ఉత్తర కొరియాలో ఉన్న భయంకరమైన డ్రైవింగ్ రూల్స్

నార్త్ కొరియా రాజధాని అయిన ప్యోంగ్యాంగ్ నగరంలో, తమ తండ్రి కిమ్ ఇల్ సంగ్ మరియు తాత కిమ్ జాంగ్ ఇల్ విగ్రహాల ముందు తక్కువ వేగంలో వాహనాలు వెళ్లేలా చూసే భాద్యతను అక్కడి పోలీసులకు అప్పగించాడు ఆ దేశ నాయకుడు.

By N Kumar

తమకు నచ్చని నిర్ణయాలు తీసుకుంటే ఆ దేశ నాయకుడిపై తిరుగుబాటు చేసే దేశాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. కానీ ఆ దేశ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం ఏదైనా తూచా తప్పకుండా పాటించాల్సిందే. అది ప్రజల శ్రేయస్సు కోసం కావచ్చు.... వ్యక్తిగత శ్రేయస్సుకోసమయినా కావచ్చు. మేము ఏ దేశం గురించి చెబుతున్నామనేది మీకు ఇప్పటికే మదిలో మెదిలి ఉంటుంది... అదేనండి ఎప్పుడు క్షిపణి ప్రయోగాలు చేసే ఉత్తర కొరియా....

ఉత్తర కొరియాలో భయంకరమైన డ్రైవింగ్ రూల్స్

నార్త్ కొరియా రాజధాని నగరంలోని తమ తండ్రి మరియు తాతల విగ్రహాల ముందు తక్కువ వేగంతో వాహనాలను నడపాలని ఆజ్ఞాపించాడు ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.

ఉత్తర కొరియాలో భయంకరమైన డ్రైవింగ్ రూల్స్

నార్త్ కొరియా రాజధాని అయిన ప్యోంగ్యాంగ్ నగరంలో, తమ తండ్రి కిమ్ ఇల్ సంగ్ మరియు తాత కిమ్ జాంగ్ ఇల్ విగ్రహాల ముందు తక్కువ వేగంలో వాహనాలు వెళ్లేలా చూసే భాద్యతను అక్కడి పోలీసులకు అప్పగించాడు.

ఉత్తర కొరియాలో భయంకరమైన డ్రైవింగ్ రూల్స్

భారీ ట్రాఫిక్ ఉండే ప్రదేశాల్లో ఇలాంటి నియమాలేంటబ్బా అని ప్రజల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ అక్కడ ఎవ్వరూ నోరు మెదపరు కిమ్ జాంగ్ ఉన్ గారు ఏది చెబితే అది జరగాల్సిందే.

ఉత్తర కొరియాలో భయంకరమైన డ్రైవింగ్ రూల్స్

స్లోగా వెళ్లమన్నాడు సరే... మరి ఖచ్చితంగా ఎంత వేగంతో వెళ్లాలి అనే సందేహం కలుగుతోందా...? దానికి ఓ లెక్క చెప్పారాయన, మా కుటుంబీకుల విగ్రహాల ముందు వెళ్లే వాహనాల వేగం గరిష్టంగా గంటకు 5 కిలోమీటర్లుగా ఉండాలన్నాడు.

ఉత్తర కొరియాలో భయంకరమైన డ్రైవింగ్ రూల్స్

ఈ రూల్ సాధారణ ప్రజలకు మాత్రమే కాదండోయ్... ఈ పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే పోలీసులందరికీ వర్తిస్తుందని కిమ్ ఆజ్ఞాపించాడు.

ఉత్తర కొరియాలో భయంకరమైన డ్రైవింగ్ రూల్స్

ప్రపంచంలో తక్కువ కార్లు ఉన్న దేశాల్లో నార్త్ కొరియా ఒక దేశం. అక్కడి రహదారుల మీద వాహన రద్దీ మితంగానే ఉంటుంది, కాబట్టి ఈ నియమాన్ని అమలుపరచడం మరియు పాటించడం పెద్ద ఇబ్బందేమీ కాదు.

ఉత్తర కొరియాలో భయంకరమైన డ్రైవింగ్ రూల్స్

అంతే కాకుండా ప్యోంగ్యాంగ్ నగరంలోని మరో మూడు ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలు గంటకు 30కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లాలని సూచించాడు.

ఉత్తర కొరియాలో భయంకరమైన డ్రైవింగ్ రూల్స్

నార్త్ కొరియా రాజధానికి ప్యోంగ్యాంగ్ నగరంలోని డౌన్‌టౌన్‌లో ఉన్న కిమ్ ఇల్ సంగ్ స్క్వయర్, మన్సు హిల్ గ్రాండ్ మోనుమెంట్ మరియు కిమ్ జాంగ్ సక్ మెమోరియల్ మొజాయిక్ ప్రాంతాల్లో ఈ 30కిమీల వేగం పరిమితి నియమం అమల్లో ఉంది.

ఉత్తర కొరియాలో భయంకరమైన డ్రైవింగ్ రూల్స్

నార్త్ కొరియాను సందర్శించే వారికి కూడా ఈ నియమం వర్తిస్తుంది. గతంలో ఇదే విగ్రహాల వద్ద కార్లు మెరుపు వేగంతో వెళ్లేవి, ఇక మీదట విదేశీయులైనా... నార్త్ కొరియన్లయినా గంటకు 5 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలి.

ఉత్తర కొరియాలో భయంకరమైన డ్రైవింగ్ రూల్స్

ఇప్పుడు వేగ పరిమితి ఉన్న కూడళ్ల వద్ద స్పీడ్ లిమిట్ సూచించే నోటీస్ బోర్డులను ఏర్పాటు చేశారు. మరియు పోలీసులు కూడా స్పీడ్ లిమిట్స్‌ను డ్రైవర్లకు తెలియజేస్తుంటారు.

ఉత్తర కొరియాలో భయంకరమైన డ్రైవింగ్ రూల్స్

కాబట్టి మీ సన్నిహితులు ఎవరైనా నార్త్ కొరియా పర్యటనలో ఉంటే ఈ విషయాన్ని తెలియజేయండి...

Most Read Articles

English summary
Read In Telugu Despot Kim Jong-un Orders Drivers To Slow Down While Passing Statues Of His Forebears
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X