇంజిన్ ఆప్షన్‌లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. కియా సెల్టోస్ 2023.. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 133bhp శక్తి, 144Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
1.5 లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 158bhp శక్తి, 253Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7 స్పీడ్ DCT గేర్‌బాక్స్, 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌లో అందుబాటులో ఉంటుంది. మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 114bhp శక్తిని, 250Nm గరిష్ఠ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజిన్‌ను బట్టి MT, iMT, AT, IVT, DCT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వస్తుంది.
ఈ కారు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. EBDతో కూడిన ABS, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్ల కొత్త సెల్టోజ్ కలిగి ఉంది. అత్యంత కీలక ఫీచర్ అయిన ADAS (అడ్వాన్సడ్ డ్రైవర్ అసెస్టెన్స్ సిస్టమ్‌ను) ను కలిగి ఉంటుంది. కారు ధర రూ.10.89 లక్షల నుంచి 19.99 లక్షల వరకు (ఎక్స్‌షోరూం) ఉంది.


Click it and Unblock the Notifications








