Just In
- 53 min ago
కొత్త హోండా వెజెల్ ఎస్యూవీ టీజర్ విడుదల
- 1 hr ago
సైనికుల కోసం బుల్లెట్ బైక్‌లనే మొబైల్ అంబులెన్స్‌లుగా మార్చేశారు..
- 2 hrs ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 3 hrs ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
Don't Miss
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్‌కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- News
అమరావతిపై జగన్ సర్కారుకు భారీ షాక్- ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులన్నీ కొట్టేసిన హైకోర్టు
- Movies
‘ఢీ’లో అలాంటి వ్యవహారాలా?.. కంటెస్టెంట్లతో మాస్టర్ల అఫైర్స్.. బయటపెట్టేసిన సుమ
- Sports
Brisbane Test: పంత్ హాఫ్ సెంచరీ.. విజయం దిశగా భారత్!! కొట్టాల్సింది 59 పరుగులే!
- Lifestyle
మీరు వాడే షాంపూ మంచిది కాకపోతే మీ జుట్టు ఏమి సూచిస్తుంది, తప్పకుండా తెలుసుకోండి..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లాక్‌డౌన్ లో బయటికి వచ్చిన పిల్లలను పోలీసులు పట్టుకోగానే ఏం చేసారో తెలుసా.. ?
చైనాలో పుట్టిన కరోనా నేడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ కారణంగా ప్రపంచంలో చాల దేశాలు లాక్ డౌన్ లో ఉన్నాయి. భారతదేశం కూడా ఈ కరోనా వైరస్ అధికంగా వ్యాప్తి చెందుతుండటం వల్ల 21 రోజుల లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ లో ప్రజలు బయటకి రాకూడదని అధికారులు ఆంక్షలు విధించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటికి రాకూడదు. కాని కొంతమంది లాక్ డౌన్ ఉన్నప్పటికీ బయట తిరుగుతున్నారు.

భారత్ లాక్ డౌన్ కారణంగా ప్రజలెవరూ బయటికి రాకూడదు అని అధికారులు ప్రకటించారు. కానీ కొంత మంది నిబంధనలకు వ్యతిరేఖంగా బయట విచ్చల విడిగా తిరుగుతున్నారు. ఈ విధంగా నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులు కఠినంగా శిక్షిస్తున్నారు. అంతే కాకుండా వాహనాలను స్వాధీనం చేసుకోవడం మరియు వాహనదారులపై కేసులు కూడా బుక్ చేయడం కూడా జరిగింది.

లాక్ డౌన్ సమయంలో ఇద్దరు పిల్లలు చిన్న బైకులపై బయటికి రావడం మనం ఇక్కడ వీడియోలో చూడవచ్చు. కానీ పోలీసులు ఇంటి నుంచి వెళ్లిన వెంటనే ఇద్దరినీ పట్టుకున్నారు. పోలీసులు పిల్లలను ఇద్దరినీ ఆపి ఇంటి నుండి బయటకు రావడానికి కారణాలు అడిగారు. వారిని పోలీసులు తిరిగి ఇంటికి వెళ్లాలని, ఇలా బయటకు రాకూడదని సలహా ఇచ్చారు.

ఆ పిల్లలు ఆకలితో ఉన్న ప్రజలకు ఆహారం ఇవ్వడానికి డబ్బును ఉపయోగించుకునేలా పోలీసులకు రూ. 5 వేలు విరాళంగా ఇచ్చారు. ఆ విరాళాలు ఇచ్చిన వీడియో కూడా యూట్యూబ్‌లో ఉంచాలని కోరుకున్నారు. అందుకే వారు తమ బైక్‌లపై బయటకు వచ్చారని తెలిపారు.
వీడియోలో కనిపించే పిల్లలు వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లో బాగా ప్రాచుర్యం పొందారు మరియు భారీ ఫాలోయింగ్ కూడా కలిగి ఉన్నారు. ఆన్‌లైన్‌లో వైరల్ వీడియోలను రూపొందించడానికి వారు బైక్‌లను వివిధ ప్రదేశాలకు మరియు ఆఫ్-రోడింగ్‌కు తీసుకువెళతారు.

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా, దేశం మొత్తం లాక్డౌన్లో ఉంది. కరోనా వైరస్ ఆరోగ్యకరమైన ప్రజలను ప్రభావితం చేయకుండా ఉండటానికి తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతోంది. దీనికి మద్దతుగా ప్రజలు ఇంటివద్దనే ఉండాలని కూడా వారు సూచించారు.

పిల్లడు తమ వాహనాలపై బయటికి వచ్చి విరాళం ఇచ్చే వీడియోలు వైరల్‌గా మారితే, ఎక్కువ మంది ఇలాంటి పనులు చేసి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఇది లాక్‌డౌన్ ప్రయోజనాన్ని మొత్తం దెబ్బతీస్తుంది. ఏది ఏమైనా ఇలాంటి చర్యలను కూడా పూర్తిగా నివారించడానికి పోలీసులు ఇంకా తగిన్ని చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండటమే కొంత వరకు ఇప్పటి పరిస్థితులకు మంచిది.