దుబాయ్ పోలీసులు కొయినిగ్‌సెగ్ వన్:1 కారును వాడితే?
ప్రపంచంలో కెల్లా అత్యధికంగా సూపర్‌కార్లను ఉపయోగించే పోలీసులు కలిగిన దేశం ఏదంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది దుబాయ్. దుబాయ్ పోలీసుల వద్ద ఇప్పటికే ఫెరారీ, బుగాటి, ఆస్టన్ మార్టిన్, బిఎమ్‌డబ్ల్యూ, బెంట్లీ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ మరియు సూపర్ కార్ కంపెనీలకు చెందిన సూపర్‌కార్లు, వేగవంతమైన కార్లు, స్పోర్ట్స్ కార్లు మరియు విలాసవంతమైన కార్లున్నాయి.
అయితే, స్వీడన్‌కు చెందిన హైపెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ కొయినిగ్‌సెగ్ ఇటీవల ఆవిష్కరించిన ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే 'వన్:1' కారు కూడా దుబాయ్ పోలీసుల సూపర్‌కార్ జాబితాలో చేరితే ఎలా ఉంటుంది? సాధారణంగా దుబాయ్ పోలీసుల చెంతకు వచ్చే ఏ సూపర్ కారైనా వైట్ అండ్ గ్రీన్ కలర్‌లో పెయింట్ చేయబడి, అక్కడి పోలీస్ యాంబ్లంతో డిజైన్ చేయబడి ఉంటాయి.
ఈ నేపథ్యంలో, శాంటాపాంటర్ అనే వ్యక్తి దుబాయ్ పోలీసులు ఈ సరికొత్త కొయినిగ్‌సెగ్ వన్:1 కారును ఉపయోగిస్తో ఎలా ఉంటుందోనని రెండరింగ్ రిలీజ్ చేశాడు. ఎప్పుడో ఒకప్పుడు ఈ కారు కూడా నిజంగానే దుబాయ్ పోలీసుల సూపర్‌కార్ కలెక్షన్‌లో చేరిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సరే ఈలోపుగా మనం ఈ రెండరింగ్‌ను చూద్దాం రండి.

కొయినిగ్‌సెగ్ వన్:1 విషయానికి వస్తే, దీని పవర్ టూ వెయిట్ రేషియో (పిటిడబ్ల్యూ) 1:1, అందుకే ఈ కారుకు వన్:1 అనే పేరును పెట్టారు. అంటే ఈ కారు మొత్తం బరువు 1340 కిలోలు, అలాగే దీని ఇంజన్ ఉత్పత్తి చేసే శక్తి 1340 హెచ్‌పిలు. ఈ రెండింటి నిష్పత్తి 1:1 కాబట్టి ఈ కారుకు వన్:1 అనే పేరును పెట్టినట్లు కొయినిగ్‌సెగ్ పేర్కొంది.
కొయినిగ్‌సెగ్ అగెరా సూపర్‌కారులో ఉపయోగించిన ఇంజన్‌నే (5.0 లీటర్ వి8 టర్బో ఇంజన్) ఈ కొత్త వన్:1 సూపర్‌కారులోను ఉపయోగించారు. అయితే, ఈ ఇంజన్‌ను అప్‌ట్యూన్ చేశారు. కొయినిగ్‌సెగ్ తమ వన్:1 కారును ప్రపంచంలో కెల్లా తొలి ప్రొడక్షన్ 'మెగావాట్' కారుగా పిలుస్తోంది. ఇందుకు కారణందా, ఇది 1000 కిలోవాట్ల (1340 హార్స్ పవర్) శక్తిని ఉత్పత్తి చేయటమే.
కొయినిగ్‌సెగ్ వన్:1 యాక్టివ్ ఏరో (పెద్దా హైడ్రాలిక్ రియర్ వింగ్‌తో కలిపి) డైనమిక్స్‌ను కలిగి ఉండి ఫెరారీ లాఫెరారీ, మెక్‌లారెన్ పి1 కన్నా ఎన్నో రెట్లు మెరుగైన ట్రాక్ పెర్ఫార్మెన్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ కారు గంటకు 257 కి.మీ. వేగం వద్ద 600 కేజీల డౌన్‌ఫోర్స్‌ను జనరేట్ చేస్తుంది. కొయినిగ్‌సెగ్ వన్:1 గరిష్ట వేగం గంటకు 273 మైళ్లు (అంటే గంటకు 440 కిలోమీటర్లు). కేవలం ఆరు కొయినిగ్‌సెగ్ వన్:1 కార్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నారు మరియు దీని ధర 20 లక్షల డాలర్లు ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








