కారులో చిక్కుకుపోయిన చిన్నారి....2 గంటల తరువాత ఏంజరిగిందంటే?

పిల్లలతో, పెంపుడు జంతువులతో కారు లేదా ఏదైనా వాహనాన్ని ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక చిన్న తప్పు పెద్ద విపత్తుకు దారితీస్తుంది. పంజాబ్‌లోని నంగల్ సమీపంలో జరిగిన ఈ సంఘటన చూస్తే ఎవరి హృదయాన్ని అయినా కలిచివేస్తుంది.

కారులో చిక్కుకుపోయిన చిన్నారి....2 గంటల తరువాత ఏంజరిగిందంటే?

కారు లోపల పిల్లలను వదిలి పెట్టడం ఈ రోజులలో కామన్ అయిపోతోంది. భారతదేశంలో లాక్ చేయబడ్డ కార్ల నుంచి పిల్లలు క్షేమంగా బయటకు రావటం వంటి సంఘటనలు చాలా చూసి ఉంటారు. ఇక్కడ మరో సంఘటన పంజాబ్ లోని నంగల్ లో జరిగింది, సుమారు రెండు గంటల తర్వాత చిన్నారికి ఏమి జరిగిందో చూద్దాం రండి...

కారులో చిక్కుకుపోయిన చిన్నారి....2 గంటల తరువాత ఏంజరిగిందంటే?

తల్లిదండ్రులు తమ పిల్లాడిని హ్యుందాయ్ కారులో వదిలి, ఏదో కొనుగోలు చేయడానికి వెళ్లారు, 2 నిమిషాల్లో తరువాత తిరిగి వచ్చారు. ఇంతలో కారు తలుపు లాక్ చేయబడింది. అదృష్టవశాత్తు, కారు యొక్క ఇంజిన్ రన్ అవుతోంది మరియు ఎ/సి ఆన్ చేయబడింది, ఇది కారు లోపల ఉష్ణోగ్రత అంతటా కూడా సౌకర్యవంతంగా ఉన్నట్లుగా కనిపించింది.

కారులో చిక్కుకుపోయిన చిన్నారి....2 గంటల తరువాత ఏంజరిగిందంటే?

అయితే, హ్యుందాయ్ క్రెటా సెంట్రల్ గా లాక్ చేయబడుతుంది కనుక, కారు లోపల ఉండే పిల్లర్ లాక్ బటన్ ని ప్రెస్ చేసి ఉండాలి, ఇది డోర్ మీద ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ మీద పొజిషన్ చేయబడుతుంది. అయితే, అదే బటన్ ఉపయోగించి కారును అన్ లాక్ చేయడం ఎలాగో పిల్లాడికి తెలియదు కాబట్టి వాహనం లోపల లాక్ పొరపాటున చేయబడింది.

అక్కడున్న స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు కారు కిటికీని పగలగొట్టి బయటకు తీసే ప్రయత్నం చేశారు కానీ సఫలం కాలేదు. ఆధునిక కార్లు లామినేటెడ్ విండోలతో వస్తాయి కాబట్టి వాటిని బద్దలు కొట్టడం సులభం కాదు. ప్రతి కారులో ఒక విండో బ్రేకర్ అందుబాటులో ఉంచాలి, ఇది ఒక ప్రమాదం జరిగినప్పుడు తలుపులు ఇరుక్కుపోయే సందర్భంలో విండో బద్దలు కొట్టుకొని సురక్షితంగా బయటకు రావచ్చు.

కారులో చిక్కుకుపోయిన చిన్నారి....2 గంటల తరువాత ఏంజరిగిందంటే?

విండో గ్లాస్ ను పగలగొట్టే ప్రయత్నించిన తర్వాత కారు యజమాని కారు యొక్క డూప్లికేట్ కీని తీసుకురావడానికి ఇంటికి వెళ్లాడు. అది అతనికి రెండు గంటల కంటే ఎక్కువ పట్టింది. కారు చుట్టూ ప్రజలు గుమిగూడడం వలన పిల్లడు భయాందోళన గురి అవ్వడం తెలుస్తోంది.

Most Read: సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

కారులో చిక్కుకుపోయిన చిన్నారి....2 గంటల తరువాత ఏంజరిగిందంటే?

చైనాలో జరిగిన ఇలాంటి సంఘటనే మరొకటి జరగడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ ఆడి సెడాన్ లోపల ఓ చిన్న పిల్లాడు ఇరుక్కుపోయాడు. ప్రజలు ఇలాంటి పరిస్థితిలోనే ఉండి, పిల్లర్ ను లోపలి నుంచి వాహనాన్ని అన్ లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Most Read: ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వారికీ కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.....!

కారులో చిక్కుకుపోయిన చిన్నారి....2 గంటల తరువాత ఏంజరిగిందంటే?

కొంత సమయం తర్వాత వారు అలా చేయడంలో సఫలీకృతులయ్యారు. చిన్న పిల్లాడు కారు లోపలి నుంచి అన్ లాక్ చేసి విజయవంతంగా బయటకు వచ్చాడు. కారు లోపల పిల్లలు మరియు పెంపుడు జంతువులను విడిచిపెట్టడం వల్ల ప్రమాదకరంగా మారుతుంది. చాలా విదేశాల్లోనే పిల్లలు, పెంపుడు జంతువులను వాహనం లోపలికి వెళ్లకుండా నిబంధనలు పెడుతున్నారు.

Most Read: పెట్రోల్ కు బదులుగా కోకాకోలా నింపేసాడు...తరువాత ఏమి జరిగింది?

కారులో చిక్కుకుపోయిన చిన్నారి....2 గంటల తరువాత ఏంజరిగిందంటే?

కారు ఏసీ పనిచేయకపోతే వేడి కారణంగా పిల్లలు ఊపిరాడకుండా చేయొచ్చు. అలాగే, పార్క్ చేసిన వాహనాల లోపల ఉష్ణోగ్రత, గ్రీన్ హౌస్ ప్రభావం వల్ల పరిసరాల కంటే చాలా ఎక్కువగా పెరగవచ్చు. గతంలో చాలా పెంపుడు జంతువులు, చివరకు పిల్లలు కూడా వాహనం లోపల విపరీతమైన వేడి కారణంగా మరణించాయి.

Source: Hulchul TV/YouTube

Most Read Articles

English summary
Leaving children inside the car is becoming a common practice. Read in Telugu...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X