మీరు ఎలాంటి వారో మీ కార్ కలరే చెబుతుంది!

రంగుల ఎంపిక విషయంలో ఒక్కొక్కరి ప్రాధాన్యత ఒక్కో విధంగా ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ రంగుల విషయంలో ఓ ప్రత్యేక అభిప్రాయాన్ని, ఇష్టాన్ని కలిగి ఉంటారు. మనం ప్రతి విషయంలో రంగులు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటుంటాం. ధరించే దుస్తుల నుంచి నడిపే వాహనం వరకు రంగుల విషయంలో ప్రాధాన్యతను ఇస్తుంటాం.

మనం ఎంచుకునే కార్ కలర్ మన వ్యక్తిత్వాన్ని ప్రతిభింభింజేసేదిగా ఉంటుంది. వాస్తవానికి, ఈ అంశంపై జరిపిన శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనాల కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. వాహనాల రంగులు మరియు వాటిని కొనుగోలు చేసే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలపై జరిపిన తాజా అధ్యయనాలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

మీరు ఎలాంటి వారో తెలిపే మీ కార్ కలర్

మరి ఇందులో మీ కార్ కలర్ మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం రండి..!

వైట్ కలర్

వైట్ కలర్

సాధారణంగా తెలుపు రంగు అంటేనే స్వచ్ఛతకు నిర్మలత్వానికి ప్రతీక అని మనందరికీ తెలుసు. అలాగే, తెలుపు రంగు వాహనాలకు మంచి రీసేల్ వ్యాల్యూ కలిగి ఉంటుంది. ఒకవేళ మీరు తెలుపు రంగు వాహనాన్ని కలిగి ఉన్నారంటే.. మీరు సహజ సిద్ధమైన వైఖరిని, విషయాల పట్ల స్పష్టమైన అవగాహనను కలిగి ఉంటారని అర్థం. మీరు సున్నితమైన మనస్కులు కూడా. అంతేకాదు.. తెలుపు రంగును ఇష్టపడేవారు దేన్నీ అంత సులభంగా మెచ్చుకోరు.

బ్లాక్ కలర్

బ్లాక్ కలర్

తెలుపు రంగు వాహనాల మాదిరిగానే నలుపు రంగు వాహనాలు కూడా ఎప్పటికీ రంగు వెలిసిపోకుండా ఉండి మంచి రీసేల్ వ్యాల్యూ పలుకుతాయి. ఒకవేళ మీరు నలుపు రంగు వాహనాన్ని కలిగి ఉంటే, మీరు బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు.. మీపై వేరొకరు అధిపత్యాన్ని చలాయించడం మీకు నచ్చదు. చరిత్రను ఇష్టపడే వారు కూడా నలుపు రంగు కార్లపై ఆసక్తి చూపుతారు.

సిల్వర్ కలర్

సిల్వర్ కలర్

తెలుపు, నలుపు రంగుల మిశ్రమంతో ఏర్పడే సిల్వర్ కలర్ వాహనాలను ఇష్టపడేవారు గంభీరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

గ్రే కలర్

గ్రే కలర్

గ్రే కార్పోరేట్ కలర్‌ను సూచిస్తుంది. ఈ కలర్ వాహనాలను ఇష్టపడే వారు, హుందాగా వ్యవహరిస్తారు. ప్రతి విషయంలోనూ క్రమశిక్షణతో ఆచరణాత్మకంగా ఉంటారు.

యల్లో కలర్

యల్లో కలర్

పసుపు రంగు శుభానికి ప్రతీక. పసుపు రంగు వాహనాలను ఇష్టపడేవారు చాలా హుషారుగా, ఉత్సాహంగా ఉంటారు.

రెడ్ కలర్

రెడ్ కలర్

సాధారణంగా ఎరుపు రంగు అంటే వేగం, శక్తి, ధైర్యం, సాహసాలకు ప్రతీక. ఒకవేళ మీ వాహనం రంగు ఎరుపు గనుక అయితే మీరు సాహసోపేతమైన వ్యక్తి అని అర్థం. మీరు ఎల్లప్పుడూ ఇతరులను అధిగమించాలని భావిస్తుంటారు.

బ్రౌన్ కలర్

బ్రౌన్ కలర్

బ్రౌన్ కలర్ నిస్తేజానికి ప్రతీక, మరి మీరు కూడా అలానే ఉంటారా? ఈ రంగు వాహనాలను ఇష్టపడే వారు నిరాడంబరంగా ఉంటారు. ఎలాంటి ఢాంబికాలకుపోరు. చాలా సాధారణమైన స్వభావాన్ని కలిగి ఉంటారు.

ఆరెంజ్ కలర్

ఆరెంజ్ కలర్

ఎరుపు పసుపు రంగుల కలయికతో ఏర్పడేదే నారింజ రంగు. మన రోడ్లపై ఈ కలర్ వాహనాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఒకవేళ మీ వాహనం రంగు నారింజ గనుక అయితే మీరు మాటకారులని అర్థం. మీరు ఎల్లప్పుడూ చురుకుగా, సంతోషంగా ఉంటూ చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు.

గ్రీన్ కలర్

గ్రీన్ కలర్

సాధారణంగా గ్రీన్ (ఆకుపచ్చ) రంగు కళ్లకు చాలా మంచిది. మీరు గమనించినట్లయితే.. ఆస్పత్రులలో ఎక్కువగా గ్రీన్ కలర్‌ను ఉపయోగిస్తారు. ఒకవేళ మీరు ఆకపచ్చ రంగు వాహనాలను ఇష్టపడే వారు అయితే.. సమానమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి సాంప్రదాయ బద్ధంగా వ్యవరిస్తారని అర్థం.

పింక్ కలర్

పింక్ కలర్

పింక్ కలర్‌ను ఎక్కువగా అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. సాధారణంగా పింక్ కలర్‌ను ఇష్టపడేవారు కాస్తంత చిలిపిగా, అందంగా ఉంటారని చెప్పవచ్చు. ఒకవేళ మీ వాహనం రంగు పింక్ అయితే మీరు అమాయకంగా ఉండి యువత అయి ఉంటారు.

పర్పల్ కలర్

పర్పల్ కలర్

ఇది కూడా చాలా అరుదైన రంగు. ఇది సృజనాత్మక వ్యక్తిత్వానికి ప్రతీక. పర్పల్ కలర్ వాహనాలను ఇష్టపడేవారు తమ ఇండిపెండెన్స్‌ను ప్రదర్శించుకోవాలని అనుకుంటుంటారు.

గోల్డ్ కలర్

గోల్డ్ కలర్

ఒకవేళ మీరు బంగారు వర్ణపు కారును గనుక కలిగి ఉంటే.. మీకు విలాసాలంటే చాలా ఇష్టమని అర్థం. మీరు బాగా ధనికులై ఉంటారు. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు.

మీరు ఎలాంటి వారో తెలిపే మీ కార్ కలర్

మరి ఇందులో.. మీ వాహనం రంగు ఏంటి.. అలాగే, మీ వ్యక్తిత్వంతో మీ వాహనం రంగు సరిపోయిందా..?

More from DriveSpark

Article Published On: Wednesday, November 20, 2013, 11:17 [IST]
English summary
We are always choosy about the colours of our clothes, homes and even our vehicles. Do you know the colour of your car actually reflects your personality? A recent study car buyers and the choice of colours has clearly revealed the connection between buyers personality and their car colours.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+