కెటిఎమ్ 690 బైక్‌తో పెయిటింగ్ వేసిన రాక్ బగోరోస్

By Ravi

మీ బైక్‌తో మీరు పెయింట్ చేయగలరా..? బ్రష్‌లతో పెయింట్ చేయడం తెలుసు కానీ బైక్‌లతో పెయింట్ చేయడం ఎలా ఆలోచిస్తున్నారా..? ఒకవేళ బైక్‌కు ఏమైనా బ్రష్‌లను వేలాడదీశారా..? అసలు బైక్‌తో పెయింట్ వేయడం ఏంటి..? సరే.. ఇక ఆలోచించకండి.. అసలు విషయం చెప్పేస్తా..!!

ప్రొఫెషనల్ స్టంట్ మాస్టర్ రాక్ బగోరోస్ (Rok Bagoros) ఫేస్‌బుక్‌లో తన అభిమానుల సంఖ్య 1,00,000 దాటినందుకు గాను, అభిమానుల కోసం ఓ ప్రత్యేకమైన వీడియోని తయారు చేశారు. ఇందులో రాక్ బగోరోస్ తన కెటిఎమ్ 690 బైక్‌తో కాన్వాస్‌పై పెయింట్ చేసి తన అభిమానలకు అంకింతం ఇచ్చాడు.

గోడపై కొంచెం ఎత్తులో ఓ తెల్లటి కాన్వాస్‌ను ఉంచి, దానిపై కొంచెం జిగురును అంటించి, ముందుగా డిజైన్ చేసుకున్నట్లుగా "రాక్ బగోరోస్ 100,000 ఫ్యాన్స్" అని వచ్చేలా దానిపై ఓ పేపరును అంటించారు. అనంతరం రాక్ తన కెటిఎమ్ 690 బైక్‌ను కాన్వాస్‌కు ఎదురుగా ఉంచి, వెనుక టైరుతో బర్నఅవుట్ చేశాడు.

ఇలా బర్నవుట్ చేసేటప్పుడు టైరు అరిగి ఆ రబ్బరు కరిగి కాన్వాస్‌పై చుక్కలు చుక్కులగా పడుతుంది. ఈ బర్నవుట్ పూర్తయిన తర్వాత, కాన్వాస్ పై అంటించిన పేపరును తొలగిస్తే, "రాక్ బగోరోస్ 100,000 ఫ్యాన్స్" అనే డిజైన్ వస్తుంది. ఇందు కోసం రాక్ ఒక పూర్తి టైరును అరగదీశాడు. మరి ఆ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/IMWhmSwKmBA?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Friday, March 14, 2014, 14:01 [IST]
English summary
We found a video in which professional Stunt Master Rok Bagoros is riding a KTM 690 and in appreciation of 100K facebook fans he makes a special video for his fans and follower.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+