ఎక్స్‌ప్రెస్ వే పైన తక్కువ వేగంతో ప్రయాణించడం ప్రమాదకరం.. వ్యాపారవేత్త వికాస్‌మాలు లాయర్ కీలకవ్యాఖ్యలు..!
ఇటీవల ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై లగ్జరీ రోల్స్ రాయిస్ కారు 200 కి.మీ వేగంతో, డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో డీజిల్ ట్యాంకర్‌లో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. రోల్స్ రాయిస్ కారులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆగస్టు 22న జరిగింది. అయితే అంత ఖరీదైన వాహనంలో ఎవరున్నారు అంటూ దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.
ఈ ఘటనలో తొలుత డీజిల్ ట్యాంకర్ డ్రైవరే ప్రమాదానికి కారణం అంటూ అంతా భావించారు. అయితే అనంతరం వెలుగులోకి వచ్చిన సీసీ కెమెరాల దృశ్యాలు అసలు విషయాన్ని బయటపెట్టాయి. రోల్స్ రాయిస్ కారు డ్రైవర్ 200 కి.మీ వేగంతో వచ్చి డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిందని వెల్లడయింది.

ఈ రోల్స్ రాయిస్ కారులో కుబేర్ గ్రూప్ డైరెక్టర్ వికాస్ మాలు ఉన్నారు. ఈ ఘటనలో వికాస్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే అంత భారీ ప్రమాదంలోనూ కారు భద్రతా ఫీచర్ల కారణంగా సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం వికాస్ మాలు చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా పలువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఘటనపై వికాస్ మాలు న్యాయవాది రాజేష్ కుమార్ ఠాగూర్ వివరణ ఇచ్చారు. ప్రమాదానికి ముందు వికాస్ మాలు సరిగా నడవలేకపోయారని, ఆ సమయంలో అతని డ్రైవర్ దుస్బీర్ కారును నడిపినట్లు చెప్పారు. డ్రైవర్ దస్బీర్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదుచేసినట్లు చెప్పారు. కారును వేగంగా నడపాలని వికాస్ మాలు డ్రైవర్‌కు చెప్పలేదని.. న్యాయవాది తెలిపారు. అయితే ఎక్స్‌ప్రెస్ వేపైన తక్కువ వేగంతో ప్రయాణించడం చాలా ప్రమాదకరమని న్యాయవాది ఠాగూర్ చెప్పారు.

ఆగస్టు 22న ప్రమాదం జరిగిన సమయంలో రోల్స్ రాయిస్‌లో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. వికాస్ మాలు, డ్రైవర్, మహిళ ఉన్నారని తెలిపారు. ఇంటి నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరారని, గంట తర్వాత ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఎక్స్‌ప్రెస్ వే పైన స్పీడ్ లిమిట్ గంటకు 120 కి.మీ ఉందని, ఆ సమయంలో కారు 100 kmph వేగంతో వెళ్తోందని న్యాయవాది తెలిపారు. డ్రైవర్ సకాలంలో బ్రేకులు వేయలేదన్నారు.
ఈ ఘటన ఆగస్టు 22న ఢిల్లీ - ముంబయి ఎక్స్‌ప్రెస్ వేపైన జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన రోల్స్ రాయిస్ కారు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తొలుత ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని అంతా భావించారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీ టీవీ వీడియో ఆధారంగా అసలు విషయం బయటకు వచ్చింది.

ఈ ప్రమాదానికి డిజిల్ ట్యాంకర్ డ్రైవర్ కారణం కాదని వెల్లడైంది. అతను రోడ్ల భద్రతా నిబంధనలను సరిగ్గానే పాటించిట్లు తెలిసింది. సీసీ టీవీ వీడియో ఆధారంగా లగ్జరీ రోల్స్ రాయిస్ కారు సుమారు 200 కి.మీ వేగంతో ప్రయాణించి, డీజిల్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది.
ప్రమాద ధాటికి రోల్స్ రాయిస్ కారు బోల్తా పడింది. డీజిల్ ట్యాంకర్ కూడా బోల్తా పడింది. అయితే రోల్స్ రాయిస్ కారులో వెంటనే మంటలు అంటుకున్నాయి. ప్రమాదంలో డీజిల్ ట్యాంకర్ డ్రైవర్ సహా మరో వ్యక్తి మృతిచెందాడు. కారులో ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








