Kia సెల్టోస్ కారుకు భారీ ప్రమాదం.. డ్రైవర్‌కు చిన్న గాయం కూడా కాలేదు.. ఎందుకంటే..?
అతి వేగం ఎప్పుడూ చాలా ప్రమాదకరం. ప్రస్తుతం అతివేగం కారణంగా రోజూ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదల అయిన కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కారు ప్రమాదానికి గురైంది. ఈ కారును ఇటీవలే డెలివరీ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతలోనే ప్రమాదం జరిగింది.
ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కియా సెల్టో్స్ 2023 కారు తొలుత స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారు అతివేగంగా ప్రయాణం చేసినట్లు ఘటన వీడియో, ఫోటోలు గమనిస్తే తెలుస్తోంది.

ఈ ఘటనలో కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కారు తొలుత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం నియంత్రణ కోల్పోయి అనేక సార్లు బోల్తాపడింది. దీంతో కారుకు భారీగా డ్యామేజీ జరిగింది. అయినా కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తి ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఈ భారీ ప్రమాదం జరిగినా కారు పిల్లర్లు చెక్కుచెదరలేదు. ఈ కారులోని భద్రతా ఫీచర్లు కాపాడాయి.
కార్లను అధిక వేగంతో రేస్ ట్రాక్‌లపైన డ్రైవింగ్ చేయ్యాలి, అందుకు సంబంధించిన ఏర్పాట్లు అక్కడ ఉంటాయి. పబ్లిక్ రోడ్లపై అత్యధిక వేగంతో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఘటనలు కారణంగా రోడ్లపై నడిచే వారు సహా జంతుకులు కూడా ప్రమాదాల బారిన పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. అధిక వేగం కారణంగా ప్రమాద సందర్భాల్లో కార్లను నియంత్రించేందుకు సమయం తక్కువగా ఉంటుంది.

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌లో అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ SUV 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీ బ్రేకింగ్ సిస్టమ్), బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, 4 డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. వీటితోపాటు హిల్ అసిస్ట్ కంట్రోల్, వెనుక పార్కింగ్ సెన్సార్లు మరింత భద్రతను కల్పిస్తాయి.
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ హై ఎండ్ వేరియంట్ కార్లలో మరింత మెరుగైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంటాయి. ట్రాక్షన్ కంట్రోల్, ADAS- అడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, లెవల్ 2 ఫీచర్లు, 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ల కారణంగా ఈ సెగ్మెంట్‌లో కియా సెల్టోస్ అత్యంత భద్రత కలిగిన కారుగా నిలిచింది.

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 158bhp శక్తి మరియు 253 గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నేచురల్ ఆస్పిరేటెడ్ 1.5 లీటర్ల ఇంజిన్ ఉత్పత్తి చేసినదాని కంటే ఎక్కువ. ఈ ఇంజిన్ 113bhp శక్తి మరియు 144Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అదే 1.5 లీటర్ల టర్బో డిజిల్ ఇంజిన్ 114bhp శక్తి మరియు 250Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ ఇంజిన్లు వేర్వేరు ట్రాన్సిమిషన్ ఆప్షన్లను కలిగి ఉంటాయి. ఇంజిన్‌ను బట్టి MT, iMT, AT, IVT, DCT ట్రాన్సిమిషన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వస్తుంది.
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యానిట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కార్ టెక్‌కు సపోర్టు చేస్తుంది. కొత్త కియా సెల్టోస్‌లో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








