కుబేరులే అసూయపడేలా.. కుబేర్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ వికాస్‌ మాలు లగ్జరీ కార్లు.. భారీ సంఖ్యలో సెక్యూరిటీ గార్డులు

ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే పైన ఆగస్టు 22న జరిగిన రోల్స్‌ రాయిస్‌ కారు ప్రమాదంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ప్రమాదంలో రోల్స్‌ రాయిస్‌ కారులో ప్రయాణించిన కుబేర్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ వికాస్‌ మాలు ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు.

ఈ ప్రమాదంలో వికాస్‌ మాలు ప్రయాణించిన రోల్స్‌ రాయిస్‌ కారు సుమారు 200 కి.మీ వేగంతో డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో డీజిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌, మరో వ్యక్తి మృతిచెందారు. రోల్స్‌ రాయిస్‌ కారులో ప్రయాణించిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

vikas malu luxury car collection

ఈ ఘటనలో వికాస్‌ మాలు లగ్జరీ కార్లపై పలువురు ఆరా తీయడం ప్రారంభించారు. వికాస్‌ మాలు ప్రస్తుతం కుబేర్‌ గ్రూప్ చీఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. అతని సంస్థ 45 కంటే ఎక్కువ పరిశ్రమలతో 50 దేశాల్లో విస్తరించింది. కొన్ని నివేదికల ప్రకారం వికాస్‌ మాలు 100 కంటే ఎక్కువ కార్లను కలిగి ఉన్నారు.

ఎన్నో ప్రముఖ బ్రాండ్ల లగ్జరీ కార్లు వికాస్‌ మాలు సొంతం. లంబోర్గిని, బెంట్లీస్‌, రోల్స్‌ రాయిస్‌, మెర్సిడెస్‌, ఆస్టన్‌ మార్టిన్స్‌, మస్టాంగ్‌ వంటి అనేక లగ్జరీ కార్లున్నాయి. ఈ కార్లు అన్ని వికాస్‌ మాలు ఇంటి ఆవరణలోని పార్కింగ్‌ ప్రాంతంలో ఉంటాయి. మరియు ఇంటికి రక్షణగా పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ గార్డులు ఉంటారు.

vikas malu luxury car collection

లంబోర్గిని ఉరుస్, బెంట్లీ కాంటినెంటల్‌ GT మాన్సోరీ కిట్‌, లంబోర్గిని హురాకాన్‌ STO, బెంట్లీ బెంటాయ్‌గా, బెంట్లీ ముల్సాన్‌, మెర్సిడెస్‌ GL600, ముస్టాంగ్‌ రోసియర్స్‌, ఫోర్డ్‌ ముస్టాంగ్‌ GT సహా ఎన్నో ప్రత్యేక ఎడిషన్‌ కార్లు ఉన్నాయి. అన్ని కార్ల నంబర్‌ ప్లేట్లపై 9 అంకె కచ్చితంగా ఉంటుంది. ఈ కార్లు ఎంత ధర ఉంటుందనే సమాచారం కూడా లేదు. అంబానీ స్థాయిలో అత్యంత లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు.

వికా‌స్‌ మాలు కార్లతోపాటు కొన్ని లగ్జరీ కార్లను భద్రతా సిబ్బందికి కేటాయించారు. టయోటా ఫార్చ్యూనర్‌ వంటి కార్లతో సెక్యూరిటీ గార్డులు వికాస్‌ మాలు భద్రతగా ప్రయాణం చేస్తారు. వికాస్‌ మాలు కార్ల కలెక్షన్‌ గురించి తెలుసుకొని దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రముఖ యూట్యూబ్‌ ఛానల్‌ బృందం.. లగ్జరీ కార్లను చూసి షాకైనట్లు తెలిసింది.

vikas malu luxury car collection

ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌ హైవేపై లగ్జరీ రోల్స్ రాయిస్‌ కారు 200 కి.మీ వేగంతో, డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో డీజిల్‌ ట్యాంకర్‌లో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. రోల్స్‌ రాయిస్‌ కారులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆగస్టు 22న జరిగింది. అయితే అంత ఖరీదైన వాహనంలో ఎవరున్నారు అంటూ దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.

ఈ ఘటనలో తొలుత డీజిల్‌ ట్యాంకర్‌ డ్రైవరే ప్రమాదానికి కారణం అంటూ అంతా భావించారు. అయితే అనంతరం వెలుగులోకి వచ్చిన సీసీ కెమెరాల దృశ్యాలు అసలు విషయాన్ని బయటపెట్టాయి. రోల్స్‌ రాయిస్‌ కారు డ్రైవర్‌ 200 కి.మీ వేగంతో వచ్చి డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది.

vikas malu luxury car collection

ఈ రోల్స్‌ రాయిస్‌ కారులో కుబేర్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ వికాస్‌ మాలు ఉన్నారు. ఈ ఘటనలో వికాస్‌ తీవ్రంగా గాయపడ్డారు. అయితే అంత భారీ ప్రమాదంలోనూ కారు భద్రతా ఫీచర్ల కారణంగా గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై వికాస్‌ మాలు న్యాయవాది రాజేష్‌ కుమార్‌ ఠాగూర్‌ వివరణ ఇచ్చారు.

ప్రమాదానికి ముందు వికాస్‌ మాలు సరిగా నడవలేకపోయారని, ఆ సమయంలో అతని డ్రైవర్‌ దుస్బీర్‌ కారును నడిపినట్లు చెప్పారు. కారును వేగంగా నడపాలని వికాస్‌ మాలు డ్రైవర్‌కు చెప్పలేదని.. న్యాయవాది తెలిపారు. అయితే ఎక్స్‌ప్రెస్‌ వేపైన తక్కువ వేగంతో ప్రయాణించడం చాలా ప్రమాదకరమని న్యాయవాది ఠాగూర్‌ చెప్పారు.

More from DriveSpark

Article Published On: Saturday, September 2, 2023, 10:59 [IST]
English summary
Kuber group director vikas malu luxury car collection
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+