Challans: ఒక్క క్లిక్ తో వెహికిల్ చలాన్ వివరాలు.. ఈ వెబ్ సైట్స్ లలో చెక్ చేసుకోవచ్చు..

ఏదైనా వాహనం నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే పోలీసులు చలాన్ వేస్తారు. ఈ రోజుల్లో, దాదాపు అన్ని పెద్ద నగరాల్లో CCTV సహాయంతో చలాన్లు విధించండం ప్రారంభించారు. పెరిగన టెక్నాలజీతో మీరు నిబంధల్నీ ఉల్లంఘిస్తే పోలీసులకు చిక్కే ప్రమాదం ఉంది. ఒక్క క్లిక్ తో మీ చరవాణిలోకి మీరు చేసిన తప్పిదాన్ని చెక్ చేసుకోవచ్చు.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి క్షణాల్లో ఈ-చలాన్లు జారీ చేయబడుతున్నాయి. దీంతో పాటు రోడ్లపై నిలబడిన ట్రాఫిక్ పోలీసులు కూడా మొబైల్ ఫోన్ల సాయంతో చలాన్లు జారీ చేస్తున్నారు. అంటే ఏ విధంగా చూసుకున్న మీరు ట్రాఫిక్ నియమాలు పాటించకుంటే ఇక అంతే సంగతులు అన్నమాట. కాబట్టి ఇకపై కాస్త అలెర్ట్ గా ఉంటూ ట్రాఫిక్ చలాన్లను తప్పించుకోండి.

చలాన్స్

ఆన్ లైన్ లో సులభంగా తెలుసుకోవచ్చు..
ఈ కథనంలో మీ బైక్/లేదా కారు చలాన్ ని సులభంగా తెలుసుకోవచ్చు. ఎంత మొత్తంలో ఫైన్ వేశారనే పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఇందుకోసం కేంద్రానికి, రాష్ట్రాలకు సంబంధించిన వైబ్ సైట్ లు అంందుబాటులో ఉన్నాయి. ఆ వెబ్ సైట్ లలోకి వెళ్లి మీ చలాన్ల పెండిగ్ ఫైన్స్ ఏవైనా ఉంటే తెలుసుకోవచ్చు.

బైక్ లేదా కారుపై ఎంత మొత్తంలో జరిమానా విధిస్తారేమోనని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. దాన్ని ఎలా నిర్ధారించుకోవాలో చాలా మందికి తెలియక తికమక పడుతుంటారు ఆ వివరాలకు సంబంధించిన ఫైన్ అమౌంట్ ఆ రాష్ట్రాల ట్రాఫిక్ పోలీస్ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. నిజంగానే మీకు ఫైన్ పడినట్లు భావిస్తే చలాన్ వెబ్ సైట్ ఆధారంగా మీ జరిమాన వివరాలు తెలుసుకోవచ్చు.

చలాన్స్

తెలంగాణలో..
తెలంగాణకు చెందిన వారు https://echallan.tspolice.gov.in/ ద్వారా మీ వెహికిల్ నంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత కాప్చా నంబర్లను ఎంటర్ చేయడం ద్వారా మీ వివరాలను పొందవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. పబ్లిక్ వ్యూ ద్వారా బైక్ లేదా కారు నంబర్ సహాయంతో మీ ఫైన్ అమౌంట్ ని సులభంగా తెలుసుకోవచ్చు.

మీ వాహనానికి ఎక్కడ, ఏ టైమ్ కి చలాన్ విధించారో ఫోటోతో సహా క్లియర్ గా చూడవచ్చు. చలాన్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆన్ లైన్ పేమెంట్ తో అమౌంట్ ని క్లియర్ చేయవచ్చు. ఇందుకోసం అదే వెబ్ సైట్ లో ఉండే పేమెంట్ ఆప్షన్ ఎంచుకుని మీ పెండింగ్ ఫైన్ ని క్లియర్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో..
అలానే ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు https://apechallan.org/ ద్వారా మీ వెహికిల్ నంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత కాప్చా నంబర్లను ఎంటర్ చేయడం ద్వారా మీ వివరాలను పొందవచ్చు. ఏపీలో కొన్ని సందర్భాల్లో మీ ఫైన్ వివరాలకు సంబంధించిన ఫోటోల వివరాలు లభించకపోయినప్పటికీ ఎక్కడ మీకు ఫైన్ విధించారో కచ్చితమైన లొకేషన్ తో సహా చూపిస్తుంది. ఆన్ లైన్ లో ఈ అమౌంట్ ని మీరు క్లియర్ చేయవచ్చు.


కేంద్ర వెబ్ సైట్ ద్వారా
ఇక కేంద్రానికి సంబంధించిన వెబ్ సైట్ ద్వారా కూడా మీ పెండిగ్ చలాన్లను తెలుసుకోవచ్చు. https://echallan.parivahan.gov.in/ లోకి వెళ్లి గెట్ యువర్ చలాన్ డీటైల్స్ ఆప్షన్ ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఓ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వెహికిల్ నంబర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ని ఉపయోగించి ఫైన్ వివరాలు తెలుసుకోవచ్చు.

మీ చలాన్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా కూడా ఇందులో తెలుసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన చలాన్లు ఇందులో తెలియక పోవచ్చు. అందుకోసం ఆ రాష్ట్ర వెబ్ సైట్లను ఉపయోగించుకోవచ్చు. మొత్తానికి ఫైన్ పడకుండా ఉంటే మీరు మీ వెహికిల్ ఫైనింగ్ నుంచి తప్పించుకోవచ్చు. కావున ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధల్నీ పాటించి చలాన్లు పడకుండా జాగ్రత వహించండి.

More from DriveSpark

Article Published On: Friday, April 7, 2023, 12:46 [IST]
English summary
Know your vehicle challan details using websites or online
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+