KTM Vs Maruthi suzuki: మారుతి సుజుకి ఆల్టో కారును ఢీకొట్టిన KTM బైక్‌.. అసలు ఏం జరిగింది.. వీడియోలో ఏముంది?

భారత్‌లో రోడ్డు ప్రమాదాలు గణనీయ సంఖ్యలో జరుగుతున్నాయి. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. వాహనదారుల అతివేగం, నిర్లక్ష్యం, రోడ్లపైకి అకస్మాత్తుగా వస్తున్న పశువులు, మనుషులు సహా ఇతర కారణాలు ఉంటున్నాయి. అయితే కొన్ని ఘటనలు తీవ్ర విషాదానికి దారితీస్తున్నాయి.. మరికొన్ని చిన్న గాయాలతో ముగుస్తున్నాయి.

తాజాగా KTM బైక్‌ రైడర్‌.. మారుతి సుజుకి ఆల్టో కారును ఢీకొట్టారు. కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్‌ చేస్తున్న కేటీఎం బైక్‌ రైడర్‌.. రోడ్డుపై టర్నింగ్ తిరుగుతున్న కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎంత నైపుణ్యం కలిగిన రైడర్‌ అయినా అప్రమత్తత లేకుంటే ప్రమాదాల బారినపడే అవకాశాలు ఎక్కువని ఈ ఘటన చెబుతోంది.

KTM Rider collides with Maruti Suzuki Alto

చాలా మంది రైడర్లు కొండ, పర్వత ప్రాంతాల్లో రైడింగ్‌ చేసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే అటువంటి రోడ్లు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో.. అంతే ప్రమాదకరంగా ఉంటాయి. ఓ కొండ ప్రాంతంలో ఇద్దరు రైడర్లు తమ వాహనాలపై ప్రయాణం చేస్తున్నారు. మలుపులు, ఎత్తు పల్లాల్లో బైక్‌ రైడింగ్‌ చేస్తున్నారు.

వీడియో ఆధారంగా రైడర్‌, అతని స్నేహితుడు కేటీఎం బైక్‌పై ప్రయాణం చేస్తున్నారు. దారిలో అనేక మలుపుల గుండా వేగంగా ప్రయాణిస్తున్నారు. అయితే ఓ ప్రాంతం వద్ద మారుతి సుజుకి ఆల్టో హ్యాచ్‌బ్యాక్‌ కారు రోడ్డుపై టర్నింగ్ తీసుకుంటోంది. అదే సమయంలో వేగంగా వచ్చిన KTM బైక్‌ రైడర్‌ కారును సరిగా గమనించలేదు. ఆఖరి నిమిషంలో గుర్తించినా.. బైక్‌ను నియంత్రించేందుకు సమయం లేకపోయింది.

KTM Rider collides with Maruti Suzuki Alto

దీంతో కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. అనంతరం రోడ్డుపై పడిపోయాడు. వెంటనే లేచి రోడ్డు పక్కనున్న సిమెంట్‌ దిమ్మపై కూర్చుని ఛాతిని పట్టుకొని బాధపడడాన్ని వీడియోలో గమనించవచ్చు. కేటీఎం రైడర్‌ వెనుక వచ్చిన అతని స్నేహితుడు వెంటనే తన వాహనాన్ని నిలిపి, రోడ్డుపై పడివున్న తన స్నేహితుడి బైక్‌ను పక్కకు తీసుకురావడం గమనించవచ్చు. అయితే ఈ ఘటన ఎక్కుడ జరిగిందనే సమాచారం లేదు.

ఘటన అనంతరం మారుతి సుజుకి ఆల్టో డ్రైవర్.. రైడర్‌కు క్షమాపణ చెప్పడం గమనించవచ్చు. తన కారు వెనుక వచ్చిన కేటీఎం బైక్‌ను తాను గమనించలేదని చెప్పి క్షమాపణ కోరినట్లు తెలుస్తోంది. అయితే రైడర్‌, అతని స్నేహితుడు కూడా ఈ ఘటనపై ప్రశాంతంగా స్పందించారు. తాము కూడా వేగంగా ప్రయాణించడంపై క్షమాపణ చెప్పారు.

KTM Rider collides with Maruti Suzuki Alto

కొండ, పర్వత ప్రాంతాల్లో ఎంత నైపుణ్యం కలిగిన రైడర్‌ అయినా.. చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ రోడ్లు ఎత్తుపల్లాలు, ఎక్కువ వంపులు తిరిగి ఉంటాయి. ఫలితంగా ఎదురుగా వచ్చే, ముందున్న వాహనాలు కనిపించే అవకాశం తక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ రోడ్లపై అనుమతించిన వేగంతోనే ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.

భారత మార్కెట్‌లో KTM వాహనాలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. బజాజ్‌ భాగస్వామ్యంతో కేటీఎం తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇటీవలే 2024 KTM 390ను తీసుకొస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ బైక్‌ ఆకర్షణీయమైన డిజైన్‌, అల్లాయ్‌ వీల్స్‌, అడ్జస్టబుల్‌ సస్పెన్షన్‌ సిస్టమ్, 5 అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతో రైడింగ్‌ మోడ్‌ మార్చేందుకు, లాంచ్‌ కంట్రోల్‌ని యాక్టివేట్‌ చేసేందుకు అనుమతి ఇస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 27, 2023, 11:19 [IST]
English summary
Ktm rider crashes maruti suzuki alto car video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+