Tesla సి‌ఈ‌ఓకి KTR ట్విట్టర్ మెసేజ్: అందులో ఏముందంటే?

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన యుగం ప్రారంభమైపోయింది. ఇందులో భాగంగానే చాలా కంపెనీలు దేశీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసి తమ ఉనికిని చాటుకుంటున్నాయి. అయితే ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అగ్రగామి సంస్థ టెస్లా (Tesla) మాత్రం భారతీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి చాలా అవరోధాలను మరోయు అడ్డంకులను ఎదుర్కొంటున్నట్లు ఆ సంస్థ అధినేత 'ఎలోన్‌ మస్క్‌' సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. అయితే దీనిపైన చాలామంది స్పందించారు.

తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ కూడా టెస్లా అధినేత వ్యాఖ్యలపై స్పందించారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

టెస్లా సి‌ఈ‌ఓకి కే‌టి‌ఆర్ ట్విట్టర్ మెసేజ్: అందులో ఏముందంటే?

టెస్లా ఇంతకు ముందు తెలిపిన సమాచారం ప్రకారం దేశీయ మార్కెట్లో తమ వాహనాలను విడుదల చేస్తామని, దానికి కావాల్సిన సదుపాయాల కోసం ప్రభుత్వాలతో చర్చిస్తున్నట్లు తెలిసింది. కానీ దీనిపైనా ఏ విషయం కూడా స్పష్టంగా తెలియరావడం లేదు. దీనిపైన ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నట్లు తెలిపారు.

టెస్లా సి‌ఈ‌ఓకి కే‌టి‌ఆర్ ట్విట్టర్ మెసేజ్: అందులో ఏముందంటే?

ప్రభుత్వంతో ఎదురువుతోన్న సవాళ్ల కారణంగానే ఇండియాకు టెస్లా రాక ఆలస్యమవుతోందని ఎలోన్ మస్క్‌ ట్విట్టర్‌ లో ఆరోపించారు. అయితే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలన్‌ చేసిన వ్యాఖ్యలపై చాలామంది మండిపడుతున్నారు. దీనిపై KTR స్పందిస్తూ.. భారత్ లో తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తున్నందుకు మస్క్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ/ ఇండియాలో పరిశ్రమల అభివృద్ధికి బోలెడు అవకాశాలున్నాయన్నాయని కూడా ఆయన అన్నారు.

టెస్లా సి‌ఈ‌ఓకి కే‌టి‌ఆర్ ట్విట్టర్ మెసేజ్: అందులో ఏముందంటే?

ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరత విషయాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఇప్పటికే చాలా సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని కూడా తెలిపారు. అయితే టెస్లా ప్రవేశానికి దేశంలో తమ రాష్ట్రం అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుందని, పెట్టుబడులకు మా రాష్ట్రం స్వర్గధామం అని తెలిపారు.

టెస్లా సి‌ఈ‌ఓకి కే‌టి‌ఆర్ ట్విట్టర్ మెసేజ్: అందులో ఏముందంటే?

ప్రపంచంలోనే అతి పెద్ద ఆటో మొబైల్ మార్కెట్లో కలిగిన దేశాల్లో ఒకటైన భారతాదేశంలో తమ కార్లను ప్రవేశపెట్టేందుకు టెస్లా అధినేత కొంత కాలంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపైన మూడేళ్ల నుంచి భారత ప్రభుత్వం మరియు ఎలోన్ మస్క్‌ మధ్య చర్చలు జరుగుతున్నా ఓ కొలిక్కి రావడం లేదు.

టెస్లా సి‌ఈ‌ఓకి కే‌టి‌ఆర్ ట్విట్టర్ మెసేజ్: అందులో ఏముందంటే?

దీనికి ప్రధాన కారణం ఎలన్ విధించిన షరతులే కారణమని కూడా స్పష్టంగా తెలుస్తోంది. మొదట విదేశాల్లో తయారుచేసిన కార్లను ఇండియాలో ప్రవేశపెడతామని, ఆతర్వాతే తయారీ యూనిట్‌ నెలకొల్పుతామని మస్క్ కండిషన్‌ పెట్టాడు. దీంతో పాటు కార్ల దిగుమతిపై సుంకాన్ని కూడా తగ్గించాలని కోరాడు. ఈ విధమైన షరతుల వల్ల ఈ విషయంపైన ఒక స్పష్టమైన రిజల్ట్ బయటపడటం లేదు.

టెస్లా సి‌ఈ‌ఓకి కే‌టి‌ఆర్ ట్విట్టర్ మెసేజ్: అందులో ఏముందంటే?

టెస్లా కంపెనీ ఇదివరకు అందించిన సమాచారం ప్రకారం, కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలో ఓ ఆర్ అండ్ డి (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. అదే సమయంలో తమ తయారీ కేంద్రాన్ని గుజరాత్ రాష్ట్రంలో నెలకొల్పాలని ప్లాన్ చేస్తోంది.

టెస్లా సి‌ఈ‌ఓకి కే‌టి‌ఆర్ ట్విట్టర్ మెసేజ్: అందులో ఏముందంటే?

టెస్లా భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించడానికి గుజరాత్ రాష్ట్రంతో సహా మరికొన్ని ఇతర రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరుపుతోంది. కాగా, గుజరాత్‌లో టెస్లా బేస్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీకి కావల్సిన అన్ని రకాల సహాయాలు మరియు ప్రోత్సాహకాలు తప్పకుండా ఇస్తామని గుజరాత్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

టెస్లా సి‌ఈ‌ఓకి కే‌టి‌ఆర్ ట్విట్టర్ మెసేజ్: అందులో ఏముందంటే?

టెస్లా భారత్‌లో తమ ప్రయాణాన్ని 'మోడల్ 3'తో ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం టెస్లా నుండి అత్యంత పాపులర్ అయిన 'మోడల్ ఎస్' మరియు 'మోడల్ ఎక్స్' ఎలక్ట్రిక్ కార్ల కంటే ముందుగా కంపెనీ ఈ మోడల్ 3ని అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించింది. టెస్లా మోడల్ 3 ఇప్పటికీ కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఉంది.

టెస్లా సి‌ఈ‌ఓకి కే‌టి‌ఆర్ ట్విట్టర్ మెసేజ్: అందులో ఏముందంటే?

టెస్లాను తమ రాష్ట్రానికి ఆహ్వానించేందుకు గుజరాత్‌తో పాటుగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలు సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు టెస్లా అధికారులతో చర్చలు కూడా జరుపుతున్నాయి. అయితే, టెస్లా మాత్రం గుజరాత్ రాష్ట్రాన్నే తమ తయారీ కేంద్రంగా మార్చుకునే అవకాశం ఉంది.

టెస్లా సి‌ఈ‌ఓకి కే‌టి‌ఆర్ ట్విట్టర్ మెసేజ్: అందులో ఏముందంటే?

భారతదేశంలో టెస్లా రాకకు సంబంధించిన ఖచ్చిమైన తేదీలను మరియు దేశంలో టెస్లా కార్ల ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇటీవలే టెస్లా ఐఎన్‌సి బెంగళూరులో ఆర్ అండ్ డి సెటప్ కోసం తమ పేరును రిజిస్టర్ చేసుకుంది. అయితే త్వరలోనే దేశీయ మార్కెట్లో అడుగుపెట్టాలని ఆశిస్తున్నాము.దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన తరువాత ఇది మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Ktr invites elon musk in telangana to set up factory details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X