రోడ్డుపై హీరోయిజం చూపించేందుకు బైక్‌ను గాల్లోకి లేపిన యువకుడు.. ఒక్కసారిగా కిందపడబోయిన యువతి..

ఇటీవల తరచూ పబ్లిక్ రోడ్లపై విన్యాసాలు చేయడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం లాంటివి సంఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. యువత దీన్ని ఒక క్రేజ్ గా భావిస్తూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి స్టంట్స్ ప్రమాదకరమని తెలిసినా ధోరణి మార్చుకోవడం లేదు.

ఇలాంటి సంఘటనలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నా.. తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణాపాయం నుంచి ఓ యువతి తృటిలో తప్పించుకుంది. 'Z900' అనే యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో షేర్ చేశారు. పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి.

KTM-Rider-Video

వీడియోలో ఓ యువకుడు 'కవాసకి నింజా ZX10R' సూపర్‌బైక్‌ను నడుపుతున్నాడు. పబ్లిక్ రోడ్డుపై అతివేగంగా వెళ్తూ ఇతర వాహనదారుల్లో ఆందోళన సృష్టించాడు. అయితే ఆ బైక్ నుంచి సౌండ్ విన్నప్పుడు.. దానిని వేరే డీలర్ వద్ద మౌడిఫై చేసినట్లు తెలుస్తుంది. ఆ బైక్ రోడ్డుపై వెళ్తుండగా అందరి దృష్టి దానిపైనే ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు.

సదరు యువకుడు రోడ్డుపై వెళ్తుండగా ఓ యువతి, యువకుడు KTM డ్యూక్ మోటార్‌సైకిల్‌పై వెళ్తున్నారు. అయితే అతను హెల్మెట్‌తో సహా ఎలాంటి సేఫ్టీ గేర్‌ను ధరించలేదు. కవాసకి నింజా మోటార్‌సైకిల్‌పై కెమెరాలో ఈ దృశ్యం రికార్డయింది. అయితే రోడ్డుపై వెళ్తుండగా ఇద్దరు రైడర్ల మధ్య సంభాషణను చూడవచ్చు.

KTM-Rider-Video

అయితే కవాసకి నింజా బైక్ కు పోటీగా ఉండేందుకు కేటీఎం బైక్ నడుపుతున్న యువకుడు ఒక్కసారిగా వేగాన్ని పెంచాడు. ట్రాఫిక్ ఉన్న రోడ్డుపై సైతం బైక్ వేగంగా నడిపించాడు. ఆ సమయంలో వెనుక కూర్చున్న యువతి ఏ సపోర్ట్ ను పట్టుకోకుండా అలాగే కూర్చుంది. అయితే ఈ బైక్ కు నెంబర్ ప్లేట్ కూడా లేకపోవడం గమనార్హం. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే సమాచారం అందుబాటులో లేదు.

ఈ క్రమంలో కాసేపటి తర్వాత రెండు బైకుల వేగం తగ్గినప్పటికీ కాసేపటి తర్వాత కేటీఎం బైక్ రైడర్.. కవాసకి రైడర్ ను రెచ్చగొట్టేందుకు మళ్లీ వేగం పెంచి ముందు చక్రాన్ని పైకి లేపాడు. దీంతో ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని యువతి.. ఒక్కసారిగా వెనక్కి తూలింది. వెంటనే తనను బ్యాలెన్స్ చేసుకోవడంతో మళ్లీ పైకి లేచి సపోర్టును పట్టుకుంది. లేదంటే యువతి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యేది.

KTM-Rider-Video

ఈ సంఘటనలో ఇద్దరు బైకర్ల తప్పు ఉందని అర్థమవుతోంది. ఇద్దరిలో ఎవరికీ కూడా ఇలా పబ్లిక్ రోడ్డుపై స్పీడుగా వెళ్లడం కరెక్ట్ కాదని గుర్తించలేదు. కేటీఎం రైడర్ వేగంగా వెళ్తుంటే అతడిని రెచ్చగొట్టాడే తప్ప నెమ్మదిగా వెళ్లమని చెప్పలేదు. వీరి తప్పిదం వల్ల తీవ్ర నష్టం జరిగి ఉండేది. కానీ తృటిలో ప్రాణాపాయం తప్పింది.

ఇలా పబ్లిక్ రోడ్లపై స్టంటింగ్ చట్టవిరుద్ధం. ఇది వారికే కాకుండా ఇతరులకూ ప్రమాదం అని వాహనదారులు గుర్తించాలి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. జైలు శిక్షతో పాటు జరిమానాలతో సహా కఠినమైన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీకు స్టంట్స్ చేయాలని అనిపిస్తే, అర్హత కలిగిన సిబ్బంది మార్గదర్శకత్వంలో సరైన భద్రతా పరికరాలతో ప్రైవేట్ రేస్ ట్రాక్‌లపై చేయడం ఉత్తమం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, September 1, 2023, 12:54 [IST]
English summary
Ktm rider pulls sudden front wheel to impress superbike rider girl nearly falls off
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+