ట్రాఫిక్ సిగ్నెల్‌లో డాన్స్ చేసిన కెటిఎమ్ బైక్ రైడర్ [వీడియో]

ప్రతి రోజు యూట్యూబ్‌లో అనేక వీడియోలో అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇందులో చాలా వరకు భిన్నమైన వీడియోలు, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇదే తరహాలో ఇప్పుడు ఒక వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయింది. ఈ వీడియోలో ఒక బైకర్ ట్రాఫిక్ సిగ్నెల్ లో డాన్స్ వేయడం చూడవచ్చు.

ట్రాఫిక్ సిగ్నెల్‌లో డాన్స్ చేసిన కెటిఎమ్ బైక్ రైడర్ [వీడియో]

నివేదికల ప్రకారం, ట్రాఫిక్ సిగ్నెల్‌లో ఒక యువకుడు తమిళ పాటకు డ్యాన్స్ చేస్తున్న చిత్రమైన వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటివరకు 8 మిలియన్లకు పైగా ప్రజలు చూశారు. ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ పడినప్పుడు అక్కడ అందరూ వేచి చూస్తున్న సమయంలో, కెటిఎమ్ బైక్ మీద కూర్చున్న ఒక యువకుడు అకస్మాత్తుగా తన బైక్ దిగి అక్కడ డాన్స్ వేసాడు. ఈ వీడియో మీరు ఇక్కడ గమనించవచ్చు.

ట్రాఫిక్ సిగ్నెల్‌లో డాన్స్ చేసిన కెటిఎమ్ బైక్ రైడర్ [వీడియో]

ట్రాఫిక్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు జరిగిన వీడియో నట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వీడియోలో కనిపించిన వెహికల్ నెంబర్ ప్లేట్‌ ఆధారంగా, ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

MOST READ:భార్య పుట్టినరోజుకి కోటి రూపాయల కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. ఎవరో తెలుసా?

ట్రాఫిక్ సిగ్నెల్‌లో డాన్స్ చేసిన కెటిఎమ్ బైక్ రైడర్ [వీడియో]

ట్రాఫిక్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు డ్యాన్స్ చేసిన వీడియోలు అప్‌లోడ్ చేయబడటం మరియు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి చాలా వీడియోలు గతంలో కూడా వైరల్ అయ్యాయి. సాధారణంగా, యువకులు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్క్‌లలో ఆదరణ పొందటానికి బైక్ స్టంట్స్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడతారు.

కానీ ఈ వీడియోలోని వ్యక్తి భిన్నంగా డ్యాన్స్ చేసి, ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించకుండా వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియోపై ప్రేక్షకులు వివిధ రకాల కామెంట్లు చేశారు. ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది లైక్ లు షేర్ లు కూడా చేశారు.

MOST READ:మీకు తెలుసా.. మారుతి సుజుకి బాలెనోతో 22 గంటల్లో 1,850 కిమీ ప్రయాణం.. కొత్త రికార్డ్ కైవసం

తమిళ్ తలైవా విజయ్ యొక్క మాస్టర్ ఫిల్మ్ 'వాతి కమింగ్' అనే పాట చాలా ప్రజాదరణ పొందింది. ఈ పాటను చాలా మంది డబ్ చేశారు. డబ్ చేయబడి అప్‌లోడ్ చేసిన వీడియోల కూడా పెద్ద సంఖ్యలో లైక్స్ వచ్చేస్తున్నాయ్. ఈ పాట ప్రజలలో ఎంత వ్యామోహాన్ని కలిగించింది అని ఈ వీడియో చూస్తేనే మనకు అర్థమవుతుంది.

ట్రాఫిక్ సిగ్నెల్‌లో డాన్స్ చేసిన కెటిఎమ్ బైక్ రైడర్ [వీడియో]

ఈ వీడియోలోని కెటిఎం బైక్ రైడర్ తన వెనుక వాహనంలో ఉన్నవారిని డ్యాన్స్ చేస్తున్నప్పుడు వీడియో తీయమని చెప్పాడు. రోడ్డు మధ్యలో ట్రాఫిక్ సిగ్నెల్ పడినప్పుడు ఆ కెటిఎమ్ రైడర్ చేసే డాన్స్, ఇతర వాహదారులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

MOST READ:కాలువలో చిక్కుకున్న నౌక; వణికిపోతున్న ప్రపంచ దేశాలు; ధరలు పెరిగే ప్రమాదం!

Most Read Articles

English summary
KTM Bike Rider Dances For Vaathi Coming Song In Traffic Signal. Read in Telugu.
Story first published: Saturday, March 27, 2021, 11:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X