లాన్‌మూవర్ రేసింగ్‌లో కిమి రైక్కోనెన్
ఫార్ములా వన్ రేసింగ్ మాదిరిగానే లాన్‌మూవర్ (లాన్లలో ఉపయోగించి చిన్నపాటి ట్రాక్టర్ల లాంటివి) రేసింగ్ కూడా పాపులర్ మోటార్‌స్పోర్ట్. మాజీ ఫార్ములా వన్ ఛాంపియన్ మరియు స్కుడెరియా ఫెరారీ జట్టు ప్రస్తుత డ్రైవర్ కిమి రైక్కోనెన్‌కు ఓ సరదా ఆలోచన వచ్చింది. ఫార్ములా వన్ రేస్‌కు మరియు లాన్‌మూవర్ రేస్‌కు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని అతను అనుకున్నాడు.
అంతే, వెంటనే లాన్‌మూవర్ రేసులో పాల్గొని ఆ అనుభూతిని పొందేశాడు. ఫిన్‌లాండ్‌కు చెందిన ఈ ఐస్‌మ్యాన్ వరల్డ్ ర్యాలీ ఛాంపియన్‌షిప్, నాస్కార్ అండ్ ఫార్ములా వన్‍లో పాల్గొన్నాడు. ఇటీవల జరిగిన సిల్వర్‌స్టోన్ గ్రాండ్ ప్రిలో జరిగిన యాక్సిడెంట్లో కిమి రైక్కోనెన్ కాలి మడిమమ వద్ద గాయమయ్యింది. అయినప్పటికీ అతను దానిని లెక్క చేయకుండా లాన్‌మూవర్ రేసులో పాల్గొన్నాడు.
లాన్‌మూవర్ రేసింగ్‌లో అతను ఆంటోనీ డేవిడ్సన్, జానీ హెర్బెర్ట్, మార్టిన్ బ్రండల్‌తో పోటీ పడ్డాడు. మరి ఆ అద్భుతమైన లాన్‌మూవర్ రేసింగ్ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/RJRomcjprwY?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








