కైనటిక్ నుండి మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనం ధర రూ. 1.28 లక్షలు
కైనటికి గ్రీన్ ఎనర్జీ మరియు పవర్ సొల్యూషన్స్ వారు దేశీయ మార్కెట్లోకి సరికొత్త మూడు చక్రాల ఎలక్ట్రిక్ సఫార్ అటో ను విడుదల చేశారు. దీని ధర 1.28 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా విడుదల చేశారు.

కైనటిక్ సఫార్ ఆటో స్టీల్ బాడీ, హెడ్ ల్యాంప్స్, కన్సోల్ ఇండికేటర్, స్పీడో మీటర్‌లను కలిగి ఉంది, మరియు ఇది గరిష్టంగా గంటకు 25 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నగరాలలో గల ఎత్తైన ఫ్లైఓర్లను ఎక్కడానికి ఇందులో అత్యంత శక్తివంతమైన ఎక్సైడ్ బ్యాటరీస్ వారి లెడ్ యాసిడ్ బ్యాటరీలను ఉపయోగిస్తోంది.
Also Read: ఇ-రాజా.. ఇ-రిక్షాలను విడుదల చేసిన ఓకే ప్లే సంస్థ
కాలుష్య రహిత వాహనాలను వినియోగించాలని ఉద్దేశ్యంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 27,000 కైనటిక్ సఫార్ ఆటోలకు ఆర్డర్ ఇచ్చినట్లు కైనటిక్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం కైనటిక్ సంస్థకు మహారాష్ట్రలో గల అహ్మద్‌నగర్ ప్లాంటు నుండి నెలకు 4,000 వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలదు.


Click it and Unblock the Notifications








