ఇది రోడ్డు మీద కదిలే ప్యాలెస్.. చూస్తేనే దిష్టి తగులుతుందేమో అనిపిస్తుంది.. కొత్త కారు కొన్న కేఎల్ రాహుల్
టీమిండియా క్రికెట్‌లో ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉండే సమర్థవంతమైన ఆటగాడు కేఎల్ రాహుల్. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా, ఓపెనర్‌గా, వన్‌డౌన్‌గా తన టాలెంట్‌ను చాటుకున్న రాహుల్.. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. రెండు టెస్టుల్లోనూ సులువుగా విజయం సాధించిన ఈ తరుణంలో, క్రికెటర్ తన జీవితంలో కొత్త సంతోషాన్ని పంచుకున్నాడు.
క్రికెట్ తర్వాత రాహుల్‌కు కార్లంటే చాలా ఇష్టం. ఈసారి ఆయన కొనుగోలు చేసిన కారు ఒక కదిలే రాజభవనం లాంటిది. అదే ఎంజీ M9 ఎలక్ట్రిక్ లిమోసిన్ (MG M9 Electric Limousine). ఈ కారు రోడ్డు మీద వెళ్తుంటే ప్యాలెస్ కదిలినట్లు ఉంటుంది.

ఎంజీ కంపెనీకి చెందిన అత్యంత కొత్త ఎలక్ట్రిక్ లిమోసిన్ ఎంజీ M9 ఎమ్‌పివి కేఎల్ రాహుల్ గ్యారేజీలోకి చేరింది. రాహుల్ ఈ వాహనాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని ఎంజీ మోటార్స్ ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. ఇప్పటికే రాహుల్ గ్యారేజీలో బీఎమ్‌డబ్ల్యూ X7, లంబోర్ఘిని హురాకాన్ స్పైడర్, మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జీ C43 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
అయితే, ఎంజీ M9 రాహుల్ సొంతం చేసుకున్న మొదటి ఎలక్ట్రిక్ కారు కావడం విశేషం. ఎంజీ సంస్థ భారత్‌లో విడుదల చేసిన మొదటి పీపుల్ క్యారియర్ కూడా ఇదే. ఇది విదేశాల్లో పూర్తిగా తయారుచేసి (CBU) భారత్‌కు దిగుమతి చేసుకున్న మోడల్.

ఎంజీ M9 ఎలక్ట్రిక్ సెడాన్ ప్రెసిడెన్షియల్ లిమోసిన్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 69.90 లక్షలు కాగా, ఇన్సూరెన్స్, ట్యాక్స్‌లు అన్నీ కలిపి ఆన్-రోడ్‌పైకి రావడానికి దాదాపు రూ. 81.52 లక్షల వరకు ఖర్చవుతుందని సమాచారం. ఇది త్రి లేన్స్ కలిగిన 7-సీటర్ లగ్జరీ ఎమ్‌పివి. ఇందులో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే.. రెండో వరుసలో కూర్చునే వారికి పవర్డ్ కెప్టెన్ సీట్లు లభిస్తాయి.
ఎంజీ M9 లోపలి భాగం అద్భుతమైన ఫీచర్లతో నిండి ఉంది. ఇందులో 12.23 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 7 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల (హీటెడ్, వెంటిలేటెడ్, మసాజ్ ఫంక్షన్లతో కూడిన) డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు, సింగిల్-ప్యానెల్ సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి.

ఇంకా పీఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్, మసాజింగ్, వెంటిలేషన్ ఫీచర్లతో కూడిన రెండో వరుసలోని ప్రెసిడెన్షియల్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమన్ ఫీచర్‌తో సహా అదనపు సౌకర్యాలు ఉన్నాయి. ఈ అన్ని ఫీచర్లను ప్రతి సీటు హెడ్‌రెస్ట్‌లో ఉన్న టచ్‌స్క్రీన్‌ల ద్వారా సులభంగా నియంత్రించవచ్చు.
ఎంజీ M9 ఎమ్‌పివిలో 90 kWh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 548 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఫ్రంట్-వీల్-డ్రైవ్ లేఅవుట్‌లో వచ్చే ఈ ఎలక్ట్రిక్ కారు 245 బీహెచ్‌పీ పవర్‌ను, గరిష్టంగా 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 11 kWh ఛార్జర్‌తో 8.5 గంటల్లో బ్యాటరీని పూర్తిగా (5% నుంచి 100%) ఛార్జ్ చేయవచ్చు.

డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 30 నిమిషాల్లో 30% నుంచి 80% వరకు ఛార్జింగ్ అవుతుంది. లెవల్ 2 ఏడీఏఎస్ సూట్, 360-డిగ్రీ కెమెరా, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, టీపీఎమ్ఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లతో ఇది సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ కారును కొనుగోలు చేసిన మొట్టమొదటి భారతీయ క్రికెటర్ కూడా కేఎల్ రాహులే కావడం విశేషం.


Click it and Unblock the Notifications








