ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలాడిన KTM RC 390 బైక్ [వీడియో]
సాధారణంగా అప్పుడప్పుడు కొన్ని ఆశ్చర్యం గొలిపే మరియు భయానక సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి.. మనం చూస్తూనే ఉంటాము. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నిజంగానే ఒళ్ళు ఝల్లుమంటుంది. ఇలాంటి సంఘటనే ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో చూడగానే ఒక్కసారిగా మీకు భయం కలిగే అవకాశం ఉంది. అయితే ఇంతకీ ఆ సంఘటన ఏమిటి అనే విషయానికి వస్తే..
![ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలాడిన KTM RC 390 బైక్ [వీడియో] ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలాడిన KTM RC 390 బైక్ [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/06/speeding-ktm-bike-gets-stuck1-1654517888.jpg)
నివేదికల ప్రకారం, ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో ఇడుక్కి జిల్లా కట్టప్పన సమీపంలోని వెల్లయంకుడిలో జరిగింది. ఇక్కడ కెటిఎమ్ బైక్ ఏకంగా ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఏర్పాటు చేసిన ఒక ఇనుప కంచె (ఇనుప బోను) లో ట్రాన్స్‌ఫార్మర్ కి వేలాడుతూ ఉండటం చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
![ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలాడిన KTM RC 390 బైక్ [వీడియో] ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలాడిన KTM RC 390 బైక్ [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/06/speeding-ktm-bike-gets-stuck2-1654517897.jpg)
ఈ వీడియోలో మీరు గమనించినట్లతే కెటిఎమ్ ఆర్‌సి 390 బైక్ ట్రాన్స్‌ఫార్మర్ లో వేలాడుతూ ఉండటం చూడవచ్చు. అత్యంత వేగంతో వచ్చిన కెటిఎమ్ బైక్ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి దారి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ కంచె లోపల పడిపోయింది. ఆ బైక్‌పై ఉన్న యువకుడు కూడా గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.
![ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలాడిన KTM RC 390 బైక్ [వీడియో] ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలాడిన KTM RC 390 బైక్ [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/06/speeding-ktm-bike-gets-stuck3-1654517906.jpg)
ఆ సంఘటనలో ఆ బైక్ రైడర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆ సమయానికి అక్కడున్న చాలామంది అక్కడ గుమికూడారు. అయితే ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు ఆ ట్రాన్స్‌ఫార్మర్ కి పవర్ సరఫరా నిలిపివేసి బైక్ ని బయటకు తీయడానికి ఒక జెసిబి ఎర్త్‌మూవర్ ను పిలిపించారు.
![ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలాడిన KTM RC 390 బైక్ [వీడియో] ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలాడిన KTM RC 390 బైక్ [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/06/speeding-ktm-bike-gets-stuck4-1654517916.jpg)
మొత్తం మీద కొంత సమయం తరువాత జెసిబి ఎర్త్‌మూవర్ సాయంతో ఆ కెటిఎమ్ ఆర్‌సి 390 బైక్ బయటకు తీశారు. అయితే ఈ ప్రమాదంలో కెటిఎమ్ ఎక్కువగా దెబ్బతినింది. బైక్ యొక్క ఫ్రంట్ వీల్ మరియు సస్పెన్షన్ దాదాపుగా ధ్వంసమైంది. ఇంత పెద్ద ప్రమాదంలో ఆ బైక్ రైడర్ ప్రాణాలతో బయటపడటం నిజంగా చాలా గొప్ప అదృష్టమనే చెప్పాలి.
![ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలాడిన KTM RC 390 బైక్ [వీడియో] ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలాడిన KTM RC 390 బైక్ [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/06/speeding-ktm-bike-gets-stuck7-1654517946.jpg)
ఈ ప్రమాదంలో బైక్ నేరుగా వెళ్లి అక్కడున్న ట్రాన్స్‌ఫార్మర్ కి ఢీ కొట్టి ఉంటే అప్పుడు జరిగే ప్రమాదం ఊహాతీతం. కానీ అదృష్టవశాత్తు ఎలాటి పెద్ద ప్రమాదం జరగలేదు. అయితే ఈ సంఘటనలో బైక్ రైడర్ హెల్మెట్ ధరించలేదు. హెల్మెట్ ధరించకపోయినా బ్రతి బయటపడ్డాడు అంటే నిజంగా యితడు అదృష్టవంతుడే.
![ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలాడిన KTM RC 390 బైక్ [వీడియో] ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలాడిన KTM RC 390 బైక్ [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/06/speeding-ktm-bike-gets-stuck8-1654517955.jpg)
వాహన దారులు రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని అధికారులు తెలియజేస్తూనే ఉన్నారు. అయితే ఆ మాటలను చాలామంది పెడచెవిన పెడుతున్నారు. అలాంటప్పుడే ఊహించని రీతిలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.
![ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలాడిన KTM RC 390 బైక్ [వీడియో] ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలాడిన KTM RC 390 బైక్ [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/06/speeding-ktm-bike-gets-stuck5-1654517925.jpg)
సాధారణంగా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ద్విచక్ర వాహన వినియోగదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించకపోతే రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో ఏకంగా ప్రాణాలే కోల్పోయే అవకాశం ఉంది. కావున తప్పకుండా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ అన్ని విధాలుగా వాహనదారుల ప్రాణాలను రక్షిస్తుంది.
ఇటీవల ప్రభుత్వం 1998 నాటి మోటారు వాహనాల చట్టాన్ని సవరించి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ సరిగ్గా ధరించకపోతే వారికి రూ. 2,000 వరకు జరిమానా విధించాలని స్పష్టం చేసింది. అంతే కాకూండా హెల్మెట్ ధరించి, హెల్మెట్ పట్టీ తెరిచి ఉంటే వారికి రూ. 1,000 వరకు జరిమానా విధించబడుతుంది. కావున వాహన వినియోగదారులు తప్పకుండా ఈ నియమాలను దృష్టిలో ఉంచుకోవాలి.
![ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలాడిన KTM RC 390 బైక్ [వీడియో] ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలాడిన KTM RC 390 బైక్ [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/06/speeding-ktm-bike-gets-stuck6-1654518074.jpg)
అది మాత్రమే కాకుండా.. వాహన వినియోగదారులు ఉపయోగించే హెల్మెట్స్ 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్' చేత తప్పకుండా ధృవీకరించబడి ఉండాలి. ఆలా ద్రువీకరించబడకపోతే రూ. 1,000 జరిమానా చెల్లించవలసి ఉంటుంది. దీనితోపాటు మీరు హెల్మెట్ ధరించి ఉండి కూడా ట్రాఫిక్ సిగ్నెల్ క్రాస్ చేసినా.. మీకు రూ. 2000 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కావున ద్విచక్ర వాహనదారులు తప్పకుండా దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించాలి.
ఇప్పటికే భారతదేశంలో సురక్షితం కానీ హెల్మెట్స్ అమ్మకం కానీ.. వినియోగించడం కానీ పూర్తిగా నిషేదించింది. ఇది 2021 జూన్ నుండి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం దేశంలో బిఐఎస్ సర్టిఫికేట్ లేని హెల్మెట్ల ఉత్పత్తి మరియు అమ్మకాలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది.


Click it and Unblock the Notifications