Just In
- 3 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 4 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 6 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 6 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
నిమ్మకాయ, మిరపకాయల ముగ్గు: చెల్లిని చంపిన తర్వాత తననూ చంపమన్న అలేఖ్య
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీకు తెలుసా.. అమెరికాలో 2021 రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి ఒక టీవీ షో హోస్ట్
రోల్స్ రాయిస్ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది లగ్జరీ. ఇవి చాలా లగ్జరీగా ఉండటమే కాకుండా లగ్జరీ అనుభవాన్ని కూడా అందిస్తాయి. ఈ కార్లు అత్యంత ఖరీదైన కారణంగా చాలా తక్కువమంది వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు వంటివారు మాత్రమే కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల అమెరికా ప్రైవేట్ టీవీ షో హోస్ట్ 2021 రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొనుగోలు చేసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

క్రిస్ జెన్నర్ అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రైవేట్ టీవీ షో హోస్ట్. జెన్నర్ ఇటీవల లేటెస్ట్ వెర్షన్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును కొనుగోలు చేసింది. అమెరికాలో ఈ కారును మొదట కొనుగోలు చేసినది వ్యక్తి క్రిస్ జెన్నర్. దాదాపు అమెరికాలోని చాలామంది ప్రజలు ఎక్కువగా ఇటువంటి లగ్జరీ కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.

2021 రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు ఇటీవల భారత్‌కు చేరుకుంది. కొంతమంది భారతీయులు త్వరలో ఈ కారును సొంతం చేసుకోబోతున్నారు. ఇటీవల క్రిస్ జెన్నర్ కూడా ఈ కారుని సొంతం చేసుకున్నారు. లగ్జరీ ఫీచర్స్ ఇష్టపడే వాహనప్రియులు ఎక్కువగా ఈ రోల్స్ రాయిస్ కార్లు ఎక్కువగా ఇష్టపడతారు. విలాసవంతమైన ఫీచర్స్ కలిగిన ఈ కారు చూడటానికి లగ్జరీగా ఉండటమే కాదు, వీటి ధర కూడా భారీగానే ఉంటుంది.
MOST READ:ఒకే వారంలో రెండుసార్లు జరిమానా చెల్లించిన డిప్యూటీ మేయర్.. ఎవరో తెలుసా ?

ఒక టీవీ షో హోస్ట్ ఇంత ఖరీదైన లగ్జరీ కారు కొనడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. క్రిస్ జెన్నర్ మెటల్ బ్లాక్ కలర్ కారును కొనుగోలు చేసింది. ఈమె కారుతో ఉన్న ఫోటో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది.

క్రిస్ జెన్నర్ అనేక లగ్జరీ కార్లను కలిగి ఉంది. జెన్నర్ వద్ద మొత్తం15 కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఆమె వద్ద ఉన్న కార్లన్నీ ఖరీదైన కార్లు. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు వారి గ్యారేజీకి కొత్త అందాన్ని తీసుకువచ్చింది.
MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్, అతడు నడిపే కార్లు

ఈ కారులో 6.75-లీటర్ ట్విన్-ట్రోచార్జ్డ్ వి 12 పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 563 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ కారులో శాటిలైట్ ట్రాన్స్-మిషన్ సిస్టం ఉంది. ఇది జిపిఎస్ ద్వారా రహదారి పరిస్థితిని అంచనా వేయడానికి మరియు గేర్‌ను మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

ఈ స్పెషల్ ఫీచర్ ఇతర వాహనాలలో కనుగొనబడలేదు. అంతే కాకుండా ఈ కారు వెనుక చక్రం ఆటోమేటిక్ హైట్ అడ్జస్ట్ చేయగల ఎయిర్ సస్పెన్షన్‌తో అందించబడుతుంది. ఇది రహదారిపై ప్రయాణించేటప్పుడు నీటిపై తేలుతున్నట్లు అనిపిస్తుంది. ఈ కారు కఠినమైన రోడ్లలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులకు లగ్జరీ అనుభవాన్నే ఇస్తుంది. ఈ కొత్త 2021 రోల్స్ రాయిస్ ఘోస్ట్ ధర సుమారు రూ. 6.95 కోట్లు.
MOST READ:యజమాని డ్రైవింగ్ సమయంలో రివర్స్ పార్కింగ్ కెమెరాలాగ పనిచేస్తున్న పెంపుడు కుక్క [వీడియో]