నేటి వీడియో: కింగ్ ఆఫ్ యూరప్ డ్రిఫ్ట్ సిరీస్ యాక్షన్

By Ravi

కార్ డ్రిఫ్టింగ్ చేయటానికి ఖలేజా కావాలి. ఎంతో నైపుణ్యం, శిక్షణ, ఏకాగ్రత ఉంటే కార్ డ్రిఫ్టింగ్ సాధ్యం కాదు. కారును డ్రిఫ్ట్ చేసేందుకు మంచి బ్రేకులు కలిగిన కారుతో పాటు, కాస్తంత గుండె ధైర్యం కూడా కావాలి. ప్రొఫెషనల్ డ్రిఫ్టర్లు కార్లను అటూ ఇటూ పాములా మెలికలు తిరిగిస్తూ డ్రైవ్ చేస్తుంటారు. డ్రిఫ్టింగ్ చేసే వారికి ఎలా ఉంటుందో ఏమో కానీ ఇదంతా చూసే వారికి మాత్రం గుండె జారి చేతిలోకి వస్తుంది.

కార్ డ్రిఫ్టింగ్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, రోడ్లపై టైర్లు అరిగేలా కారును గిరికీలు కొట్టించడమే. ఒకప్పుడు టైమ్‌పాస్‌గా ఉన్న ఈ కళ, ఇప్పుడు అనేక దేశాల్లో ఓ స్పోర్టింగ్ ఈవెంట్‌గా మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా డ్రిఫ్టింగ్ కాన్సెప్ట్ మీద అనేక మోటార్‌స్పోర్ట్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అనేక హాలీవుడ్ సినిమాల్లో కూడా కార్లతో డ్రిఫ్టింగ్ చేసే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి.

ఈనాటి మన వీడియోలో 'కింగ్ ఆఫ్ యూరప్ డ్రిఫ్ట్' సిరీస్‌లో భాగంగా నిర్వహించిన మొదటి రౌండ్‌ను చూద్దాం రండి. బల్గేరియాకు చెందిన అలెగ్జాండర్ యజోవ్, ఐర్లాండ్‌కు చెందిన డానియేల్ మర్ఫీ చేసిన డ్రిఫ్టింగ్ విన్యాసాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా మనం కూడా ఆ వీడియోని చూసేద్దాం రండి..!

More from DriveSpark

Article Published On: Tuesday, April 22, 2014, 19:09 [IST]
English summary
Round One of the The King of Europe drift series kicked off in Hungary last weekend to a packed audience and revealed two winners that were 2013 defending champions - Alexander Yazov from Bulgaria and Danielle Murphy from Ireland.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+