స్కూటర్‌లో దూరిన నాగుపాము.. అంత పెద్ద పాము అందులోకి ఎలా వెళ్లి ఉంటుంది?
చాలా సందర్భాల్లో మనకు వాహనాల్లో పాములు చేరిన వార్తలు చూసే ఉంటాము. ముఖ్యంగా నెలల తరబడి ఒకేచోట వాహనాలను నిలపడం వల్ల వాటిలో ఈ విష సర్పాలు వచ్చి చేరతాయి. ఇలాంటి వీడియోలు ఇప్పటి వరకు చాలానే దర్శనమిచ్చాయి. తాజాగా ఓ వ్యక్తి స్కూటర్‌లో పాము దూరింది. సాధారణంగా చిన్న సైజులో ఉండే పాములు స్కూటర్లలో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. దీనికి భిన్నంగా దాదాపు 5 అడుగులు పొడవున్న కోబ్రా (నాగుపాము) వచ్చి చేరింది. దీంతో ఆ బండి ఓనర్ భయాందోళను గురయ్యాడు. అసలేం జరిగిందంటే..
భారతదేశమంతటా తీవ్రమైన వడగాలుల వీస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఎండ వేడిమి ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ఢిల్లీలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. దీంతో ఇంట్లోంచి బయటకు రావాలంటే జనాలు భయపడుతున్నారు. అయితే దక్షిణ భారతదేశంలో రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాములు ఇతర జీవులు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం బయటకు వస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ పాము స్కూటర్‌లో చేరింది.

అయితే ఎండ వేడిమిని తట్టుకోలేక ఓ పాము హీరో ప్లెజర్ స్కూటర్ హెడ్‌ల్యాంప్ వెనక ఉండే ప్యానెల్ స్థలంలో వచ్చి చేరింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌ని షేక్ చేస్తుంది. స్కూటర్ హెడ్ ల్యాంప్ లోపల హాయిగా అది పడుకుని ఉండటాన్ని ఓనర్ గమనించి స్నేక్ సొసైటీ వారికి సమాచారం అందించారు. ఆ లోపు పాముని వారు కదిలించకుండా ఉన్నారు.
స్నేక్ క్యాచర్స్ అక్కడకు చేరుకుని పాముని బయటకు తీసేందుకు నానా తంటాలు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో భయాందోళనకు గురిచేస్తుంది. ఆ నాగుపాముని బయటకు తీసే క్రమంలో అది కరిచేందుకు ప్రయత్నించింది. దీంతో అతడు నెమ్మదిగా పాముని బంధించాడు. ఈ కోబ్రా అనుభవజ్ఞుడైన పట్టే వ్యక్తి పట్టుకున్నాడు. అతడికే ఈ పాము చూక్కలు చూపెట్టింది. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పడు పాములను సొంతంగా పట్టుకునే ప్రయత్నం చేయవద్దని ఈ సంఘటన హెచ్చరిస్తుంది.

మొదట్లో కోబ్రా పాము స్కూటర్ ముందు ప్యానెల్ ఉంది. ఆ తర్వాత స్నేక్ క్యాచర్ రాజేష్ దానిని పట్టుకోవడానికి ప్రయత్నించగా అది స్కూటర్ హెడ్ ల్యాంప్ ప్రాంతానికి వెళ్లింది. దీనిని అక్కడి నుంచి బయటకు తీసేందుకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. పాము సైజ్ పెద్దగా ఉండటంతో చాలా సమయం పట్టింది. మొదటగా దానిని చిన్న పాముగా భావించిన నారంతా బయటకు తీశాక అక్కడి వారు ఆశ్యర్య పోయారు.
వేసవిలో లేదా బయట చల్లదనానికి ఎక్కువ సేపు పార్క్ చేసిన వాహనాల్లో పాములు, కీటకాలు ఆశ్రయం పొందుతాయి. వాహనాల్లో ఉండే వెచ్చదనం కోసం వర్షాకాలంలో ఎక్కువగా పాములు చేరతాయి. అందువల్ల వాహనాన్ని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి. లేదంటే ఇలా పాములు చేరే అవకాశం ఉంటుంది. వాహనాల్లోకి పాములు రావడం కొత్తేమీ కాదు. కానీ కొండలు, అటవీ ప్రాంతాల సమీపంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండట ఉత్తమం.
గతంలో హెల్మెట్‌లో సైతం పాము దూరిన వార్త వార్త వైరల్ అయ్యింది. బహిరంగ ప్రదేశాల్లో లేదా బైక్‌లకు హెల్మెట్ పెట్టిన తర్వాత మరలా దానిని ధరించే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. బైక్ కవర్లలోనూ పాములు దూరే అవకాశం ఉంటుంది. సిటీలో ఉన్నవారికి ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చు కానీ గ్రామాల్లో నివసించే వారు బయట పార్కింగ్ చేయడం వల్ల పాములు చేరే అవకాశం ఎక్కువ.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








