కారును తప్పించబోయి.. ఫ్లైఓవర్‌పై వేలాడిన బస్సు - వీడియో చూస్తే షాకవుతారు!

రోడ్డుపైన అప్పుడప్పుడు అనుకోని విధంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనే ఇటీవల కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ప్రమాదం పెద్దదే అయినా.. ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.

ఇటీవల బెంగళూరు ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చిన ఘటనలో.. హైవే మీద కారును తప్పించబోయి, గవర్నమెంట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఇందులో కొందరికి స్వల్ప గాయాలైనట్లు, మిగిలినవారు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో వెల్లడైన ఫోటోలలో గమనిస్తే.. బస్సు ఫ్లైఓవర్‌ దగ్గర వేలాడుతూ ఉండటం చూడవచ్చు. బస్సు డ్రైవర్ కారును తప్పించే క్రమంలో బస్సును కంట్రోల్ చేయలేకపోయారు. ఈ కారణంగానే ప్రమాదం జరిగింది.

KSRTC Bus Hangs in Flyover

బెంగళూరు.. తుమకూరు హైవేలోని నేలమంగళల అడకమారనహళ్లి జంక్షన్ సమీపంలో జరిగింది. సోమవారం పేట నుంచి బెంగళూరు వెళ్లే గవర్నమెంట్ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బస్సు మదనాయకనహళ్లి వద్ద ఉన్న ఫ్లైఓవర్ ర్యాంప్‌పై వెళ్తున్న సమయంలో.. బస్సుకు ముందు కారు రావడంతో.. బస్సు డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కెఎస్‌ఆర్‌టిసి సీనియర్ అధికారి పేర్కొన్నారు.

డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోవడంతో అది హైవేపైన అంచు భాగాన్ని గట్టిగా ఢీ కొట్టింది. దీంతో బస్సు 40 ఎత్తులో వేలాడుతూ అక్కడే నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు ముందు భాగంలో కూర్చున్న వారికి గాయాలైనట్లు వారు పేర్కొన్నారు. అందులో ఒకరికి మాత్రం తలకు గాయమైనట్లు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు సమాచారం.

KSRTC Bus Hangs in Flyover

బస్సు ప్రమాదానికి గారైన వెంటనే.. హైవేమీద బాగా ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో దాదాపు గంట పాలు వాహనాలన్నీ అక్కడే ఉండాల్సి వచ్చింది. అధికారులు క్రేన్‌ను రప్పించి బస్సును బయటకు తీశారు. ఆ తరువాత రోడ్డుపై వాహనాలన్నీ ముందుకు కదిలాయి. ట్రాఫిక్ పోలీసులకు, ప్రజలు సహకరించడం ప్రశంసనీయం అని పలువురు అభిఅందించారు. బస్సులో ప్రయాణించిన అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.

ప్రయాణ సమయంలో బస్సులు అదుపుతప్పడం ఇదే మొదటిసారి కాదు.. ఇటీవల తమిళనాడులో పడిన వర్షాలకు అక్కడి ప్రభుత్వ బస్సు రోడ్డుపై వెల్తూ పక్కనున్న కాలువలోకి జారింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. వర్షం కురవడం వల్ల రోడ్ల మీద వాహనాలు ప్రయాణించే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఈ సంఘటన మరువక ముందే కర్ణాటకలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

నిజానికి డ్రైవర్లు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎపుడు ఎటు నుంచి ప్రమాదం వస్తుందో ఊహించలేము. కాబట్టి వీలైనంత నెమ్మదిగా ప్రయాణించాలి. గమ్యాన్ని నెమ్మదిగా చేరినా సురక్షితంగా చేరవచ్చు. అలా కాకూండా రోడ్డు మీద వాహనాలను ఓవర్ టేక్ చేసుకుంటూ ముందుకు వెళితే ప్రమాదం జరగవచ్చు. ఆ ప్రమాదంలో ప్రాణాలే కోల్పోవచ్చు. ఇలాంటివి దృష్టిలో ఉంచుకుని డ్రైవర్లు జాగరూకగా ఉండాలి. రోడ్డుపైన ఒకరి నిర్లక్ష్యం ఎంతోమంది జీవితాలను తలకిందులు చేస్తుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 22, 2024, 14:14 [IST]
English summary
Ksrtc bus hangs in flyover after trying to avoid hitting car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+