Kick Starter కిక్ రాడ్డు లేకుండా విడుదలవుతున్న బైక్స్.. కిక్కర్ లేకుంటే ఎలా స్టార్ట్ అవుతాయో తెలుసా..?
ప్రస్తుతం మార్కెట్లో విడుదలవుతున్న కొన్ని బైక్ లకు కిక్ రాడ్లు రావడం లేదు. సెల్ఫ్ స్టార్ట్ ద్వారా వీటిని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడే మీకో సందేహం వచ్చి ఉంటుంది. ఒకవేళ సెల్ఫ్ స్టార్ట్ పనిచేయకపోతే బైక్ ను ఎలా స్టార్ట్ చేయాలి? కిక్ రాడ్ లేకపోతే ఎలా? ఇలాంటి సందేహాలెన్నో మీకు వచ్చి ఉంటాయి.. మీ సందేహాలను ఇక్కడ నివృత్తి చేసుకోండి.
మార్కెట్‌లో ప్రస్తుతం ఎన్నో రకాల కొత్త బైక్స్ పుట్టుకొస్తున్నాయి. సరికొత్త టెక్నాలజీతో పలు కంపెనీలు ఎప్పటికప్పుడు అధునాతన మోడళ్లను లాంఛ్ చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. హీరో, హోండా, యమహా, టీవీఎస్, బజాజ్ వంటి పలు కంపెనీలు కొత్తగా తీసుకువస్తున్న మోడళ్లలో కొన్ని మార్పులను చేస్తున్నాయి. వీటిలో ప్రధానంగా కిక్ రాడ్ లేకుండా బైక్ లను ఉత్పత్తి చేయనున్నాయి. అయితే కొన్ని కంపెనీలు ఇప్పటికే కిక్కర్ ని అందిచడం లేదు.

సెల్ఫ్ స్టార్టర్ రాకముందు పాత బైకులను కిక్ రాడుతో స్టార్ట్ చేసేవారు. అధునాతన టెక్నాలజీ కారణంగా సెల్ఫ్ స్టార్టర్ బైకులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు కొన్ని ప్రీమియం బైక్‌లలో కిక్కర్లు లేకపోవడం గమనించవచ్చు. ముఖ్యంగా యమహా ఆర్15, రాయల్ ఎన్‌ఫీల్డ్, బజాజ్ పల్సర్, కేటీఎం వంటి బైక్స్‌కి కిక్కర్లు రావట్లేదు. ప్రధానంగా వీటిని తొలగించడానికి కారణం ఏంటో తెలుసుకుందాం..
ఫ్యూయల్ ఇంజెక్టర్: సాధారణంగా బైక్‌లలో కార్బ్యురేటర్ ఉంటుంది. దీని ద్వారా పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఇంజన్‌కి సరఫరా అవ్వడానికి మోటార్ ఉంటుంది. ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా పెట్రోల్ పంపు చేయడానికి 9V పవర్ అవసరం అవుతుంది. కానీ కొన్ని బైక్ లకు కికర్ తో స్టార్ట్ చేస్తే 9 వోల్టుల పవర్ లభించదు. దీంతో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఆధారంగా దీనిని మార్పుచేశారు. అందువల్ల ఇప్పుడు వస్తున్న కొన్ని బైక్‌లలో కిక్కర్‌ని ఉపయోగించడం లేదు. ఫ్యూయల్ ఇంజెక్టర్లు ఉన్న బైకులకు కిక్ రాడ్ ఉండదు.

అడ్వాన్స్‌డ్ సెల్ఫ్ స్టార్ట్: కొన్ని బైక్‌లలో సెల్ఫ్ స్టార్ట్ సిస్టమ్ ఉంటుంది. ఇలాంటి బైకులకు కిక్కర్ అవసరం లేదు. బ్యాటరీ పవర్ తక్కువగా ఉన్నప్పుడు సెల్ఫ్ మాత్రమే కాదు బైక్‌లో ఇతర భాగాలు కూడా పనిచేయవు. అయితే అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఈ బ్యాటరీలు వాటంతటా అవే శక్తిని ఉత్పత్తి చేసేలా వీటిని తయారు చేశారు. దీంతో వీటికి కిక్ రాడు అవసరం లేదు.
ప్రస్తుతం లభించే టూవీలర్లు వాటి ఫీచర్ల ఆధారంగా ఆయా సంస్థలు ధరను నిర్ణయిస్తున్నాయి. మార్కెట్‌లోకి వచ్చే బైక్స్ అప్‌డేటెడ్ టెక్నాలజీతో అందుబాటులో ఉన్నాయి. అధునాతన ఫీచర్లు, అద్భుతమైన డిజైన్లతో కస్టమర్లను కట్టి పడేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు చాలా కంపెనీలు కిక్ రాడ్ లేకుండా బైక్‌లను మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. సరికొత్త సాంకేతికతో వస్తున్న బైక్‌లలోని బ్యాటరీలు వాటంతట అవే ఛార్జ్ అవుతాయి. కాబట్టి వీటిలో చాలా వరకు సమస్య ఉండటం లేదు.

కొన్ని సందర్బాల్లో బ్యాటరీ పవర్ తగ్గిపోవడం వల్ల లైట్స్ అనేవి స్పష్టంగా కనిపించవు. దీంతో పాటు బైక్ న్యూట్రల్‌లో ఉన్నప్పుడు మాత్రమే స్టార్ట్ అవుతుంది. బ్యాటరీ పవర్ తక్కువగా ఉన్నట్లు సంకేతాలను గమనిస్తే వెంటనే మార్చుకోవడం ఉత్తమం. దూర ప్రయాణాలకు చేసే సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








