మళ్లీ వచ్చేస్తున్న కైనెటిక్‌ లూనా.. రూ.50 వేలకే 'e-Luna'..?

కైనెటిక్‌ లూనా గుర్తుందా.. భారత్‌లో మొబిలిటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వాహనం. ప్రస్తుతం కనుమరుగైన లూనా మరోసారి రోడ్లపై చక్కర్లు కొట్టనుంది. ఇప్పటి తరం వారికి లూనా గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు.. 19వ శతాబ్దంలో లూనాలకు విపరీతమైన డిమాండ్‌ ఉండేది. గ్రామాల్లో అధిక శాతం ప్రజలు వీటిని వినియోగించేవారు. రోజుకు 2 వేల యూనిట్ల విక్రయాలు జరిగిన రోజులు కూడా ఉన్నాయని గతంలో కైనెటిక్‌ ఎనర్జీ సంస్థ వెల్లడించింది.

విశేష ఆదరణ పొందిన లూనాను త్వరలో ఎలక్ట్రిక్‌ వాహనంగా లాంచ్‌ చేస్తున్నట్లు కైనెటిక్‌ గ్రీన్‌ సంస్థ ఫౌండర్‌, సీఈవో సులజ్జ ఫిరోడియా మత్వాని వెల్లడించారు. గతంలో 50CC ఇంజిన్‌తో లూనా వచ్చింది. కొత్తగా విడుదల చేయనున్న వాహనానికి 'e Luna'గా పేరు పెట్టినట్లు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా సులజ్జ ఫిరోడియా మత్వాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ లూనా గతంలో మాదిరిగా ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Kinetic e-Luna

కైనెటిక్‌ గ్రీన్‌ సీఈవో సులజ్జ ఫిరోడియా మత్వాని.. ట్వీట్‌లో తన తండ్రి కైనెటిక్ సంస్థ ఛైర్మన్‌ పద్మశ్రీ అరుణ్‌ ఫిరోడియా ఫోటోను షేర్‌ చేశారు. అందులో అరుణ్‌ ఫిరోడియా లూనాపై కూర్చున్న ఫోటోను చూడవచ్చు మరియు అప్పటి లూనా యాడ్‌ను కూడా సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

కైనెటిక్‌ సంస్థ అనుబంధ సంస్థ అయిన కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ మరియు పవన్‌ సొల్యూషన్‌.. ఉత్పత్తిగా ఎలక్ట్రిక్‌ లూనా విడుదల కానుంది. తొలి విడత ఉత్పత్తిలో భాగంగా నెలకు 5000 యూనిట్లను తయారుచేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఛాసిస్‌ మరియు ఇతర విభాగాలను అసెంబ్లీని ప్రారంభించింది. భవిష్యత్‌లో ఈ లూనా ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉంది.

Kinetic e-Luna

ఎలక్ట్రిక్‌ లూనా తయారీ కోసం ప్రత్యేక అసెంబ్లీ లైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 30 వెల్డింగ్‌ మెషిన్‌లను అసెంబ్లీ లైన్‌లో ఏర్పాటు చేశారు. వీటిటోపాటు పెయింట్ బూత్‌ మరియు ఫ్యాబ్రికేషన్‌ షాపులను కూడా ఈ-లూనా కోసం ఏర్పాటు చేస్తున్నారు. కైనెటిక్ గ్రీన్‌ ఎనర్జీ మరియు పవర్‌ సొల్యూషన్‌ సంస్థ ఈ-లూనాలను మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లో తయారుచేయనుంది.

కైనెటిక్ బీ2బీ మరియు బీ2సీ మోడల్స్‌ రెండింటిలోనూ పనిచేసే లాస్ట్‌ మైల్‌ డెలివరీ సెక్టార్‌ను ఈ-లూనా లక్ష్యంగా చేసుకుంటుందని పలు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ-లూనా 2024లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు ధర సుమారుగా రూ.50 వేల ఉండే అవకాశం ఉంది. మరియు 50 కి.మీ నుంచి 100 కి.మీ రేంజ్ ఇచ్చేలా ఈ-లూనా డిజైన్ చేయవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 30, 2023, 19:18 [IST]
English summary
Kinetic luna electric version e luna will be launched in 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+