ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్‌ ఇచ్చిన బస్‌ కండక్టర్‌..

ప్రభుత్వ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ టిక్కెట్లు ఇచ్చినా(Free Ticket For Women).. వారు తీసుకెళ్తున్న లగేజీకి మాత్రం ఏకంగా రూ. 444 టికెట్ ఛార్జీలు వసూలు చేశారు కండక్టర్. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇంతకీ వారు తీసుకెళ్తున్న లగేజీ ఏంటీ.?? ఆ లగేజీకి అంత ఛార్జీ వసూలు చేయడమేంటి.?? పూర్తి సమాచారం ఈ కథనంలో..

ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ అధికారాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మొదటగా తమిళనాడు ప్రభుత్వం ఈ స్కీమ్‌ తీసుకురాగా.. తర్వాత కర్ణాటక రాష్ట్రం శక్తి పేరుతో ఈ పథకాన్ని తీసుకువచ్చింది.

Ticket-For-Love-Birds-In-Free-Bus

మహిళలు ఆయా రాష్ట్రాల్లో ఆ రాష్ట్రానికి చెందినవారిగా ఆధార్‌ కార్డు చూపించడం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతటా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం ద్వారా బస్సుల్లో మహిళల రద్దీ పెరుగుతుందనడంలో సందేహం లేదు. కాగా కర్ణాటకలో ఇటీవల ఓ వింత(Ticket For Love Birds) సంఘటన చోటుచేసుకుంది. ఫ్రీ ప్రయాణమని బస్సు ఎక్కిన అమ్మమ్మ, మనవరాలికి బస్సు కండక్టర్‌ ఊహించని షాక్‌ ఇచ్చారు.

సాధారణంగా ప్రయాణికులు తాము ఎక్కినప్పుడు పరిమితికి మించి లగేజీ ఎక్కువగా తీసుకువెళ్తే దానికి ఛార్జీలు వసూలు చేస్తారు. ఉదాహరణకు బియ్యం బస్తాలు, ఇంకా అధిక లగేజీ ఇలాంటివి. అయితే ఇక్కడ కర్ణాటకలో ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్న అమ్మమ్మ, మనవరాలు తమతో పాటు నాలుగు లవ్‌బర్డ్స్‌ను తీసుకువెళ్లారు. దీంతో వారిద్దరికి జీరో టికెట్‌ వేసి లవ్‌ బర్డ్స్‌కి టికెట్‌ వసూలు చేశారు కండక్టర్‌.

శక్తి పథకం కింద అమ్మమ్మ, మనవరాలు ఉచితంగా బస్సులో ప్రయాణిస్తుండగా.. తమ వెంట పంజరంలో తీసుకువస్తున్న 4 లవ్‌బర్డ్స్‌కి మాత్రం రూ.444 టికెట్ ఛార్జీలు వేశారు. వారు KSRTC బస్సులో బెంగళూరు నుండి మైసూర్‌కు ప్రయాణించినట్లు సమాచారం. అయితే ప్రభుత్వ బస్సుల్లో బెంగళూరు నుంచి మైసూర్ వెళ్లేందుకు చిన్నారులకు హాఫ్‌ టికెట్‌ కింద రూ.111 చార్జీ వసూలు చేస్తారు.

అంటే ఇక్కడ లవ్‌బర్డ్స్‌ని హాఫ్ టికెట్‌గా భావించి.. ఒక్కో దానికి రూ.111 వసూలు చేశారు. మొత్తంగా రూ.444 వసూలు చేశారు. ఈ సంఘటనకు బస్సులో ఉన్న మరో ప్రయాణికుడు తన మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో తెగ వైరల్‌ అవుతోంది. కాగా అమ్మమ్మ, మనవరాలు ఇద్దరూ.. ఆ లవ్‌బర్డ్స్‌ని తమతో పాటు సీటుపై కూర్చోబెట్టారు.

అయితే బస్సులో ఇతర ప్రయాణికులను కూడా దృష్టిలో ఉంచుకుని వారిద్దరూ ఆ పక్షులను తమ ఒడిలో కూర్చోబెట్టుకుని ఇతరులకు సీటు ఇవ్వొచ్చు. కానీ ఇక్కడ వీరు మాత్రం అలా చేయకుండా ఆ పంజరాన్ని ప్రత్యేకంగా సీటులో కూర్చోబెట్టారు. ఇది చూసిన కండక్టర్‌.. వాటికి టికెట్‌ వేశారు. అయితే పంజరం మొత్తానికి ఒక టికెట్‌ వేయకుండా.. ఒక్కో పక్షికి ప్రత్యేకంగా టికెట్‌ వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఏదేమైనా మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాక ఇలాంటి చిత్ర విచిత్ర సంఘటనలు చాలా చోటుచేసుకుంటున్నాయి. సీటు కోసం, విండో కోసం మహిళలు కొట్టుకోవడం నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి.

More from DriveSpark

Article Published On: Thursday, March 28, 2024, 9:33 [IST]
English summary
Ksrtc bus conductor charges rs 444 for love birds check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+