Land Rover Defender SUV మరో లగ్జరీ కారును కొనుగోలు చేసిన కేఎల్ రాహుల్.. ప్రీమియం ఫీచర్లతో బ్యూటిఫుల్ లుక్.
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul) మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. రూ. 1.5 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్(Land Rover Defender) ఎస్‌యూవీలో కేఎల్ రాహుల్ చక్కర్లు కొడుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
గత నెలలో జరిగిన వరల్డ్ కప్ క్రికెట్‌లో టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్రదర్శనతో ఫ్యాన్స్‌ను అలరించాడు. కాగా రాహుల్‌కు కార్లు, బైక్‌లంటే చాలా ఇష్టం. అందుకే అంతర్జాతీయ మార్కెట్‌లో ఖరీదైన లగ్జరీ కార్లను సొంతం చేసుకున్నాడు. తాజాగా మరో లగ్జరీ కారుకు ఓనర్ అయ్యాడు ఈ యంగ్ క్రికెటర్..

ఇటీవల కేఎల్ రాహుల్ సరికొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ SUVలో కనిపించాడు. ఈ కారు బ్లాక్ కలర్ ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోను కార్స్ ఫర్ యు అనే యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేశారు. కాగా ఈ కారు ఇప్పటికే ప్రముఖ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల వద్ద చూడవచ్చు.
భారత మార్కెట్లో కొన్నేళ్ల క్రితం ల్యాండ్ రోవర్ కంపెనీ ప్రస్తుత తరం 'డిఫెండర్' SUVని లాంచ్ చేసింది. కాగా ఈ లగ్జరీ డిఫెండర్ విభిన్న వేరియంట్‌ల ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉండగా.. దాని లాంగ్ వీల్ బేస్ ఫీచర్‌తో ప్రముఖులకు ఫేవరెట్ కారుగా మారింది. 3-డోర్ షార్ట్ వీల్ బేస్ (SWB), 5-డోర్ లాంగ్ వీల్ బేస్ (LWB)తో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు.

కాగా SWB వెర్షన్‌ను డిఫెండర్ 90 అని, LW వెర్షన్‌ను డిఫెండర్ 110 గా పిలుస్తారు. 3-వరుస సీటింగ్ ఆప్షన్‌లో అందుబాటులో ఉన్న ఈ SUVకి డిఫెండర్ 130 అని అంటున్నారు. అయితే కేఎల్ రాహుల్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 (LWB) మోడల్‌ను కొనుగోలు చేసినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ డిజైన్, మరింత ప్రీమియం లుక్‌తో కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇంకా ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ ఆఫ్ రోడింగ్‌కు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఇక పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే సరికొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో సంస్థ ప్రవేశపెట్టింది. రెండు 2.0-లీటర్, 3.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్లు కాగా మూడవది 3.0 లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్.

కేఎల్ రాహుల్ కొనుగోలు చేసినట్లుగా చెప్పబడుతున్న ఈ కారులో 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉంది. ఈ కారు గరిష్ఠంగా 296 bhp శక్తిని, 650 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 4×4 (Four Wheel Drive) టెక్నాలజీతో అమర్చబడి ఉంటుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంది. ఇంకా 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, ప్రీమియం స్పీకర్ సిస్టమ్ వంటి డజన్ల కొద్దీ అధునాతన ఫీచర్లను ఇందులో అమర్చారు.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ట్రాక్షన్ కంట్రోల్, బ్లైండ్-స్పాట్ అసిస్ట్, ఫ్రంట్ & రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, రబ్బర్ ఫ్లోరింగ్‌తో సహా వివిధ భద్రతా ఫీచర్లతో భద్రత పరంగా కూడా అద్భుతమైనది. ఈ కారుకు బలమైన పోటీదారు జీప్ రాంగ్లర్.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీతో పాటు కేఎల్ రాహుల్ వద్ద BMW X7 మరియు Mercedes-AMG C43 కార్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ.. సినీ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, కరీనా కపూర్, మమ్ముట్టి, ఆసిఫ్ అలీ, ఫహద్ ఫాసిల్, రామ్ చరణ్, సోనమ్ కపూర్, సన్నీ డియోల్, సంజయ్ దత్, అర్జున్ కపూర్ కూడా కొనుగోలు చేశారు.


Click it and Unblock the Notifications








