అర్ధరాత్రి స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కెటిఎమ్ బైక్ ఇచ్చిన వ్యక్తి, ఎందుకో తెలుసా?

మారుతున్న కాలంతో పాటు ప్రజలు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు. ఈ క్రమంలో వారికి కావలసినవన్నీ దాదాపు తాము ఉన్న చోటుకే తెప్పించుకుంటున్నారు. ఇందులో కూడా స్విగ్గీ మరియు జొమాటో వంటి వాటిలో ఫుడ్ ఆర్డర్ ఎక్కువగా చేస్తుంటారు. ఈ విధంగా ఆర్డర్ చేసిన అతితక్కువ కాలంలోనే వారు ఫుడ్ డెలివరీ పొందుతారు. ఈ విధంగా సకాలంలో ఫుడ్ ఆర్డర్ పొందటానికి ఇందులో పనిచేసే డెలివరీ బాయ్స్ చాలా కష్టపడుతుంటారు. ఈ కారణంగానే సకాలంలో వారి ఆర్డర్స్ పొందుతారు.

అర్ధరాత్రి స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కెటిఎమ్ బైక్ ఇచ్చిన వ్యక్తి, ఎందుకో తెలుసా?

ఇటీవల ఒక స్విగ్గి డెలివరీ బాయ్ యొక్క బైక్ రాత్రిపూట పంక్చర్ అయ్యింది. ఫుడ్ ఆర్డర్ చేసిన వినియోగదారునికి ఏవిధంగా సమయానికి ఫుడ్ అందించాలో తనకి అర్థం కాకుండా పోయింది. ఇదే సమయంలో దారిలో ఉన్న ఒక వ్యక్తి తమ కెటిఎమ్ ఆర్‌సి 390 బైక్‌ను అతనికి ఇచ్చారు.

అర్ధరాత్రి స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కెటిఎమ్ బైక్ ఇచ్చిన వ్యక్తి, ఎందుకో తెలుసా?

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సంఘటన రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. ఈ వీడియోను ఎన్‌సిఆర్ బైకర్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు.

MOST READ:ఇండియన్ ఆర్మీలో చేరనున్న కళ్యాణి ఎమ్4 వాహనాలు, పూర్తి వివరాలు

అర్ధరాత్రి స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కెటిఎమ్ బైక్ ఇచ్చిన వ్యక్తి, ఎందుకో తెలుసా?

కెటిఎం బైక్ నడుపుతున్న వ్యక్తి, రోడ్డుపై స్విగ్గి డెలివరీ బాయ్ బైక్ పంక్షర్ అయి ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయమ్లో అక్కడకు వచ్చిన కెటిఎమ్ బైక్ ఓనర్ ఏమైనదని అడిగాడు, అప్పుడు తన బైక్ పంక్షర్ అయినదని అందుకే తానూ బైక్ నెట్టుకుంటూ వెళ్తున్నానని చెప్పాడు.

అర్ధరాత్రి స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కెటిఎమ్ బైక్ ఇచ్చిన వ్యక్తి, ఎందుకో తెలుసా?

ఇది విన్న కెటిఎమ్ ఓనర్ తన కెటిఎం బైక్‌ను డెలివరీ బాయ్‌కి ఇచ్చాడు. మొదట్లో స్విగ్గి డెలివరీ బాయ్ కెటిఎం బైక్ పొందడానికి నిరాకరించాడు. తన వల్ల ఎవరినీ ఇబ్బంది కలగకూడదని చెప్పాడు. కానీ కెటిఎం బైక్ యజమాని డెలివరీ అబ్బాయికి తన కెటిఎం బైక్ తీసుకోమని పట్టుబట్టారు.

MOST READ:కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

అర్ధరాత్రి స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కెటిఎమ్ బైక్ ఇచ్చిన వ్యక్తి, ఎందుకో తెలుసా?

కెటిఎం బైక్ ఓనర్ మరియు అతని స్నేహితులు డెలివరీ బాయ్ ఆహారాన్ని డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, డెలివరీ బాయ్ యొక్క బైక్‌ను రిపేర్ షాప్ కి తీసుకెళ్లారు. బైక్ రిపేర్ షాప్ లో పంక్చర్ అయిన టైర్ ట్యూబ్‌ను మార్చాలని చెప్పారు. కొత్త ట్యూబ్ వేయమని దానికి కావలసిన అమౌంట్ తానె చెల్లించాడు.

అదే సమయంలో డెలివరీ చేసి అక్కడకు వచ్చిన డెలివరీ బాయ్, తన బైక్ యొక్క ట్యూబ్ రీప్లేస్‌మెంట్ కోసం చెల్లించిన డబ్బు తీసుకోమని చెబుతాడు. అయినా దానికి కెటిఎం బైక్ ఓనర్ నిరాకరించి తనకు డబ్బు అవసరంలేదని చెప్పాడు. దీనికి బదులుగా రోడ్డు మీద అవసరమైన వారికి సహాయం చేయమని డెలివరీ బాయ్‌తో చెప్పాడు.

MOST READ:బాబూ నీ తెలివికి జోహార్లు: మద్యం అక్రమ రవాణాపై ఆనంద్ మహీంద్రా ట్వీట్

అర్ధరాత్రి స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కెటిఎమ్ బైక్ ఇచ్చిన వ్యక్తి, ఎందుకో తెలుసా?

ఆ విధంగా సహాయం చేయడం వల్ల చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాడు. ఇక్కడ ఉన్న కెటిఎం బైక్ ఓనర్ రహదారిపై నిరుపేదలకు సహాయం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ కెటిఎం బైక్ యజమాని రహదారిపై సహాయం అవసరమైన చాలామందికి తన వంతు సహాయం అందించారు. అతను తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ విధంగా సహాయం చేసిన అనేక వీడియోలను అప్‌లోడ్ చేశాడు.

Image Courtesy: NCR Bikerz

Most Read Articles

English summary
KTM Bike Rider Helps Swiggy Delivery Boy In Mid Night. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X