టీచర్‌కు మెర్సిడెస్ బెంజ్‌ను బహూకరించిన విద్యార్థి
బహుమానం ఇవ్వాలి అనగానే ఏమిద్దాం అని చాలా మంది తెగ ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించే వారి ఆలోచనలకు ఏ మాత్రం తట్టని విధంగా ఒక ఐదేళ్ల చిన్నారి ఆలోచించింది. తనకు అక్షరాలు దిద్దించిన తన టీచర్‌కు ఏకంగా మెర్సిడెస్ బెంజ్ కారును బహుకరించింది.
ఇండియాలో ఉన్న ప్రముఖ కార్ల కు నిర్వహంచిన క్రాష్ పరీక్షలు, వాటి రేటింగ్
క్రింది గల ఫోటోలో కారు మీద కూర్చున్న చిన్నారి పేరు నూర్ అల్ ఫరిస్ తన టీచర్ నదియాకు మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన కొత్త కారును బహుకరించింది. కారు బ్యానెట్ మీద కూర్చున్న నదియా ప్రక్క వైపున ఉన్న అక్షరాలను గమనిస్తే "ఈ కారు నా ప్రియమైన టీచర్‌కు" అని రాసి ఉంది.

కువైట్‌లోని ప్రాంతీయ మీడియా కథనం ప్రకారం, ఈ కారును నదియా తండ్రి అమె టీచర్‌కు ప్రధానం చేసినట్లు తెలిసింది. నూర్ తల్లి మరణించాక ఆమె విద్య, ఆలన, పాలన మరియు ఎదుగుదలకు తోడ్పడినందుకు గాను కారును ప్రధానం చేసినట్లు నూర్ తండ్రి ప్రముఖ వార్తా పత్రికకు తెలిపాడు.
మునిగిపోయిన టైటానిక్ నౌకను గుర్తు చేసే టైటానిక్ యొత్త అరుదైన ఫోటోలు
అయితే నూర్ తండ్రి పేరు, మెర్సిడెస్ బెంజ్ కారు మోడల్, బహూకరణ జరిగే ప్రదేశం వంటి వివరాలు ఏవీ కూడా వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications