నువ్వు దేవుడు సామీ!.. వీడియో చూస్తే మీరు ఇదే అంటారు

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మార్కెట్లో అన్యదేశ్య కార్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే సెలబ్రిటీలు, ఇతర ప్రముఖుల వంటి డబ్బున్నవారు మాత్రమే ఈ కార్లను కొనుగోలు చేస్తుంటారు. దీనికి కారణం వీటి ధర కోట్ల రూపాయల్లో ఉండటమే అని తెలుస్తోంది. అయిత్ కొంతమంది సామాన్య ప్రజలకు కూడా ఇలాంటి ఖరీదైన కార్లలో తిరగాలని ఉంటుందని కానీ.. అది అందరికి సాధ్యం కాదు. అయితే కొంతమంది ఖరీదైన కార్లను కలిగిన ఓనర్లు మంచి మనసుతో వారిని కార్లతో ఫోటోలు దింపుతారు. ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి బ్లాక్ కలర్ 'మెక్‌లారెన్ 720ఎస్' కారును రోడ్డుపై నిలిపి ఉంచారు. ఆ సమయంలోనే ఒక ఆటోలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒక పిల్లవాడికి బహుశా ఆ కారుతో ఓ ఫోటో దిగాలని.. తన స్నేహితులకు చూపించాలని ఉందేమో అనిపించింది. దీంతో ఆ కారు ఓనర్ ఆ పిల్లవాని దగ్గరకు వెళ్లారు. పిల్లవాన్ని కారు దగ్గరకు తీసుకెళ్లాడు.

McLaren Owner Lets Auto Driver Son Pose With Car

పిల్లవాడిని కారు దగ్గరకు తీసుకెళ్లి ఫోటోలకు ఫోజులివ్వమని చెప్పాడు. అంతే కాకుండా తాను ఉపయీగిస్తున్న కళ్లజోడును కూడా ఆ పిల్లాడికి ఇచ్చాడు, కానీ దాన్ని ఆ పిల్లవాడు సున్నితంగా తిరస్కరించారు. ఇదంగా కూడా వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను అమీర్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో చెక్కారు కొడుతున్న ఈ వీడియో ఎంతమంది నెటిజన్లను ఆకర్షించింది. ఇప్పటికే వేల లైక్స్ పొందిన ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అయితే అమీర్ శర్మ హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్ మరియు డిజైనర్ అని తెలుస్తోంది. ఈయన గ్యారేజీలో అనేక ఖరీదైన మరియు అన్యదేశ కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. వాటిల్లో ఒకటే ఈ మెక్‌లారెన్ 720ఎస్.

McLaren Owner Lets Auto Driver Son Pose With Car

నిజానికి ఖరీదైన కార్లకు కలిగి ఉన్న చాలామంది వారి కార్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వారు పిల్లలను కారు దగ్గరకు కూడా చేరనివ్వరు. ఎందుకంటే వారు కార్లపై గీతలు పెడితే దాన్ని సరిచేసుకోవడానికి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే అమీర్ శర్మ మాత్రం ఇందుకు భిన్నమనే చెప్పాలి. ఇలాంటి విశాల హృదయం చాలా తక్కువమందికి మాత్రమే ఉంటుంది. అయితే గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి.

ఇక మెక్‌లారెన్ కారు విషయానికి వస్తే.. ఇది బ్రాండ్ యొక్క 720ఎస్ అని తెలుస్తోంది. ఈ కారు ధర సుమారు రూ. 4.65 కోట్లుగా ఉంది. ఈ కారు అత్యాధునిక డిజైన్ కలిగి, అంతకు మించిన ఫీచర్స్ కలిగి ఉంటుంది. తద్వారా వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది 4.0-లీటర్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 720 పీఎస్ పవర్, 770 Nm టార్క్ అందిస్తుంది.

అమీర్ శర్మ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం తన కారును ఫోటోలు తీస్తున్న వ్యక్తిని గుర్తించి.. ఆ వ్యక్తి వద్దకు వెళ్లి కారు దగ్గరకు తీసుకెళ్లి ఫోటో తీశారు. అప్పుడు కూడా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఖరీదైన కార్లను కలిగి ఉన్న వ్యక్తులు ఇలా చేయడం చాలా అరుదు. కానీ అమీర్ శర్మ మాత్రం దీనికి భిన్నం.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, July 2, 2024, 9:00 [IST]
English summary
Kind heart mclaren owner lets auto driver son pose with car
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+