వేలానికి కోట మహారాజు రోల్స్ రాయిస్ 'టైగర్ కార్'!!

Kota Maharaja & his Tiger Car
రాజస్థాన్‌లోని కోటను పరిపాలించిన మహారాజు 'రెండవ ఉమీద్ సింగ్' ఉపయోగించిన ఓ పాత రోల్స్ రాయిస్ కారు ఇప్పుడు వేలానికి వచ్చింది. రెండవ ఉమీద్ సింగ్ ఆ కాలంలో రోల్స్ రాయిస్ కంపెనీకు ప్రత్యేకంగా ఆర్డక్ ఇచ్చి మరీ ఈ కారును తయారు చేయించుకున్నారు. ఇందులో ఓ మెషీన్ గన్‌ కూడా అమర్చబడి ఉండటం దీని ప్రత్యేకత. బ్రిటీష్‌కు చెందిన ఓ ప్రైవేట్ వేలం సంస్థ బోన్‌హామ్స్ టైగర్ కారుగా పిలిచే ఈ రోల్స్ రాయిస్ కారును వేలానికి ఉంచింది.

రాజస్థాన్‌లోని అడవులు, కొండలు వంటి ప్రాంతాల్లో రాజు వేటకు వెళ్లేందుకు వీలుగా పొడవైన టైర్లతో ఈ కారును రూపొందించారు. ఎలాంటి యంత్రాలు ఉపయోగించకుండా ఈ కారును పూర్తిగా చేతుల్తో రూపొందించారు. ఇంకా, ఈ కారులో ఏ వైపుకు కావాలంటే ఆ వైపుకు తిరిగేలా అమర్చబడిన శక్తివంతమైన ఇత్తడి సెర్చ్‌లైట్లు ప్రధాన ఆకర్షణ. 1925వ సంవత్సరానికి చెందిన ఈ రోల్స్ రాయిస్ కారును టోర్పెడ్ టూరెర్ లేదా "టైగర్ కార్" అని పిలుస్తారు.

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు అతిపెద్దదైన వేలం కంపెనీ బోన్‌హామ్ ప్రకారం.. ఈ కారు వేలంలో 7.5 లక్షల అమెరికన్ డాలర్ల నుంచి 10 లక్షల అమెరికన్ డాలర్ల వరకూ వెల పలుకవచ్చని అంచనా. ఈ కారు వేలం ఆగస్టు 18-19 తేదీలలో కాలిఫోర్నియాలో జరగనుంది. టైగర్ కారు 8-లీటర్, 6-సిలిండర్ ఇంజన్‌తో డ్యూయెల్ స్పార్క్ ఇగ్నిషన్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. రెండవ ఉమీద్ సింగ్ (సాహిబ్ బహుదూర్ సింగ్ అనే పేరు కూడా ఉంది) కోటను 1889 నుండి 1940వ సంవత్సరం వరకూ పరిపాలించాడు. పులులు, సింహాలు వంటి క్రూర మృగాలను వేటాడటానికి రెండవ ఉమీద్ సింగ్ రాజు ఈ టైగర్ కారును ఉపయోగించేవారు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 27, 2011, 18:05 [IST]
English summary
Rolls-Royce has been synonymous with luxury cars and Indian Maharajas were some one who enjoyed luxury at the very best. India played such an important role in Rolls-Royce's development as a company that more than one third of the cars sold by Rolls-Royce between the two world wars were bought by Indian royalty.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+