పోలీస్ జీపుపై యువ జంట చేసిన పని చూసి షాక్! తాగి, ఏం చేస్తున్నారో తెలియకుండానే హద్దు దాటారు!

నేటి యువతరంలో చాలా మంది చెడు వ్యసనాలకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. స్త్రీ-పురుషుల తేడా లేకుండా మధ్య తాగుతూ రోడ్లపై ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో చాలా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటివి వెంటనే వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఇటీవల ఒక యువ జంట బహిరంగ ప్రదేశంలో ఘర్షణ సృష్టించింది. మద్యం ప్రభావంలో, వారు ఏకంగా పోలీసు జీపుపై ఎక్కి గొడవ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ సంఘటన చాలా వేగంగా వైరల్ అయింది, ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చర్చకు కేంద్రంగా మారింది. దీనిని మేము న్యూస్ 24 యూట్యూబ్ ఛానెల్‌ నుంచి తీసుకున్నాం.

రాజస్థాన్‌లోని కోట ప్రాంతంలో ఒక యువ జంట చేసిన హంగామా సంఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ వీడియోగా మారింది. ఈ వీడియోలో, ఒక యువకుడు, యువతి పోలీసు జీపు పైన నిలబడి, కింద ఉన్న వ్యక్తులతో వాదిస్తూ, తీవ్ర హంగామా సృష్టిస్తున్నట్టు చూడవచ్చు. ఆ సమయంలో యువకుడు మద్యం సేవించి ఉన్నాడు. యువతి మద్యం సేవించిందా లేదా అనేది స్పష్టంగా తెలియదు.

Kota Rajasthan Teenage Girl And Boy Climb On Roof Of Police Jeep Video

వీరిద్దరు పోలీసును ముప్పు తిప్పలు పెట్టారు. యువకుడు తన తీవ్ర పదజాలంతో విరుచుకుపడగా, యువతి తనను వెళ్లనివ్వమని విన్నవిస్తోంది. ఒక క్షణంలో, యువకుడు యువతిని కౌగిలించి, తర్వాత ఇద్దరూ కింద పడిపోగా, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తరువాత వీరిని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం ప్రకారం, యువకుడి వయసు 22 ఏళ్లు, కానీ యువతి మైనర్ అని తెలుస్తుంది.

ఈ జంట ప్రేమలో ఉండటంతో, ఇంటి వారు పెళ్లిని అంగీకరించకపోవడంతో, వారు ఇంటి నుంచి రహస్యంగా వెళ్లిపోయారని సమాచారం. అమ్మాయి ఇంటి నుంచి కనిపించకుండా పోవడంతో, ఆమె కుటుంబం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ జంటను వెతికే ప్రయత్నంలో, వారు ఒక ప్రాంతంలో రహస్యంగా ఉన్నట్టు గుర్తించారు. వారిని పట్టుకోవడానికి వెళ్లగా జంట పోలీసు జీపుపైకి ఎక్కి విచిత్రంగా ప్రవర్తిస్తూ, స్థానికుల ముందూ హంగామా సృష్టించారు.

Kota Rajasthan Teenage Girl And Boy Climb On Roof Of Police Jeep Video

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. గొడవ పది నిమిషాల పాటు కొనసాగి, చివరికి పోలీసులు వారిని చెదిరించి అదుపులోకి తీసుకుని రాంపుర కొత్వాలి స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఈ యువకుడు, యువతి పై, బహిరంగ ప్రదేశంలో అసభ్యకరంగా ప్రవర్తించడం, ఆందోళన సృష్టించడం, మైనర్‌తో పారిపోవడం వంటి నేరాల కింద కేసు నమోదు చేశారు.

ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి కాదు. త్రాగిన మైకంతో ఏం చేస్తున్నారు అనేది తెలియకుండా, వాహనాలు నడుపుతూ చుట్టూ ఉన్నవారిని ఇబ్బందులకు గురి చేసే ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. కొన్ని నెలల క్రితం కూడా,కొంత మంది యువకులు, మహిళలు బైక్‌లు నడుపుతూ, జనాల్లో పెద్ద గొడవ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో యువతులు, యువకులు చేతులు పట్టుకుని ముద్దులు పెట్టుకునే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇలాంటి ప్రవర్తనలు సమాజానికి ప్రమాదకరమని, అలాగే ఇతరుల స్వేచ్ఛ, భద్రతకు హానికరమని స్పష్టంగా చెప్పవచ్చు. పోలీసు జీపుల పైకి ఎక్కి అసభ్యకర చర్యలకు పాల్పడడం చాలా దిగ్భ్రాంతికరమైన పని. ఇలాంటి ఘటనలపై సంబంధిత అధికారులు యువతలో అవగాహన పెంచడం, తప్పు ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 24, 2025, 14:30 [IST]
English summary
Kota rajasthan teenage girl and boy climb on roof of police jeep video
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+