Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మొబైల్ క్లినిక్‌లుగా మారిన KSRTC బస్సులు
భారతదేశంలో కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 75,000 పైగా కరోనా రోగులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య పెరగడంతో వైద్య పరికరాల కొరత కూడా పెరిగింది.

కరోనా రోగులకు సరైన చికిత్స చేయడానికి కేవలం వైద్య పరికరాలు మాత్రమే కాదు, ఆసుపత్రుల కొరత కూడా పెరిగింది. ఈ కొరతను అధిగమించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. రైలు బోగీలను ప్రత్యేక వార్డులగా తయారు చేశారు. ఇప్పుడు బస్సులను కూడా మొబైల్ క్లినిక్‌లుగా మారుస్తున్నారు.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా రవాణా బస్సులను తాత్కాలిక ఆసుపత్రులుగా మారుస్తున్నాయి. కరోనా వైరస్ ప్రారంభ రోజుల్లో చైనా కరోనా కోసం ప్రత్యేక ఆసుపత్రిని నిర్మించింది.
MOST READ:రాబోయే రోజుల్లో విడుదల కానున్న 5 కార్లు ఇవే, చూసారా..!

భారతదేశంలో ప్రస్తుత పరిస్థితి వేగంగా ఆసుపత్రిని నిర్మించే అవకాశం లేదు. ఈ కారణంగా ప్రజా రవాణా వాహనాలు మరియు పాఠశాలలను తాత్కాలిక ఆసుపత్రులుగా మారుస్తున్నారు.

ప్రారంభంలో ఇది ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో మాత్రమే జరిగింది. ఇప్పుడు ఇది దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో చేపడుతోంది. గతంలో కేరళ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి ప్రభుత్వ బస్సులను తాత్కాలిక ఆసుపత్రులు మరియు కోవిడ్ -19 పరీక్షా కేంద్రాలుగా మార్చారు.
MOST READ:ప్రజల పొట్టకొడుతున్న కరోనా, ఏమైందో తెలుసా

ఇప్పుడు, కర్ణాటక ప్రభుత్వం ఇలాంటి మార్గంలోనే అడుగులు ముందుకు వేస్తోంది. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కెఎస్ఆర్టిసి రవాణా బస్సులను కరోనా రోగుల కోసం ఆసుపత్రులుగా మార్చారు.

కరోనా వైరస్ ఎక్కువగా ఉండే రెడ్ జోన్లలో ఈ బస్సులు ఈ నడుస్తాయని అధికారులు చెబుతారు. ఏదైనా జ్వరం ఉంటే, బ్లడ్ శాంపిల్ సేకరించి తగిన చికిత్స ఇవ్వబడుతుంది.
MOST READ:వాయిదా పడిన హార్లే డేవిడ్సన్ బైక్ లాంచ్, ఎందుకో తెలుసా..!

ప్రత్యేకంగా తయారుచేసిన ఈ బస్ ఆస్పత్రులను ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ప్రజల ఉపయోగం కోసం ప్రారంభించారు. ఈ బస్సు ఆస్పత్రులు ప్రస్తుతం ఉన్న ఆసుపత్రులతో పనిచేస్తాయి.

ఈ బస్సులలో ప్రత్యేక వార్డు మరియు ట్రీట్మెంట్ రూమ్ తో సహా వివిధ సౌకర్యాలు ఉన్నాయి. అదనంగా ప్రతి బస్సులో వైద్యులు, ముగ్గురు నర్సులు మరియు ల్యాబ్ టెక్నీషియన్ ఉంటాడు.
MOST READ:బ్రేకింగ్ న్యూస్ : డీలర్‌షిప్‌లు ఓపెన్ చేసిన కెటిఎమ్ & హస్క్ వర్ణా

దీని కోసం ప్రత్యేక వాలంటీర్లను కూడా ఉపయోగిస్తారని చెబుతారు. సామాజిక దూరాన్ని పాటిస్తూనే రోగులకు చికిత్స చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారు ఆదేశించారు. కరోనా నివారించడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు కష్టపడుతున్నాయి. దీనికి ప్రజలు కూడా తమ మద్దతుని ప్రకటించాలి.